S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవూరు పరిధిలో వ్యక్తి హత్య

నెల్లూరు, జూన్ 7: ఇష్టారీతిగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ తనపై పనిచేసే వ్యక్తిని మరో వ్యక్తి హత్య చేసిన ఘటన కోవూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు కోవూరు పట్టణ సమీపంలో జాతీయ రహదారిపై ఓ హోటల్‌లో ఇస్మాయిల్ (32) చీఫ్ వంటమాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఇతనిది చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం. తన కింద పనిచేసే సిబ్బంది పట్ల ఇస్మాయిల్ తరచూ దురుసుగా ప్రవర్తించేవాడు. అదేవిధంగా టిపి గూడూరు మండలం ఈదూరు గ్రామానికి చెందిన చెంగల్రాయుడు అనే వ్యక్తి అదే హోటల్‌లో సర్వర్‌గా పని చేస్తున్నాడు. ఈనేపథ్యంలో ఇస్మాయిల్ తరచూ చెంగల్రాయుడిని ఇబ్బందులకు గురిచేసేవాడు.

భార్యను కడతేర్చిన భర్త

రాపూరు, జూన్ 7: అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను భర్త అతి కిరాతకంగా కడతేర్చిన సంఘటన రాపూరు మండలం పుమాయి గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు సైదాపురం మండలం కలిచేడు గ్రామానికి చెందిన మునెమ్మకు పుమాయి గ్రామానికి చెందిన పులగల సుధాకర్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇంతవరకు అన్యోన్యంగా జరిగిన జీవితానికి నిదర్శంగా ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఇటీవల వీరి కాపురంలో మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. సుమారు మూడు నెలల క్రితం భర్త వేధింపులు తట్టుకోలేక మునెమ్మ పుట్టింటికి వెళ్లింది.

మార్కెట్‌ను ముంచెత్తిన నకిలీ విత్తనాలు!

ఆదోని, జూన్ 7: వర్షాలు పడ్డాయి. అప్పడే నకిలీ విత్తనాలు గ్రామాలకు డంప్ కావడం జరిగింది. నకిలీ విత్తనాల అమ్మకాలకు రంగం సిద్ధమైంది. ముందస్తుగా అక్రమ వ్యాపారులపై చర్యలు తీసుకోక పోతే నకిలీ విత్తనాలతో రైతులు నట్టేట మునగడం ఖాయం. ఆదోని డివిజన్‌లో ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో మార్కెట్లోలో నకిలీ విత్తనాలే రాజ్యమేలుతున్నాయి. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి పంట వేసిన రైతులు మొలకలు రాక తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు

నంద్యాలటౌన్, జూన్ 7 : పట్టణంలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో పట్టణంలోని ముస్లిం మతపెద్దలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ముస్లింలకు పుష్పగుచ్చం ఇచ్చి రంజాన్ శుభాకాంక్షలు అందజేశారు. పట్టణంలో మద్యం తాగుతూ కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ముస్లింలు ఎస్పీ దృష్టికి తెచ్చారు. ఎస్పీ స్పందిస్తూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ఇబ్బందులకు గురిచేసే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిఎస్పీ హరినాథరెడ్డిని, సిబ్బందిని ఆదేశించారు. రంజాన్‌ను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.

నగరాభివృద్ధికి భారీగా నిధులు

కర్నూలు సిటీ, జూన్ 7:రాష్ట్ర ప్రభుత్వం నగరాభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసిందని మున్సిపల్ పరిపాలన అధికారి కన్నబాబు తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంగళవారం ఇంజినీరింగ్ అధికారులతో సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ నగరంలో దాదాపు రూ. 167 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారని, వాటిని నాణ్యతగా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అమృత్ సిటీ కింద వచ్చిన నిధులను తాగునీటి పైపులైన్లు, ప్రధాన కూడళ్ల అభివృద్ధి, రోడ్ల అనుసంధానికి వినయోగించాలని సూచించారు. అలాగే ప్రధాన రహదారుల్లో గోడలపై వాల్ పెయింట్స్ వేసి సుందర నగరంగా తీర్చిదిద్దాలన్నారు.

జగన్ అభివృద్ధి నిరోధకుడు

కర్నూలు సిటీ, జూన్ 7:రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్ ఉన్నా సిఎం చంద్రబాబు రాష్ట్భ్రావృద్ధికి నిరంతరం కృషి చేస్తుంటే, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ వాటిని అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకుడిగా మారారని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించగా కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌రెడ్డి, కలెక్టర్ విజయమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం కెఇ మాట్లాడుతూ విభజన జరిగినప్పుడు రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉండేదని, అయినా సిఎం చంద్రబాబు రూ. 24వేల కోట్ల రైతు రుణమాఫీ, రూ.

ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలి

కర్నూలు సిటీ, జూన్ 7 : ప్రతి ఉద్యోగి నిబద్ధతతో పని చేసి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ విజయమోహన్ పిలుపునిచ్చారు. నియోజకవర్గ స్థాయిలో అన్ని శాఖలకు సంబంధించిన ప్రణాళికలను ప్రణాళికాబద్ధంగా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఆయా శాఖలకు సంబంధించి సంక్షేమ అభివృద్ధి ప్రణాళికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ఆయా శాఖలకు సంబంధించి జరిగిన అభివృద్ధి, భవిష్యత్తులో జరిగే పనుల లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని వాటి కోసం నివేదికలు తయారు చేయాలన్నారు.

రాష్ట్భ్రావృద్ధికి సిఎం కృషి

ఆళ్లగడ్డ, జూన్ 7: సిఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కోసం అహర్శిశలు పాటుపడుతున్నాడని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. నవన నిర్మాణ దీక్షలలో భాగంగా స్ధానిక ప్రజ్ఞా కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రం రెండుగా విడిపోవడంతో ఎక్కువగా నష్టపోయింది రాయలసీమేనన్నారు. ఎపికి రాజధాని కోసం చంద్రబాబు పడుతున్న కష్టాలు ఎక్కువన్నారు. ముఖ్యమంత్రి రాజధాని కోసం చేపట్టిన దీక్షయే నవ నిర్మాణ దీక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో అందరం కలిసి చేయి చేయి కలిపి రాజధాని కోసం నడుం బిగించాలన్నారు. పేదల అభ్యున్నతికి టిడిపి నిరంతరం కృషి చేస్తోందన్నారు.

రౌడీయిజం చేస్తే కఠిన చర్యలు

చాగలమర్రి, జూన్ 7: రౌడీయిజం పేరుతో అమాయక ప్రజలను బెదిరి స్తూ సతాయిస్తే సహించేది లేదని ఎస్పీ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. మంగళవారం ఆయన చాగలమర్రికి ఆకస్మికంగా వచ్చి గాంధీ సెంటర్ నుంచి మెయిన్ బజారులో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. వ్యాపారుల, విద్యార్థులతో ముచ్చటించారు. ప్రజలు ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి ఆయనతో తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకొని వాటిని పరిశీలించాలన్న ఉద్దేశ్యంతో జిల్లా అంతట ఆకస్మికంగా పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా రౌడీయిజం చేసి బెదిరిస్తే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

మెడిసిన్ రాష్ట్ర టాపర్ హేమలతకు అభినందనలు

కర్నూలు అర్బన్, జూన్ 7:మెడిసిన్‌లో రాష్ట్ర టాపర్‌గా నిలిచిన హేమలతను రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సంఘం చైర్మన్ నాగస్వరం నరసింహం అభినందించారు. నగరంలోని జోహరాపురంలో మంగళవారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన హేమలతకు బంగారు పతకం అందజేసి, శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హేమలత పట్టుదల, కఠోర దీక్షతో సాధన చేసి మెడిసిన్‌లో రాష్ట్ర టాపర్‌గా నిలిచిందని, ఇతర విద్యార్థినులు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అలాగే హేమలత మెడిసిన్ పూర్తి చేసుకుని పేదలకు మంచి వైద్యం అందించాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

Pages