S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు గ్రామాల్లో స్వచ్ఛంద బంద్

ప్రత్తిపాడు, జూన్ 7: తుని ఘటనలకు సంబంధించి అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, లేకుంటే తనను కూడా అరెస్టు చేయాలని ఉద్యమించిన ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా మంగళవారం కిర్లంపూడి, జగపతినగరం, చిల్లంగి మూడు గ్రామాల్లో ఉదయం నుండి రాత్రి వరకు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. కిర్లంపూడి గ్రామంలోకి ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటులచేశారు. సామర్లకోట - ప్రత్తిపాడు మధ్య మంగళవారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయి రవాణా స్తంభించింది.

ముద్రగడను అరెస్టు చేయలేదు

- సులు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను ఎక్కడా ఏవిధంగానూ అరెస్టు చేయలేదని, తుని రైలు దహనం ఘటనపై సిబిసిఐడి దర్యాప్తు చేస్తున్నదని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ అన్నారు. మంగళవారం కిర్లంపూడి పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా కూడా ముద్రగడ పద్మనాభంను అరెస్టు చేయలేదని, సిబిసిఐడి దర్యాప్తులో భాగంగా తునిలో జరిగిన రైలు దహనం ఘటనపై ఎంక్వయిరీ జరుగుతుందన్నారు. అందులో భాగంగా వారి దర్యాప్తు పూర్తయిన తరువాత వేర్వేరు చోట్ల ఉన్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

కక్షతో విభజించారు.. కసితో అభివృద్ధి సాధిద్దాం

కరప, జూన్ 7: ఆనాడు ఏకపక్షంగా, కక్షతో అడ్డగోలుగా విభజించి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని, వారికి కనువిప్పు కలిగేలా ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి కసిగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని కాకినాడ ఎంపి, టిడిపి లోక్‌సభాపక్ష నేత తోట నరసింహం పిలుపునిచ్చారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా సోమవారం మండల కేంద్రమైన కరప చిరంజీవి కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎంపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాటి ప్రభుత్వం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి ఆదాయాన్ని తెలంగాణాకు, అప్పులు ఆంధ్రాకు పంచారని, అలాగే మనకు 80 శాతం అప్పులు, 20 శాతం మాత్రమే ఆస్తులు, రూ.

కాంగ్రెస్‌లేని భారతం

రాహుల్‌కు పగ్గాలు అప్పచెబితే ఎలా ఉంటుందో ఎంవిఆర్ శాస్ర్తీగారు ఈ నెల 4న రాసిన ఉన్నమాటలో చక్కగా విశే్లషించారు. కాంగ్రెస్ లేని భారతం రాహుల్‌కి పట్టం కట్టగానే సంభవం అన్నది పచ్చి నిజమవుతుంది. మరి భాజపా వారికి కాంగ్రెస్ వైపునుండి ఏవిధమైన ప్రతిఘటన ఉండదు.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్టణం
మైనారిటీలుగా మారిపోతున్న హిందువులు

బలహీనపడుతున్న పాలనా వ్యవస్థలు

దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పరిపాలనా వ్యవస్థలు పూర్తిగా బలహీన పడిపోతున్నాయనడంలో సందే హంలేదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ. పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు పునాదిరాళ్ళుగా ఉంటుంటాయి. అయితే అవినీతి జాడ్యంవల్ల మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్ధే బీటలువారుతోంది. వాస్తవ సిద్ధాంతంలో ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. అయితే రాజ్యాధికారం ప్రజలపైనే చెలాయించటం ఇక్కడి వైపరీత్యం. భారతదేశంలో ప్రజాస్వామ్యంపైకి బాగానే కనిపిస్తుంది . కానీ లోలోపల అంతా రాజరికపు అవలక్షణాలే ప్రతిబింబిస్తుంటాయి. అర్ధ ప్రజాస్వామ్యం అర్ధరాచరికపు లక్షణాలు సైతం పరిపాలనలో కనుపిస్తుంటాయి.

- ఎన్.నాగేశ్వరరావు

విద్యుత్ నియామకాలపై వివాదం!

చింతూరు, జూన్ 7: విలీన మండలాలైన చింతూరు, విఆర్ పురం, కూనవరం, ఎటపాక మండలాల్లోని ఏడు విద్యుత్ ఫీడర్లలో పనిచేసేందుకు 28 మందిని కాంట్రాక్టు కార్మికుల నియామకం వివాదాస్పదంగా మారింది. స్థానిక ఆదివాసీ యువకులను కాదని కాంట్రాక్టరు బయటివారిని నియమించారని మంగళవారం ఆందోళనకు దిగారు. కాంట్రాక్టు కార్మికుల నియామక బాధ్యతను విద్యుత్ ఉన్నతాధికారులు దీంతో సదరు కాంట్రాక్టర్ గత నెలరోజుల క్రితం రాజమహేంద్రవరంలోని తన నివాసం వద్ద దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి 28 మందికి ఉద్యోగాలు ఇస్తున్నట్టు లెటర్లు ఇచ్చారు.

ముద్రగడ తరలింపుతో రావులపాలెంలో ఉత్కంఠ

రావులపాలెం, జూన్ 7: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అరెస్టుతో మంగళవారం రావులపాలెంలోనూ ఉత్కంఠ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అమలాపురంలో ముద్రగడను అరెస్టు చేసిన సిఐడి పోలీసులు భారీ బందోబస్తు నడుమ రావులపాలెం మీదుగా తరలించారు. ముద్రగాడను అరెస్టు చేసి రావులపాలెం మీదుగా తరలిస్తున్న సమాచారం అందడంతో ఎస్‌ఐ త్రినాథ్, అదనపు ఎస్‌ఐ పి శోభన్‌కుమార్ సిబ్బందితో స్థానిక కళావెంకట్రావు సెంటర్లో జాతీయ రహదారిపై బందోబస్తు నిర్వహించారు. అమలాపురం నుండి వచ్చిన పోలీసుల వాహన శ్రేణి వెళ్లేందుకు వీలుగా ట్రాఫిక్‌ను నియంత్రించారు.

భూయజమానులతో ప్రత్యేకాధికారి చర్చలు

రాజోలు, జూన్ 7: మండలంలోని పాలగుమ్మి, బి సావరం, శివకోడు గ్రామాల మీదుగా వెళుతున్న 216 జాతీయ రహదారి రూటును ప్రత్యేకాధికారి, డిప్యూటీ కలెక్టర్ జి రాధాకృష్ణ మంగళవారం పరిశీలించారు. రహదారి నిర్మాణానికి అభ్యంతరాలు తెలిపిన 45 మంది భూ యజమానులతో ఆయన రాజోలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులతో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారి రూటు మ్యాప్‌ను మార్చి శివకోడు, పాలగుమ్మి, బి సావరంలలో తమ భూములు, ఇళ్లకు నష్టం కలగకుండా చూడాలని స్థానికులు ప్రత్యేకాధికారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని ప్రత్యేకాధికారి ఈ సందర్భంగా వారికి స్పష్టంచేశారు.

నచ్చిన పనితోనే సంతృప్తి

ఈ మధ్య ఏ పత్రిక తిరగేసినా వృద్ధుల దైన్యస్థితి పిల్లల నిరాదరణ వంటి అంశాల మీద కథలు, వ్యాసాలు వస్తూ ఉన్నాయి. ఉదయం పూచిన పూవు సాయంకాలానికి వాడిపోవటం ఎంత సహజమో వృద్ధాప్యం కూడా అంతే. మరీ మంచాన పడి తమ పనులుకూడా తాము చేసుకోలేని వారిని మినహాయించి కొన్ని వర్గాలుగా వృద్ధులను విభజించవచ్చు. 1. ప్రభుత్వ ఉద్యోగులు. వీరు సర్వీసులో తీసుకొన్న జీతానికి రెండింతల పెన్షను పొందుతూ ఉంటారు. పిల్లాజెల్లలు స్థిరపడే ఉంటారు (చాలావరకు). బి.పి, షుగర్లు, కళ్ళు, పళ్ళు, కాళ్ళు, కీళ్ళ చెవుడు వంటి బాధలు అన్నివర్గాల వారికి సమానమే అయినా ప్రభుత్వోద్యోగి అయితే ఉచిత వైద్యమో, రీయంబర్స్‌మెంట్ సౌకర్యాలు ఉంటాయి. 2.

- ఆయి కమలమ్మ

ఒరిగిపోయన బొబ్బిలి బ్రిడ్జి

కడియం, జూన్ 7: కడియంలో చారిత్రాత్మకమైన బొబ్బిలి బ్రిడ్జి మంగళవారం ఒరిగిపోయింది. సామర్లకోట - ధవళేశ్వరం ఈస్ట్రన్ డెల్టా కాలువపై బ్రిటీష్ హయాంలో నిర్మించిన ఈ వంతెన ఎనిమిది దశాబ్దాలపాటు సేవలందించింది. 1935లో నిర్మించిన ఈ బ్రిడ్జి కాల పరిమితి పూర్తవడంతో 2004లో అప్పటి ఆర్‌అండ్‌బి మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు రూ.కోటి 60 లక్షలతో మరో వారధి నిర్మించారు. అయితే పూర్తి ఇనుప గడ్డర్లతో ఉన్న ఈ వంతెనను చారిత్రాత్మక కట్టడంగా గుర్తించి రంగులు వేయించాలని స్థానికులు అధికారులకు పదేపదే విజ్ఞప్తులు చేసినా బ్రిడ్జి పట్ల నిర్లక్ష్యం కనబరచడంతో గడ్డర్లు తుప్పుపట్టి ఒరిగిపోయే పరిస్థితి ఏర్పడింది.

Pages