S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైటెక్ మోసం

ముండ్లమూరు, జూన్ 7 : మండలంలోని సుంకరవారిపాలెం గ్రామానికి చెందిన చిట్టిబోయిన గురుప్రసాద్ బ్యాంకు ఖాతా నుండి మంగళవారం ఏడువేల రూపాయల నగదును గుర్తుతెలియని వ్యక్తులు డ్రాచేసుకున్నట్లు బాధితుడు ముండ్లమూరు పోలీసులకు తెలిపారు. బాధితుని కథనం మేరకు గురు ప్రసాద్‌కు మారెళ్ళ సిండికేట్ బ్యాంకులో ఖాతా ఉంది.

లారీ డ్రైవర్‌పై దొంగలదాడి

అద్దంకి, జూన్ 7: అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్టర్రహదారిపై రాత్రివేళల్లో వాహనాలపై దాడిచేసి, దోపిడీకి దొంగలు పాల్పడుతున్నారు. వివరాల ప్రకారం సోమవారం రాత్రి రాష్టర్రహదారిపై చెన్నై నుండి హైదరాబాద్‌కు లోడుతో లారీ వెళ్తుండగా, ఎస్‌ఎల్.గుడిపాడు గ్రామం సమీపంలో కొందరు వ్యక్తులు కారుతో లారీని వెంబడించి లారీని ఆపివేశారు. లారీడ్రైవరు (్ఢల్లీబాబు) వద్ద నున్న 2500 రూపాయలు తీసుకున్నారు. లారీడ్రైవరును కారులో ఎక్కించుకుని అతని వద్దనున్న ఎటిఎం ద్వారా కొమ్మాలపాడు గ్రామంలోని ఎటిఎంలో 1500 రూపాయలు తీయించారు.

ధరలు గిట్టబాటు కాక వేలాన్ని అడ్డుకున్న పొగాకు రైతులు

పొదిలి, జూన్ 7 : పొదిలి పొగాకు బోర్డులోని 1, 2 వేలం కేంద్రాల్లో తమకు గిట్టుబాటు ధరలు రావడం లేదంటూ మంగళవారం పొగాకు రైతులు అర్ధాంతరంగా వేలాన్ని అడ్డుకుని అమ్మకాలను ఆపివేశారు. స్థానిక 1వ వేలంకేంద్రానికి గంగవరం క్లస్టర్‌కు చెందినరైతులు 600 పొగాకుబేళ్ళను విక్రయానికి తీసుకు వచ్చారు. వాటిలో 103 బేళ్ళకు విక్రయాలు జరిగాయి. అదే విధంగా 2వ వేలం కేంద్రానికి కంభం క్లస్టర్‌కు చెందినరైతులు 300 బేళ్ళను వేలానికితీసుకు వచ్చారు. వాటిలో 30 బేళ్ళకు మాత్రమే విక్రయాలు జరుగుతుండగా తమకు సరైన ధరలు రావడం లేదంటూ రెండువేలం కేంద్రాల్లోని రైతులు ఆగ్రహించి వేలాన్ని నిలిపి వేయించారు.

అలుపెరగని పోరాట యోధుడు పాలస్

కందుకూరు, జూన్ 7: అలుపెరగని ఉద్యమ పోరాట యోధుడు సుదర్శి పాలస్ అని పలువురు నేతలు కొనియాడారు. కార్మిక, కర్షక, బలహీన వర్గాల ప్రజల కోసం అలుపెరగని ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి సోమవారం మృతి చెందిన పాలస్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం మంగళవారం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఉంచారు.

రోజుకో పుకారు పుడుతున్న వేళ..

నెల్లూరు, జూన్ 7: ఇప్పటికే గత ఆరు నెలల వ్యవధిలో సుమారు పాతికకు పైగా భూప్రకంపనలను చవిచూశారు. ఇప్పటిదాకా తీవ్రత లేకున్నా, రాబోయే రోజుల్లో పరిస్థితి ఏమిటని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. అటువంటి వారిలో మనోధైర్యం కల్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కానీ అధికారుల చర్యలకు ఆటంకం కలిగించేలా రోజుకో కొత్త పుకారు ఆ ప్రాంతంలో పుట్టుకొస్తోంది. ఈనెల 9వ తేది తీవ్ర భూకంపం వస్తుందంటూ కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నట్లు అధికారుల దృష్టికి కూడా వచ్చింది. దీనిపై ఇప్పటికే ప్రభావిత గ్రామాలన్నింటిలోనూ అధికారులు దండోరా వేయించి ఎటువంటి ప్రమాదం లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భరోసా కల్పిస్తున్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

నెల్లూరు, జూన్ 7: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు చంద్రబాబునాయుడుతోనే సాధ్యమన్నారు. మంగళవారం నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో నవ నిర్మాణ దీక్షలో భాగంగా ఏర్పాటు చేసిన సంక్షేమ కార్యక్రమాల చర్చా కార్యక్రమాల్లో మంత్రి నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.

విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

నెల్లూరుసిటీ, జూన్ 7: తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయకపోతే ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని రాష్ట్ర ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు పవన్‌తేజ డిమాండ్ చేశారు. మంగళవారం ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విద్యార్థులకు ఎన్నికలలో ఇచ్చిన 34 వాగ్దానాల అమలు కోసం ఎన్‌ఎస్‌యుఐ పోరుబాట పడుతుందన్నారు. అధికార తెలుగుదేశం ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారం విషయంలో మొద్దు నిద్ర పోతోందని మండిపడ్డారు.

అన్ని గ్రామాలకూ బస్సు సౌకర్యం

నెల్లూరు, జూన్ 7: రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడంతోపాటు అన్ని బస్టాండ్లలో సౌకర్యాలు మెరుగుపర్చడానికి చర్యలు తీసుకుంటున్నామని రోడ్లు భవనాలు, రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా మంగళవారం కోవూరులోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 19 ఓడరేవుల నిర్మాణానికి అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా తమ ప్రభుత్వం డిజైన్లు రూపకల్పన చేస్తోందని అన్నారు. జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుతోపాటు దుగరాజుపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే జిల్లాలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

భయాందోళన వద్దు:కలెక్టర్

నెల్లూరు, జూన్ 7: జిల్లాలోని వింజమూరు, వరికుంటపాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో గత కొన్ని నెలలుగా వస్తున్న భూప్రకంపనలకు స్థానికులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటి వల్ల ఎటువంటి ప్రమాదం ఉండబోదని జిల్లా కలెక్టర్ ఎం.జానకి స్పష్టం చేశారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎన్‌జిఆర్‌ఐ శాస్తవ్రేత్తలతో కలిసి ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ భూప్రకంపనలు వచ్చిన ప్రాంతాల్లో కొందరు పనిగట్టుకొని పుకార్లు పుట్టిస్తున్నారని, వాటిని నమ్మవద్దని హితవు పలికారు. అటువంటి వారి గురించి తమకు సమాచారం అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎంబిబిఎస్ సీటు ఇప్పిస్తామంటూ మోసం

నెల్లూరు, జూన్ 7: తన కుమారుడికి ఎంబిబిఎస్ సీటు ఇప్పిస్తామంటూ రూ.60 లక్షల మేర కొందరు తనను మోసం చేసినట్లు టి.మహేష్‌కుమార్ అనే వ్యిక్తి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బివి నగర్‌కు చెందిన మహేష్‌కుమార్ కుమారుడికి బెంగళూరులోని తమకు తెలిసిన కళాశాలలో ఎంబిబిఎస్ సీటు ఇప్పిస్తామంటూ మూలాపేట అలంకార్ సెంటర్‌కు చెందిన డి.శ్రీనివాసులుతో పాటు మరో ఐదుగురు మహేష్ వద్ద నుంచి 2015లో రూ.60 లక్షలు వసూలు చేశారు. చెప్పిన మాట ప్రకారం సీటు ఇప్పించకపోవడంతో మహేష్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 4వ నగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Pages