S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభినవ అశోకుడు చంద్రబాబు

మంగళగిరి, జూన్ 7: రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన సాగుతోందని , రెండేళ్లుగా చంద్రబాబు శ్రామికుడిగా తీరిక లేకుండా శ్రమిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నవ నిర్మాణదీక్ష వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక అధికారి నాగశివరావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి కిషోర్‌బాబు ప్రసంగిస్తూ ఐదుకోట్ల మంది ప్రజలు సుభిక్షంగా ఉండాలని, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్‌గా చేయాలని, అశోక్ చక్రవర్తి పాలన స్ఫూర్తిగా పనిచేస్తున్న చంద్రబాబు అభినవ అశోకుడని అన్నారు.

కఠోర నియమ నిష్టలతో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం

గుంటూరు (కల్చరల్), జూన్ 7: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ముస్లింలు, వారి కుటుంబాలు అత్యంత పవిత్రంగా భావించే ఖురాన్ గ్రంథం అవతరించిన పుణ్యమాసం రంజాన్ సోమవారం సాయంత్రం నెలవంక దర్శనంతో ప్రారంభం కాగా మంగళవారం నుంచి ఉపవాస దీక్షలను నగరంలో కఠోర నియమనిష్టలతో ముస్లింలు ప్రారంభించారు. తెల్లవారుజామున ఉపవాస దీక్ష ప్రారంభానికి ముందే సహారీని స్వీకరించి అనంతరం రోజంతా ఉపవాస దీక్షలను కొనసాగించారు. సాయంత్రం ఉపవాసం అయిన తరువాత ఖర్జూర ఫలాలను దైవ ప్రసాదంగా స్వీకరించి అనంతరం ఇఫ్తార్‌ను విందుగా అందుకున్నారు.

డ్వాక్రా సంఘాల నవ నిర్మాణ ర్యాలీ

తాడికొండ, జూన్ 7: మండల పరిధిలోని పొనె్నకల్లు, లాం, నిడుముక్కల, తాడికొండ గ్రామాల్లో మంగళవారం డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నవనిర్మాణ ర్యాలీ జరిగింది. పొనె్నకల్లులో జరిగిన డ్వాక్రా మహిళల గ్రామసంఘ సమావేశంలో సామాజిక పెట్టుబడి నిధి మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నవనిర్మాణ దీక్షలో తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం జి సుజాత, సర్పంచులు జి శివలీల, పప్పుల రవికుమారి, దాసరి సుభాషిణి, నూతక్కి నవీన్‌కుమార్, ఎంపిపి డి సీతామహాలక్ష్మి, సిసిలు గోపినాధ్, సైదా, మాధవి, కనకారావు, శ్రీలక్ష్మి, మండల సమాఖ్య అధ్యక్షురాలు చీకటి మరియమ్మ పాల్గొన్నారు.

నాగమ్మ దేవత వార్షిక మహోత్సవం

పెదకూరపాడు, జూ న్ 7: గ్రామంలో స్వ యంభువుగా వెలిసిన నాగమ్మ దేవత వార్షిక మహోత్సవాలు మంగళవారం వైభవం గా జరిగాయి. ఉద యం 6 గంటల నుండి భక్తులు నాగమ్మదేవతకు పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి పొంగళ్లను నివేదించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన యజ్ఞ కార్యక్రమంలో పుణ్య దంపతులు పాల్గొన్నారు. కార్యనిర్వాహక బృందం వారు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

జూట్‌మిల్లుకు ఇచ్చిన ప్లాన్‌ను రద్దుచేయాలి

గుంటూరు, జూన్ 7: భజరంగ్ జూట్‌మిల్లుకు సంబంధించిన 5 ఎకరాల 28 శెంట్లలో ఉన్న స్థలానికి మునిసిపల్ కార్పొరేషన్ ఇచ్చిన ప్లాన్‌లో అనేక అవకతవకలు ఉన్నాయని, తక్షణం ప్లాన్‌ను రద్దుచేయాలని జూట్‌మిల్లు పరిరక్షణ సమితి నాయకులు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మికి విజ్ఞప్తిచేశారు. మంగళవారం ఈ మేరకు కమిషనర్‌ను ఆమె కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు తదితరులు మాట్లాడుతూ స్థలానికి సంబంధించి కొలతలు గానీ, అక్కడ ఉన్న కట్టడాలు, పురాతన దేవాలయ తదితరాలను చూపించలేదని అన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల నూతన భవనాలకు కృషి

సత్తెనపల్లి, జూన్ 7: నియోజకవర్గంలో శాశ్వత భవనాలకు నోచుకోని అంగన్‌వాడీ కేంద్రాలకు నూతన భవనాలను నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. అంగన్‌వాడీ పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక మార్కెట్‌యార్డులో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఐసిడియస్ పిడి నిర్మల అధ్యక్షత వహించారు. యుద్ధ ప్రాతిపదికన నిర్వహించి చేపట్టిన 20 వేల మరుగుదొడ్ల నిర్మాణాలలో అంగన్‌వాడీల పాత్ర చెప్పుకోదగినదని అన్నారు. పుట్టిన బిడ్డ ఆరోగ్య సంరక్షణ బాధ్యత వెయ్యిరోజులపాటు తట్లితండ్రులతోపాటు అంగన్‌వాడీలపైన కూడా ఉందని అన్నారు.

ఆళ్లగడ్డ హెడ్‌కానిస్టేబుల్‌కు ఐదేళ్ల ఖైదు

గుంటూరు (లీగల్), జూన్ 7: పోలీసు అన్న అహంకారంతో ప్రయాణికుడిపై దౌర్జన్యం చేయడంతో పాటు చేతిలో ఉన్న పిస్టల్‌తో కాల్చి చంపేందుకు దూకుడు ప్రదర్శించిన ఓ హెడ్‌కానిస్టేబుల్ భారీ మూల్యానే్న చెల్లించుకున్నాడు. అతనికి ఐదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గుంటూరు ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి, చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ హోదాలో గుంటూరు రైల్వేజోన్ కేసులు విచారించే న్యాయమూర్తి ఓ వెంకట నాగేశ్వరరావు మంగళవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం...

మహిళాభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే శ్రీ్ధర్

అమరావతి, జూన్ 7: మహిళల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ అన్నారు. మంగళవారం స్థానికంగా వెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో సుమారు 10 లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేసిన మహిళా కిరాణా వర్తక సంఘాన్ని ఎమ్మెల్యే శ్రీ్ధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఎపిఎం ఎస్‌వి కృష్ణప్రియ అధ్యక్షత వహించారు. మండల పరిధిలోని 50 కిరాణా షాపులను ఒక సొసైటీగా చేసి మినీ సూపర్‌బజారును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే శ్రీ్ధర్ మహిళలనుద్దేశించి మాట్లాడుతూ డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోందన్నారు.

రెండో రోజుకు ఇంజనీరింగ్ కౌనె్సలింగ్

కాకినాడ, జూన్ 7: జిల్లాలో రెండవ రోజు ఇంజనీరింగ్ కౌనె్సలింగ్ ప్రక్రియ సజావుగా జరిగింది. వెబ్ కౌనె్సలింగ్ కావడంతో తొలిరోజైన సోమవారం సర్వర్లు మొండికేయడంతో కౌనె్సలింగ్ ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలిగిన విషయం తెలిసిందే! మంగళవారం కూడా ప్రారంభంలో సర్వర్ సమస్య ఎదురైనప్పటికీ ఎట్టకేలకు కౌనె్సలింగ్‌ను సజావుగా నిర్వహించగలిగారు. రెండోరోజు జెఎన్‌టియుకె సహాయ కేంద్రానికి సంబంధించి 15001 నుండి 20 వేల ర్యాంకుల లోపు విద్యార్థులు కౌనె్సలింగ్‌కు హాజరుకావల్సి ఉండగా మొత్తం 250 మంది విద్యార్థులు హాజరైనట్టు కౌన్సిలింగ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జివిఎస్‌ఆర్ దీక్షితులు చెప్పారు.

కోనసీమలో నిషేధాజ్ఞలు

అమలాపురం, జూన్ 7: ఊహించని విధంగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మంగళవారం అమలాపురం పోలీస్ స్టేషన్‌కు ఆకస్మికంగా చేరుకుని బైఠాయించడంతో కంగుతిన్న పోలీసులు అమలాపురం డివిజన్‌లో హై అలర్ట్ ప్రకటించారు. సెక్షన్ 30తో పాటు కోనసీమ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించినట్టు డిఎస్పీ ఎల్ అంకయ్య తెలిపారు. ఈ సంఘటనను బట్టి ముద్రగడ ఎత్తుగడలు ఎప్పుడు ఎలా ఉంటాయోనన్న అంశాన్ని ఊహించటంలో పోలీసులకు కత్తిమీద సాములాగే తయారైంది. కాపు ఐక్య గర్జన బహిరంగ సభలోనూ ఇదే జరిగింది.

Pages