S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బతుకు బస్టాండే! (తరలింపు తిప్పలు - 3)

విజయవాడ, జూన్ 7: రాష్ట్ర విభజన కార్చిచ్చు ప్రభుత్వోద్యోగుల మెడకు పామైచుట్టుకుంది. ఉద్యోగుల సంసారాలను నిలువునా చీల్చేసింది. విభజన తరువాత కొత్త రాజధాని ఎక్కడ ఏర్పడితే అక్కడికి తరలి వెళ్లిపోవాలన్న విషయం ఉద్యోగులకు తెలియంది కాదు. ఇందుకు చాలామంది ఉద్యోగులు మానసికంగా సిద్ధపడ్డారు కూడా. కాకపోతే దాని తీవ్రత ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. తరలింపు వ్యవహారం కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితిని తెస్తోంది. అలాగే అధికారుల మధ్య సమన్వం లేకపోవడం, ఎంసెట్ కౌన్సిలింగ్ మొదలైనా స్థానికత అంశం తేలకపోవడంతో తరలిరావల్సిన ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారు.

నన్ను అరెస్టు చేయండి! అమలాపురంలో ముద్రగడ హైడ్రామా

కాకినాడ/రాజమహేంద్రవరం, జూన్ 7: తుని విధ్వసం ఘటన నేపథ్యంలో జరుగుతున్న అరెస్టులు మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ముందుగా తనను అరెస్టుచేయాలంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరికొందరు నేతలతో కలిసి ఉదయం అమలాపురం పోలీసు స్టేషన్‌లో బైఠాయించడంతో మొదలైన హైడ్రామా ఆయనను పోలీసు వ్యాన్‌లో స్వగ్రామం కిర్లంపూడి తరలించడంతో ఊహించని మలుపుతిరిగింది. తుని ఘటనలో ఇప్పటివరకు అరెస్టుచేసిన వారందరినీ బేషరతుగా విడిచిపెట్టాలనే డిమాండుతో పోలీసు వ్యాను నుండి దిగడానికి ముద్రగడ నిరాకరించడంతో వ్యవహారం పతాకస్థాయికి చేరుకుంది. రాత్రి వరకు ఆయనను ఒప్పించడానికి పోలీసులు ప్రయత్నాలు సాగించారు.

కలసికట్టుగా..!

వాషింగ్టన్, జూన్ 7: భారత్-అమెరికాలు అన్ని రంగాల్లోనూ భుజం భుజం కలిపి పనిచేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఓవల్ హౌజ్‌లో గంటకుపైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాము చర్చించిన అనేక అంశాలను సంయుక్త విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. 2008లో ఇరు దేశాల మధ్య కుదిరిన చారిత్రక పౌర అణు ఇంధన ఒప్పందం అమలు పురోగతిపై మోదీతో తాను చర్చించినట్టు ఒబామా వెల్లడించారు. ప్రాంతీయ భద్రతకు సంబంధించిన అనేక అంశాలపైనా తాము చర్చలు జరిపామని, అలాగే సైబర్ సెక్యూరిటీ విషయంలోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు.

లక్ష్య సాధనకు మహా సంకల్పం

విజయవాడ, జూన్ 7: చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టి సరిగ్గా నేటికి రెండేళ్లు. సమస్యలు, సవాళ్లు చంద్రబాబుకు స్వాగతం పలికాయి. విభజన నేపథ్యంలో కట్టుబట్టలతో బయటపడ్డ ఆంధ్రప్రదేశ్‌ను ఒక గాడిలో పెట్టేందుకు ముళ్ల కిరీటాన్ని తలకెత్తుకున్నారు చంద్రబాబు. భారీ ఆర్థిక లోటుతో ప్రభుత్వ కార్యకలాపాలను ఆయన ప్రారంభించాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పలు చర్యలు తీసుకున్నారు. రైతుల, డ్వాక్రా మహిళల రుణ మాఫీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంపు ఫైళ్ళపై సంతకాలు చేసిన సంచలనం సృష్టించారు.

అవును.. నిజమే!

బీజింగ్, జూన్ 7: నిన్న మొన్నటి వరకూ పాకిస్తాన్‌ను వెనకేసుకొచ్చిన చైనా ఒక్కసారిగా దిగ్భ్రాంతికర వాస్తవాన్ని వెల్లడించింది. 2008లో ముంబయి ఉగ్రవాద దాడి వెనుక పాక్ పాత్ర, అలాగే లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నాయంటూ మొట్టమొదటిసారిగా ధ్రువీకరించింది. భారత ఆర్థిక రాజధాని ముంబయిపై 2008 నవంబర్‌లో పదిమంది లష్కరే ఉగ్రవాదులు దాడి జరిపి మారణకాండ సృష్టించడం, 166మంది ప్రాణాలు బలికొనడం తెలిసిందే. ముంబయి ఉగ్రవాద మారణకాండపై కొద్దిరోజుల క్రితమే ఓ డాక్యుమెంటరీని చైనా అధికారిక చానెల్ సిసిటివి9 ప్రసారం చేసింది.

విజయవాడకు మారిన కాలేజీల వార్

హైదరాబాద్, జూన్ 7: హైదరాబాద్‌లో కార్పొరేట్ కాలేజీలు నారాయణ, వెలాసిటీల మధ్య కొట్లాట విజయవాడకు మారింది. వెలాసిటీలో పనిచేస్తూ అదృశ్యమయ్యారని చెబుతున్న అశ్వత్థరావు మంగళవారం విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. అశ్వత్థరావు కోసం అనే్వషించిన వెలాసిటీ బృందం తెలంగాణ ప్రాంత నారాయణ కాలేజీల జిఎం కాట్రగడ్డ శ్రీనివాస్, రాయలసీమ ఇన్‌చార్జి విజయభాస్కర రెడ్డిలపై మంగళవారం ఒత్తిడి తేవడంతో, కాట్రగడ్డ శ్రీనివాస్ ఇంటికి తాళాలు వేసుకుని అదృశ్యమయ్యారు. మరోపక్క వెలాసిటీ సంస్థ ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో వ్యవహారం రసవత్తరంగా మారింది.

గ్రామీణ ప్రాంత్రపజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు అధ్యయనం

ఒంగోలు,జూన్ 7 : జిల్లాలో పేదరికం, కరవు పరిస్థితుల్లో ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలను ఆదుకోవడంతో పాటు వారి జీవనప్రమాణాలు పెంపొందించేందుకు అధ్యయనం చేయడానికి కృషి చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ అంతర్జాతీయ సంస్థ ఐఫాడ్ ప్రతినిధి ఫ్రాన్స్‌కు చెందిన హెలెన్ తెలిపారు. మంగళవారం ఉదయం ఐఫాడ్ సంస్థ ప్రతినిధులు లైవ్‌స్టాక్ స్పెషలిస్ట్ హెలెన్, ఎకనామిస్ట్ పూజ, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్‌లాల్‌ను ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

జగన్‌తో బాలినేని భేటి

ఒంగోలు,జూన్ 7: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాజీ మంత్రి, ఒంగోలు మాజీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసులురెడ్డి హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో మంగళవారం భేటి అయ్యారు. వీరిద్దరి సమావేశంలో జిల్లాపార్టీఅధ్యక్ష బాధ్యతలపై చర్చ నడిచింది. జిల్లాపార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవాలని జగన్ బాలినేని శ్రీనివాసరెడ్డికి సూచించటం జరిగింది. దీంతో జగన్ సూచనకు బాలినేని సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ మేరకు మరో రెండు,మూడురోజుల్లో జగన్ బాలినేని పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. సోమవారం బాలినేని నూతనోత్సహంతో ఒంగోలుకు రానున్నారు.

బిఇడి పరీక్షల్లో భారీగా మాస్ కాపీయింగ్

కంభం, జూన్ 7: బిఇడి పరీక్షల్లో గుట్టుచప్పుడు కాకుండా మాస్‌కాపీయింగ్ చేయిస్తుండగా, యూనివర్సిటీ స్క్వాడ్ అధికారుల బృందం సెంటర్‌ను సందర్శించి తనిఖీలు చేస్తుండగా భారీగా స్లిప్‌లు బయటపడవేయడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. కంభం చేగిరెడ్డి లింగారెడ్డి విద్యాసంస్థల్లో ఈ ఏడాది బిఇడి పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. మంగళవారం మొదటి సంవత్సరం సెమిస్టర్ సోషియాలజీ పరీక్ష జరుగుతుండగా ఇన్విజిలేటర్లు ఏకధాటిగా మాస్‌కాపీయింగ్‌కు అనుమతి ఇస్తూ పరీక్షలు రాయిస్తున్నారు. ఈ ఏడాది కంభంలో రెండు పరీక్ష కేంద్రాలు కేటాయించగా స్క్వాడ్ అధికారులు ఒక పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేయడంతో మాస్‌కాపీయింగ్ బయటపడింది.

జగన్ దర్శకత్వంలో నటిస్తున్న ముద్రగడ

మార్కాపురం, జూన్ 7: రాజకీయ లబ్ధికోసం జగన్ దర్శకత్వంలో ముద్రగడ పద్మనాభం నటిస్తూ కాపులను మోసం చేస్తున్నారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ యలమంచిల రామాంజం ఆరోపించారు. మంగళవారం ఈ విలేఖరికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాను ముద్రగడకు ఐదు ప్రశ్నలతో ఉత్తరం రాశానని, ఇంత వరకు వాటికి సమాధానం చెప్పలేదని అన్నారు.

Pages