S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల్లో అరుంధతీ భట్టాచార్య

ముంబయి, జూన్ 7: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య.. ఆర్థిక రంగంలో ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఐదో స్థానంలో నిలిచారు. నిరుడుతో పోల్చితే ఈసారి భట్టాచార్య ఐదు స్థానాలు ఎగబాకడం గమనార్హం. ఇక ప్రపంచంలో వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల్లో భట్టాచార్య ఐదో స్థానంలో ఉన్నారని ఓ ప్రకటనలో మంగళవారం ఎస్‌బిఐ చెప్పింది. ఈ జాబితాలో రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, శాస్త్ర, పెట్టుబడుల, దాతృత్వ విభాగాలకు చెందిన మహిళలున్నారు. సిఇఒలు కూడా ఉన్నారు. 200 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన ఎస్‌బిఐకి సారథిగా ఉన్న భట్టాచార్య..

చెక్ అథ్లెటిక్ మీట్‌లో లూకాకు రజతం

న్యూఢిల్లీ, జూన్ 7: మన దేశం తరఫున రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన టింటు లూకా (27) చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో జరిగిన జోసెఫ్ ఓడ్లోజిల్ మెమోరియల్ అథ్లెటిక్ మీట్‌లో మహిళల 800 మీటర్ల రేసును 2:00.61 నిమిషాల్లో పూర్తిచేసి ఈ సీజన్‌లోనే అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేయడంతో పాటు రజత పతకాన్ని దక్కించుకుంది. సోమవారం రాత్రి జరిగిన ఫైనల్‌లో 2013 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతక విజేత అనితా హిన్రిక్సోడవటిర్ (ఐస్‌లాండ్) 2:00.54 నిమిషాల్లో గమ్యాన్ని చేరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించాలంటే లూకా తన ప్రతిభను ఇంకా ఎంతో మెరుగుపర్చుకోవలసి ఉంటుంది.

కొత్త కొత్తగా.. జింబాబ్వే పర్యటనపై ‘కెప్టెన్ కూల్’

ముంబయి, జూన్ 7: జింబాబ్వేలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లో పలువురు యువ ఆటగాళ్లతో కూడిన జట్టుకు నాయకత్వం వహించనున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆ సవాలును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్ ఆటగాళ్లు లేకుండా యువ ఆటగాళ్లతో కొత్త రూపాన్ని సంతరించుకున్న భారత జట్టుకు జింబాబ్వే పర్యటనలో ధోనీ సారథ్యం వహించనున్నాడు. ఈ పర్యటనకు ఎంపికైన పలువురు ఆటగాళ్లతో కలసి ధోనీ ఆడనుండటం ఇదే తొలిసారి.

నిర్ణయం బిసిసిఐదే

ముంబయి, జూన్ 7: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు సారథిగా తన భవితవ్యంపై వస్తున్న ఊహాగానాలను ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ తోసిపుచ్చాడు. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డేనని అతను మరోసారి స్పష్టం చేశాడు. ‘నేను ఆటను ఆస్వాదించడం లేదనడం సరికాదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టుకు నేను నాయకత్వం వహించాలా? లేదా? అనే విషయాన్ని నిర్ణయించాల్సింది నేను కాదు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డే’ అని మంగళవారం భారత జట్టు జింబాబ్వే పర్యటనకు బయల్దేరబోయే ముందు ముంబయిలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ధోనీ పేర్కొన్నాడు.

ఆసియా జూనియర్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు మూడో స్థానం

న్యూఢిల్లీ, జూన్ 7: వియత్నాంలోని హోచిమిన్ సిటీలో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ మొత్తం 17 పతకాలతో తన పోరాటాన్ని ముగించింది. వీటిలో ఏడు పసిడి పతకాలతో పాటు నాలుగు రజత పతకాలు, మరో ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి. జపాన్ 14 స్వర్ణ పతకాలతో ఈ పోటీల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, 11 పసిడి పతకాలతో చైనా రెండో స్థానాన్ని దక్కించుకుంది. దీంతో భారత్‌కు మూడో స్థానం లభించింది.

లావోస్‌పై భారత్ ఘనవిజయం

గౌహతి, జూన్ 7: మూడేళ్ల తర్వాత జరుగే ఎఎఫ్‌సి ఆసియా కప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్-2019లో భారత జట్టుకు బెర్తు ఖరారైంది. రెండో లెగ్ ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా మంగళవారం ఇక్కడి ఇందిరా గాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగిన ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 6-1 గోల్స్ తేడాతో లావోస్ జట్టును మట్టికరిపించి ఈ బెర్తును ఖరారు చేసుకుంది. ఇప్పటివరకూ భారత జట్టు సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటి. భారత స్ట్రైకర్ జేజే లాల్‌పెఖులా అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్ సాధించి ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మధుర ఘర్షణలపై సిబిఐ విచారణకు నో

న్యూఢిల్లీ, జూన్ 7: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో జరిగిన ఘర్షణలపై సిబిఐ విచారణకు ఆదేశించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. మధుర ఘర్షణలో ఇద్దరు పోలీసు అధికారుల సహా 29 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ ప్రభుత్వం దర్యాప్తుపై తమకు విశ్వాసం లేదంటూ ఢిల్లీ బిజెపి అధికార ప్రతినిధి అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తులు పిసి ఘోష్, అమిత్వారాయ్ సిబిఐ విచారణకు ఆదేశించడానికి నిరాకరించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సలహా ఇచ్చింది.

ఇది సెన్సార్‌బోర్డు నియంతృత్వం

న్యూఢిల్లీ/చండీగఢ్, జూన్ 7: పంజాబ్ యువతను పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన ‘ఉడ్తా పంజాబ్’ చిత్రంపై సెన్సార్ కత్తెర వేయడంపై బాలీవుడ్ నిప్పులు చెరుగుతోంది. సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లజ్ నిహలానీ ఏకపక్ష ధోరణితో నియంతగా వ్యవహరిస్తున్నారంటూ సహనిర్మాత అనురాగ్ కశ్యప్ తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. సెన్సార్ ధోరణి చూస్తే మనం ఉత్తర కొరియాలో ఉన్న అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఉడ్తా పంజాబ్ చిత్రం ఈ నెల 17న విడుదల కావల్సి ఉంది. మరోపక్క సెన్సార్‌బోర్డు, నిర్మాతల మధ్య తలెత్తిన వివాదం రాజకీయ రంగు పులుపుకుంది.

కనీసం నోరున్న ప్రధానిని ఇచ్చాం

ఎటా, జూన్ 7: గత రెండేళ్లలో ఏం చేశారని వేడుకలు జరుపుకొంటున్నారని ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ఎదురుదాడి చేస్తూ, కనీసం తాము మాట్లాడే ప్రధానిని ఇచ్చామన్నారు. ‘రెండేళ్లలో ఏం చేశారని ఇటీవల రాహుల్ గాంధీ బిజెపిని ప్రశ్నించారు. కనీసం మేము మాట్లాడే ప్రధానిని ఇచ్చాం, యుపిఏ పదేళ్ల పాలనలో సోనియా గాంధీ రాహుల్ బాబా తప్ప ప్రధాని గొంతును ఎవరూ వినలేదు’ అని అమిత్ షా అన్నారు. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధిస్తుందని, గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పాలని సమాజ్‌వాది పార్టీని ప్రశ్నించారు.

బంగ్లాదేశ్‌లో హిందూ పూజారి హత్య

ఢాకా, జూన్ 7: బంగ్లాదేశ్‌లో మంగళవారం 70 ఏళ్ల హిందూ పూజారిని ఇస్లామిక్ స్టేట్ జిహాదీలుగా అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులు దారుణంగా నరికి చంపేశారు. ముస్లిం దేశమైన బంగ్లాదేశ్‌లో ఈ ఏడాది హత్యకు గురయిన హిందూపూజారుల్లో ఈయన రెండో వ్యక్తి. జినాయిగా జిల్లాలోని నోల్‌దంగా గ్రామంలో ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో మోటారు బైక్‌లపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు పూజారి ఆనంద్ గోపాల్ గంగూలీపై దాడి చేసి ఆయన గొంతు కోసి చంపేశారని పోలీసు అసిస్టెంట్ సూపరింటెండెంట్ (ఎసిపి) గోపీనాథ్ కంజీలాల్ చెప్పారు.

Pages