S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు బీటలు

న్యూఢిల్లీ, జూన్ 7: ‘రోమ్ నగరం మండిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు’ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలుతుంటే అధినాయకత్వం మాత్రం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా మారినా అధిష్ఠానం మాత్రం చక్కదిద్దే చర్యలు తీసుకోవటం లేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజీత్ జోగి పార్టీకి రాజీనామా చేసి స్వంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు.

25 మంది భారతీయ విద్యార్థులు వెనక్కి

న్యూఢిల్లీ, జూన్ 7: అమెరికాలోని వెస్ట్రన్ కెంటకీ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సు చదువుతున్న 60 మంది భారతీయ విద్యార్థుల్లో 25 మందిని అవసరమైన అడ్మిషన్ అర్హతలు లేవన్న కారణంగా భారత్‌కు తిరిగి వెళ్లాలని లేదా మరో యూనివర్శిటీ వెతుక్కోవాలని యూనివర్శిటీ ఆదేశించింది. గత ఏడాది వేసవిలో భారత్‌లో పెద్దఎత్తున రిక్రూట్‌మెంట్ ప్రచారం నిర్వహించిన తర్వాత గత జనవరిలో యూనివర్సిటీ వీరిని చేర్చుకున్నది. అయితే తొలి సెమిస్టర్ పూర్తికాగానే తగిన అర్హతలు లేవన్న కారణంగా వారిని భారత్ తిరిగి వెళ్లాలని లేదా మరో యూనివర్శిటీని వెతుక్కోవాలని కోరిందని మంగళవారం మీడియా కథనాలు పేర్కొన్నాయి.

కోర్టు వెలుపలా పరిష్కరించుకోవచ్చు!

న్యూఢిల్లీ, జూన్ 7: కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులను తగ్గించేందుకు న్యాయస్థానం వెలుపల పరిష్కరించుకోవాలన్న ప్రభుత్వం ప్రతిపాదనకు లీగల్ రిఫామ్స్ ప్యానెల్ మద్దతు తెలుపుతోంది. నేషనల్ మిషన్ ఫర్ జస్టిస్ డెలివరి, న్యాయ సంస్కరణల కమిటీ ఎదుట కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. మధ్యవర్తులద్వారా పరిష్కారమయ్యే కేసులకు చట్టబద్ధత ఉండాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు న్యాయ సంస్కరణల కమిటీ మద్దతు పలికింది. ‘ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సమావేశానికి హాజరైన అనేకమంది ప్రభుత్వ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు.

క్షిపణి కూటమిలో భారత్

న్యూఢిల్లీ, జూన్ 7: అణు సరఫరా దేశాల కూటమిలో సభ్యత్వం కోసం పట్టుబడుతున్న భారత్ అంతే కీలకమైన విజయాన్ని సాధించింది. క్షిపణి టెక్నాలజీ నియంత్రణ కూటమి (ఎమ్‌టిసిఆర్)లో సభ్యత్వాన్ని సంపాదించుకుంది. 34 దేశాల ఈ కూటమిలో సభ్యత్వంకోసం భారత్ అభ్యర్థించిందని, ఏ సభ్య దేశం ఇందుకు అభ్యంతరం చెప్పకపోవడంతో భారత్ ఇందులో చేరినట్టే అయిందని దౌత్యవేత్తల్ని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఈ గ్రూపు అనుసరించే ‘వౌన పద్ధతి’ ప్రకారం భారత్ చేరికను ఆమోదించినట్టేనని తెలిపింది. ఈ సభ్యత్వం వల్ల భారత్‌కు అనేక ప్రయోజనాలుంటాయి.

సిఆర్‌పిఎఫ్ జవాన్ ఆత్మహత్య

భద్రాచలం, జూన్ 7: ఛత్తీస్‌గఢ్‌లో మరో సీఆర్‌పీఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. దంతెవాడ జిల్లా అరణ్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపారా సీఆర్‌పీఎఫ్ క్యాంపులో విధులు నిర్వర్తిస్తున్న వైఎస్ సతీష్ సోమవారం అర్ధరాత్రి తలపై తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఆత్మహత్య చేసుకుంటున్న జవాన్ల సంఖ్య పెరుగుతోంది. కాగా సుక్మా జిల్లా మారాయిగూడెం-గొల్లపల్లి గ్రామాల మధ్య లింగంపల్లి వద్ద పోలీసులు 2 మందుపాతరలను గుర్తించారు. బాంబ్‌స్క్వాడ్‌లు వీటిని సకాలంలో గుర్తించడంతో పెనుముప్పు తప్పింది.

బచావత్ తీర్పు ప్రకారమే నీళ్లివ్వండి

విజయవాడ, జూన్ 7: బచావత్ ట్రిబ్యునల్ తీర్పుననుసరించి నీటి కేటాయింపుల ప్రకారం రాష్ట్ర వాటాను కచ్చితంగా కోరుకుంటున్నామని, తెలంగాణకు చెందిన నీటిని కోరుకోవడం లేదని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కెఆర్‌ఎంబి అధికారాలు, పరిధిని రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నిర్ధారిస్తూ, నోటిఫికేషన్ విడుదల చేయాలని మాత్రమే తాము కేంద్రాన్ని కోరామని అన్నారు. బచావత్ తీర్పు ప్రకారం నీటి వివాదాలకు తావు లేకుండా రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలను కాపాడాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని ఉమామహేశ్వరరావు చెప్పారు.

మోదీ నాయకత్వం భేష్

వాషింగ్టన్, జూన్ 7: భారత దేశంలో అత్యంత సంక్లిష్టమైన రాజకీయ వాతావరణం నెలకొన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రభావశీలత కలిగిన నాయకత్వాన్ని ప్రదర్శించారని వైట్‌హౌస్ ప్రశంసించింది. వాతావరణ మార్పులు నిరోధంసహా అనేక అంశాలపై నరేంద్ర మోదీ పట్టుదలగా వ్యవహరించారని వ్యాఖ్యానించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మోదీ సమావేశం దృష్ట్యా ఆయన నాయకత్వంపై అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా పారిస్‌లో జరిగిన వాతావరణ మార్పుల శిఖరాగ్ర సదస్సులో చారిత్రక ఒప్పందం కుదరడానికి భారత్ కీలకపాత్ర పోషించిందని పేర్కొంది.

ఇవిగో.. కళాఖండాలు

వాషింగ్టన్, జూన్ 7: భారత్‌లో చోరీకి గురయిన దాదాపు పది కోట్ల డాలర్ల విలువైన 200 ప్రాచీన కళాఖండాలను అమెరికా మంగళవారం భారత్‌కు తిరిగి ఇచ్చేసింది. వీటిలో కొన్ని 2వేల సంవత్సరాల నాటివి కూడా ఉన్నాయి. కాగా, ఈ కళాఖండాలను స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సంబంధాల్లో సాంస్కృతిక వారసత్వం ఒక బలమైన బంధమని అన్నారు. ‘సాధారణంగా ప్రపంచంలో దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుత కాలానికి చెందినవై ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో రెండు దేశాల మధ్య సంబంధాల్లో సాంస్కృతిక వారసత్వం ముఖ్యమైనదిగా ఉంటుంది.

ప్రజాపోరు ఆపలేరు

మంచిర్యాల, జూన్ 7: ప్రజా తెలంగాణ సాధనకు పోరాటం కొనసాగుతుందని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కోదండరామ్ ప్రకటించారు. ప్రజలు కోరుకునే తెలంగాణ కోసం ఉద్యమం సాగిస్తామని, ఎన్ని ఒత్తిళ్లొచ్చినా వెనక్కి తగ్గేది లేదని వెల్లడించారు. మంగళవారం మంచిర్యాలలోని ఎస్వీ ఫంక్షన్ హాలులో రెండేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ప్రభుత్వ తీరు తెన్నులపై ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు. ప్రజల అభ్యున్నతే తెలంగాణ ఐక్య కార్యచరణ కమిటీ లక్ష్యమన్నారు. ప్రజల పక్షానే జెఎసి ఏర్పడిందని ఉద్ఘాటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన కార్యచరణతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

కొత్త జిల్లాలు 14

హైదరాబాద్, జూన్ 7: రాష్ట్రంలో కొత్తగా 14నుంచి 15 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న అంశంపై అధికారులకు స్పష్టత వచ్చింది. కొత్తగా 15 జిల్లాలుకాకుండా 14 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. కొత్త జిల్లాలతోపాటు 18 రెవిన్యూ డివిజన్లు, 40 మండలాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్టు సమాచారం. జనాభా, మండలాలు, రెవిన్యూ డివిజన్లు, అసెంబ్లీ నియోజకవర్గాలు, సరిహద్దులు, జోన్ల సరిహద్దులు తదితర సాంకేతికపరమైన కారణాల ఆధారంగా కొత్తగా 14 జిల్లాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందని అధికారుల కసరత్తులో తేలింది.

Pages