S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం

పెద్దకడబూరు, జూన్ 7: మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో మంగళవారం ఎఓ హేమలత అనుమానం ఉన్న ఇండ్లపై దాడులు నిర్వహించారు. జాలవాడి గ్రామానికి చెందిన అల్లిపీరా ఇంట్లో పౌండేషన్ పత్తి విత్తనాలు 10 ప్యాకెట్లు, బయోకంపెనీ పత్తివిత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫౌండేషన్ విత్తనాలను సాగు కోసం కంపెని వారు అందజేశారని రైతు అల్లిపీరా ఎఓ దృష్టికి తెచ్చారు. అయితే ఎఓ హేమలత మాట్లాడుతూ పత్తి విత్తన ప్యాకెట్లపై విచారణ చేసి ఆయా కంపెని వారీతో మాట్లాడి నాణ్యమైన విత్తనాలు అయితే రైతుకు అందజేస్తామని, నకిలీ అయితే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నేడు మహా సంకల్ప దీక్ష

కర్నూలు సిటీ, జూన్ 7:నవ నిర్మాణ దీక్షలో భాగంగా బుధవారం నిర్వహించనున్న మహా సంకల్ప దీక్ష కార్యక్రమంపై మండల నోడల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. ఈ నెల 8వ తేదీ నిర్వహించనున్న మహా సంకల్ప కార్యక్రమాలపై మంగళవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 14 నియోజక వర్గాల్లో నిర్వహించే నవ నిర్మాణ దీక్ష మహా సంకల్పానికి సంబంధిత మండల నోడల్ అధికారులు తప్పకుండా హాజరు కా వాలన్నారు. ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకూ చేపట్టిన అంశాలపై సమగ్రంగా చర్చించి నివేదికలు సిద్ధం చేసుకోవాలన్నారు.

మండ్లెం చెరువును పరిశీలించిన జెడ్పీ చైర్మన్

జూపాడుబంగ్లా, జూన్ 7:మండల పరిధిలోని మండ్లెం చెరువును మంగళవారం జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లుగా వర్షలు లేని కారణంగా చెరువు కట్ట పూర్తిగా ఎండిపోవడం వల్లనే చెరువుకు గండిపడి ఉండవచ్చన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. మాండ్ర మాట్లాడుతూ మండ్లెం చెరువు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉందని 1000 ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందిస్తుందన్నారు.

పుష్కరాల పనుల తనిఖీ

ఆత్మకూరు, జూన్ 7 : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో మండలంలో చేపట్టిన రోడ్డు పనులను మంగళవారం క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలించారు. అలాగే శ్యాంపిల్స్ సేకరించారు. పుష్కరాల నిధులు రూ. 39 కోట్లతో మండలంలో రోడ్డు పనులు చేపట్టారు. అందులో భాగంగా మండలంలోని కురుకుందు, వడ్లరామాపురం గ్రామాల మధ్య రూ. 1.5 కోట్లతో, ముష్టపల్లె, బపవనంతాపురం మధ్య రూ. 1.4 కోట్లతో, ఆత్మకూరు పట్టణ శివారు నుంచి కొట్టాలచెరుకు వరకూ రూ. 2 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులను క్వాలిటీ కంట్రోల్ ఇఇ రెడ్డప్ప పరిశీలించారు. అలాగే ఆయా రోడ్డుల నుంచి శ్యాంపిల్స్ తీసుకున్నామని, వాటిని ల్యాబ్‌కు పంపి నాణ్యతను పరిశీలిస్తామన్నారు.

స్టేడియంలో శిక్షణకు అనుమతించాలి

కర్నూలు అర్బన్, జూన్ 7:జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియంలో నూతనంగా నిర్మించిన భవన సముదాయాన్ని క్రీడా శిక్షణకు ఇవ్వాలని కోరుతూ జిల్లా ఒలింపిక్ సంఘం కోరింది. ఈ మేరకు మంగళవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడుకు జిల్లా ఒలింపిక్ సంఘం ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.విజయకుమార్, రామాంజినేయులు మాట్లాడుతూ నూతన భవనంలో ఇండోర్ క్రీడల సాధనకు అనుమతించాలని, తద్వారా క్రీడాకారులకు ప్రయోజనం వుంటుందని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి సంబంధిత శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

జోరుగా ప్రైవేటు విద్యా వ్యాపారం

ఖమ్మం, జూన్ 7: జిల్లాలో సంపాదనే ధ్యేయంగా పలు విద్యాసంస్థలు వెలిశాయి. ఆ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చటంతో విద్యను కొనలేక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న పరిస్థితి జిల్లాలో చోటు చేసుకుంటుంది. జిల్లాలో సుమారు 1500 ప్రైవేటు పాఠశాలలు ఉండగా అనేక పాఠశాలలు లాభార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయనే విమర్శలు మెండుగానే విన్పిస్తున్నాయి. ఎల్‌కెజి విద్యార్థికి 25వేల రూపాయల ఫీజును పలు విద్యాసంస్థలు వసూలు చేస్తున్నాయంటే వారి లక్ష్యం కొట్టొచ్చినట్లే కన్పిస్తోంది. లాభార్జనే ధ్యేయంగా ఏర్పాటు చేస్తున్న విద్యాసంస్థలు విద్యార్థులకు కనీస వౌలిక వసతులు కల్పించటంలో ఘోరంగా విఫలమవుతున్నాయి.

జిల్లాకు కొత్త చెక్‌పోస్టులు

ఖమ్మం(గాంధీచౌక్), జూన్ 7: జిల్లాలో కొత్త చెక్‌పోస్టులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. రెండు రోజుల జిల్లాలో పర్యటనలో భాగంగా మంగళవారం స్థానిక ఆర్‌టిఏ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో 49ఆర్‌టిఏ కార్యాలయాలు ఏర్పాటు చేయటంతో పాటు 12ఎంవిఐ కార్యాలయాలు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్‌టిఏ సేవలు వినియోగదారులకు మరింత చేరువ చేసినట్లు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తాము ఎల్లప్పుడు కృషి చేస్తామన్నారు.

రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి

కొత్తగూడెం టౌన్, జూన్ 7: రవాణాశాఖ పనితీరును మరింత మెరుగుపరుస్తూ ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని లక్ష్యాలను రూపొందించుకుంటూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని రవాణాశాఖ కమీషనర్ సందీప్‌కుమార్ సల్తానియా అన్నారు. మంగళవారం కొత్తగూడెంలోని ఆర్టీఎ కార్యాలయాన్ని జాయింట్ కమీషనర్, జిల్లా రవాణాశాఖాధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈసందర్భంగా కమీషనర్ ఆర్టీఎ కార్యాలయాన్ని నిక్షితంగా పరిశీలించారు. ఆర్టీఎ నియమనిబంధనలు అన్ని తెలుగులోనే రాయించాలని ఎంవిఐ ధన్‌రాజ్‌బజాజ్‌కు సూచించారు. కార్యాలయం అంతా సందర్శించి డ్రైవింగ్‌లైసెన్స్‌కార్డులు, మిషన్స్, ఫైల్స్‌ను పరిశీలించారు.

కార్మికులకు హామీలు ... కార్పొరేట్ కంపెనీలకు నిధులు

భద్రాచలం, జూన్ 7: రాష్ట్రంలో టిఆర్‌ఎస్, కేంద్రంలో భాజపా ప్రభుత్వాలు రెండేళ్ల పాలనలో కార్మికులకు హామీలు ఇచ్చి నిధులు మాత్రం కార్పోరేట్ కంపెనీలకు సమకూర్చిపెట్టాయని సీఐటీయూ విమర్శించింది. సీఐటీయూ భద్రాచలం పట్టణ మహాసభ మంగళవారం స్థానిక శుభంఫంక్షన్‌హాల్‌లో జరిగింది. ఈ మహాసభలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.నర్సింహారావు ముఖ్య అతిథిగా హాజరై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. టీఆర్‌ఎస్ పాలనలో కార్మికుల కష్టాలు, శ్రమదోపిడీ మరింత పెరిగిందే తప్ప తగ్గలేదని అన్నారు. గ్రామ పంచాయితీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు.

ఏకతాటిపైకి నాలుగు జాతీయ కార్మికసంఘాలు

కొత్తగూడెం, జూన్ 7: బొగ్గుగని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐదు జాతీయ కార్మికసంఘాలలో ఐఎన్‌టియుసి, ఎఐటియుసి, సిఐటియు, బిఎంఎస్ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి మంగళవారం హైద్రాబాద్‌లో సమావేశమయ్యాయి. మరో జాతీయ కార్మికసంఘమైన హెచ్‌ఎంఎస్, సింగరేణిలో గుర్తింపుసంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘానికి ఆహ్వానాలు పంపించినప్పటికి వారు సమావేశానికి హాజరుకాలేదని హాజరైన నాలుగు జాతీయ కార్మికసంఘాల నాయకులు స్పష్టం చేశారు.

Pages