S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరులను మరువొద్దు

హైదరాబాద్, జూన్ 6: అమరవీరుల త్యాగాలు నిత్య స్మరణీయాలని, ఆటుపోట్లతో ఉద్యమం మొదలై ఆత్మహత్యలు చేసుకుంటేనేకానీ రాష్ట్రావతరణకు అంకురార్పణ జరగలేదని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ప్రతిపక్షాలు ముసలి కన్నీరు కారిస్తే సరిపోదని అమరవీరుల కుటుంబాలను మర్చిపోకూడదని సూచించారు. రవీంద్రభారతిలో సోమవారం తేజ ఆర్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో బైసా దేవదాసు ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న తెలంగాణ అమరవీరుల స్మృతి కవితా సంకలనం ‘అక్షర నివాళి’ పుస్తకావిష్కరణకు అల్లం నారాయణ అధ్యక్షత వహించారు.

జిల్లా ప్రథమస్థానం

అనంతపురం కల్చరల్, జూన్ 6: జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డా. కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా 5వ రోజు పారిశ్రామిక, సేవా రంగాలలో ప్రగతి, భవిష్య ప్రగతి ప్రణాళికలు అనే అంశపై సోమవారం సదస్సు జరిగింది. మెడికల్ కాలేజి ఆడిటోరియంలో జరిగిన సదస్సులో మంత్రి కామినేని ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రాన్ని అశాస్ర్తియంగా విభజించారని, పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించినట్లు ప్రకటించారన్నారు. అదే సమయంలో వెంకయ్యనాయుడు రాజ్యసభలో గట్టిగా పోరాడి కొన్ని డిమాండ్లు రాజ్యసభ ఆమోదం పొందేలా కృషి చేశారన్నారు.

నేటి నుంచి రంజాన్ దీక్షలు ప్రారంభం

కడప,(కల్చరల్)జూన్ 6: నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. సర్వకాల సర్వావస్థలో మనిషి నిర్వహించాల్సిన విద్యుక్త ధర్మాలను ప్రబోధం చేస్తూ మానవాళికి మోక్షమార్గం చూపే పవిత్ర రంజాన్ మహ్మద్ ప్రవక్త ప్రవచించిన ఇస్లాం ప్రభోధనాలు, సూత్రాలు, పవిత్ర ఐతిహాసిక సంభవాలను మననం చేసుకునే పుణ్యదినాలు ప్రారంభమైనట్లు సోమవారం నాటి నెలవంక దర్శనం ప్రకటించింది...నెలవంక భాగ్యదర్శనంతో నెలరోజుల నాటి ఉపవాస వ్రతానికి మంగళవారం నుంచి శ్రీకారం చుట్టారు. నెలరోజుల వరకు కఠోరదీక్షలు, అల్లాహ్ ప్రార్థనావళితో నిమగ్నమయ్యే 3రంజాన్2 మాసానికి మహమ్మదీయులు సంసిద్ధులయ్యారు.

సీమాంధ్రుల కుట్రలో భాగమే

కరీంనగర్, జూన్ 6: రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చేస్తున్న విమర్శలు దుమారాన్ని రేపుతున్నాయ. ఈ విమర్శలపై పలువురు మంత్రులు తీవ్రస్థాయలో ధ్వజమెత్తారు. సీమాంధ్రుల కుట్రల్లో భాగంగానే కోదండరామ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. కరీంనగర్‌లో సోమవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటులో కెసిఆర్ చూపిన తెగువను పొగిడిన కోదండరామ్ నేడు ముఖ్యమంత్రి పాలనను ప్రశ్నించటం వెనుక ఆంతర్యమేంటని నిలదీశారు.

పలమనేరు వైకాపా ఎమ్మెల్యే టిడిపిలోకి జంప్...?

చిత్తూరు, జూన్ 6: పలమనేరు వైకాపా ఎమ్మెల్యే ఎన్ అమరనాథరెడ్డి టిడిపిలోకి జంప్ కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా వైకాపా కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో సోమవారం ఎమ్మెల్యే పలమనేరులోని తన నివాసంలో నియోజకవర్గానికి సంబంధించిన పలువురు నాయకులు, కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అయితే తన నిర్ణయాన్ని బయటపెట్టకనే గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను వేర్వేరుగా సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం.

మెరుగైన సౌకర్యాలు కల్పించండి

తిరుపతి, జూన్ 6: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న కల్యాణ మండపాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టిటిడి ఉన్నతాధికారులు తనిఖీ చేసి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను టిటిడి ఇఒ డాక్టర్ డి.సాంబశివరావు ఆదేశించారు. స్థానిక టిటిడి పరిపాలనాభవనంలో సోమవారం ఆయన సీనియర్ అధికారులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా ఇఒ మాట్లాడుతూ కల్యాణ మండపాల నిర్వహణ సరిగాలేనందువల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ప్రాజెక్టుల పేరుతో ముంచేస్తారా?

తొగుట, జూన్ 6: ప్రాజెక్టులు నిర్మించే ముందు వాటి వల్ల కలిగే లాభనష్టాలపై ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించాలని, ప్రజాభిప్రాయం మేరకు భూసేకరణ చేపట్టాలని టిజెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. బలవంతంగా భూసేకరణ చేపట్టడం చట్టసమ్మతం కాదని ఆయన స్పష్టం చేశారు. మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్, వేములగాట్ గ్రామాల్లో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న రిలేదీక్షలకు తెలంగాణ విద్యావంతుల వేదిక, టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవిందర్‌కుమార్, రాంచంద్రంతో కలిసి కోదండరామ్ సంఘీభావాన్ని ప్రకటించారు.

ఇద్దరు యువతుల హత్య

జగదేవ్‌పూర్, జూన్ 6: గుర్తు తెలియని ఇద్దరు యువతులు దారుణ హత్యకు గురైన సంఘటన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండల పరిధిలోని శ్రీ కొండపోచమ్మ ఆలయం వద్ద సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈసంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఈదురు గాలుల ధాటికి 125 ఇళ్లు ధ్వంసం

దండేపల్లి, జూన్ 6: ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులకు దండేపల్లి మండలంలో 125 ఇళ్లు ధ్వంసమవగా, విద్యుత్ స్థంబాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. నెల్కివెంకటాపూర్ నుండి ముత్యంపేట వరకు లక్సెటిపేట- నిర్మల్ రహదారికి ఇరువైపుల ఉన్న చెట్లు నేలకొరగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చింతపెల్లి గ్రామంలో 93, కొర్విచెల్మ 8, నెల్కివెంకటాపూర్‌లో 10, ధర్మారావుపేట, పెద్దపేటలలో 3, రెబ్బన్‌పెల్లిలో 2 గృహలు ధ్వంసమయ్యాయని, వాటిని పరిశీలించి జిల్లా ఉన్నాతాధికారులకు నివేదిక పంపామని తహసీల్దార్ కుమారస్వామి తెలిపారు.

పునర్విభజన ముచ్చటే లేదు

హైదరాబాద్, జూన్ 6: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం కేంద్రం వద్ద ఎప్పుడూ చర్చకు రాలేదని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. 2019 ఎన్నికల నాటికి 153 అసెంబ్లీ స్థానాలకు పెరుగుతాయని భావిస్తున్న ఆశావాహుల ఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యింది. వివిధ పార్టీల నుంచి అధికార పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలకు, ఇతర నాయకులకూ నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి పోటీ చేసేందుకు ఇబ్బందులేమీ ఉండవంటూ టిఆర్‌ఎస్ భరోసా కల్పిస్తున్నది. కాగా సోమవారం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అంశమేదీ కేంద్ర ప్రభుత్వం వద్ద చర్చకు రాలేదని అన్నారు.

Pages