S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోరెత్తిన పోడు పోరు

భద్రాచలం, జూన్ 6: బంగారు తెలంగాణ అంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్న కెసీఆర్ బంగారు పంజరంలో ఈ తెలంగాణ బందీగా మారిందని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం గిరిజనులు ఐటీడీఏను ముట్టడించారు. భారీ ధర్నా నిర్వహించారు. సుమారు 5వేల మంది గిరిజనులతో భద్రాచలం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ వద్దకు చేరుకుని ముట్టడించారు. ఐటీడీఏ ముందు బైఠాయించిన సీపీఐ శ్రేణులు, గిరిజనులు చేసిన నినాదాలతో భద్రాద్రి హోరెత్తింది.

ప్రొటోకాల్ తప్పక పాటించాలి

ఖమ్మం, జూన్ 6: జిల్లాలో నిర్వహించే ప్రతి అధికార కార్యక్రమానికి జిల్లా అధికారులు ప్రొటోకాల్ పాటించాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్‌లో అధికారులతో మాట్లాడుతూ ప్రొటోకాల్ పాటించని అధికారిపై నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికార కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసే శిలాఫలకాలపై, ఆహ్వాన పత్రికలపై ప్రోటోకాల్ ప్రకారమే ప్రజాప్రతినిధుల పేర్లను చేర్చాలని, వాటిని ముద్రించే ముందు జిల్లా రెవెన్యూ అధికారి ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. వార్డు మెంబర్ నుంచి మంత్రుల వరకు ప్రోటోకాల్ పాటించాల్సిందేనన్నారు.

అవినీతి రహితంగా మోదీ పాలన

అనంతపురం సిటీ, జూన్ 6: పదేళ్లపాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని అవినీతిలో ముంచెత్తిందని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. సోమవారం అనంతపురం నగరంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల్లో కూరుకుపోయిందన్నారు. 2జి, బొగ్గు, స్పెక్ట్రమ్, భూగర్భజలాలు, విమానయానరంగం, పంచభూతాలను సైతం వదలకుండా కాంగ్రెస్ మంత్రులు వేల కోట్ల దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికీ ఆ కేసులు వారిని వెంటాడుతున్నాయన్నారు.

ఆరు నెలల్లో పర్యాటక సొబగులు

కర్నూలు, జూన్ 6 : జిల్లాకు పర్యాటక సొబగులు దిద్దేందుకు పనులు ఊపందుకుంటున్నాయి. రానున్న ఆరు నెలల్లో ప్రస్తుతం ప్రతిపాదనల్లో ఉన్న పర్యాటక కేంద్రాలను పూర్తి చేయాలని ఆ శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో మొదట ఆత్మకూరు సమీపంలోని బైర్లూటి గ్రామం వద్ద ఎకో టూరిజం పార్కును అటవీ శాఖ సహకారంతో దాదాపు పూర్తి చేశారు. రానున్న కృష్ణా పుష్కరాల ప్రారం భం నాటికి సిద్ధం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక్కడ భోజన వసతులతో పాటు పులులను ప్రత్యక్షంగా అడవిలో వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5 గంటల పాటు నల్లమల అడవిలో ప్రజలు విహరించేందుకు మొదటి విడతలో 4 వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తారు.

పోలీసు శాఖకు విభజన సవాళ్లు

విజయవాడ , జూన్ 6: ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నట్లు రాష్ట్ర డిజిపి జెవి రాముడు సోమవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో ప్రకటించారు. నక్సల్స్ కార్యకలాపాలను పూర్తిగా అదుపు చేశామని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలతో పొలిస్తే రాష్ట్రంలో క్రైంరేటు ఈ సంవత్సరం తగ్గుముఖం పట్టినా ఇంకా తగ్గాల్సి ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన పోలీసు వౌలిక సౌకర్యాల కల్పన కోసం ఇటీవల ఢిల్లీ సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రానున్న కృష్ణా పుష్కరాలకు అసాధారణ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను కోరినట్లు తెలిపారు.

పోలీసులపై దాడి

నూజివీడు, జూన్ 6: కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో దళితరత్న అవార్డు గ్రహీత, మంత్రి రావెల కిషోర్‌బాబు, ఏలూరు ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు ముఖ్య అనుచరుడిగా ఉంటూ ప్రైవేటు దందాలు చేస్తున్న పాలేటి మహేశ్వరరావు, అతని అనుచరులు సోమవారం పోలీసులపై దాడికి పాల్పడ్డారు. సాక్షాత్తూ ఎస్‌ఐపై దాడి చేయబోగా అడ్డుగా వచ్చిన కానిస్టేబుళ్లపై వారు దాడులకు తెగబడ్డారు. ఈ సంఘటన ఆగిరిపల్లిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆగిరిపల్లి మండలంలోని రౌడీషీటర్ల పూర్తి సమాచారాన్ని పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. వారంరోజుల క్రితం సమాచారం ఇవ్వాలని పోలీసులు రౌడీషీటర్లకు సూచించారు.

వ్యవసాయం తర్వాత పరిశమ్రలదే ముఖ్యపాత్ర

వేదాయపాళెం, జూన్ 6: రాష్ట్ర అభివృద్ధిలో వ్యవసాయం తర్వాత పరిశ్రమలే ముఖ్యపాత్ర వహిస్తాయని శాసనమండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం నవనిర్మాణ దీక్షలో భాగంగా స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో పరిశ్రమలు, సేవలు తదితర అంశాలపై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల పరిశ్రమలన్నీ తెలంగాణ ప్రాంతాలకు పోయాయన్నారు. ముఖ్యమంత్రి పరిశ్రమల అభివృద్ధికై విదేశాలకు వెళ్లి రాష్ట్రంలో ఉన్న సదుపాయాలను పెట్టుబడిదారులకు తెలియజేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం నెల్లూరు జిల్లాలో 45వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అన్నారు.

సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళల మార్పుపై హామీ

నెల్లూరు, జూన్ 6: నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తాతో ఆదివారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని పలు స్టేషన్లలో ఉన్న సమస్యలను జిఎం దృష్టికి తీసుకెళ్లినట్లు మేకపాటి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళలు ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా, అక్టోబర్ 1వ తేది నుంచి సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళలు మార్చేందుకు చర్యలు తీసుకుంటామని జిఎం హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

పారిశ్రామికాభివృద్ధికి టిడిపి పెద్దపీట

వెంకటాచలం, జూన్ 6 : తెలుగుదేశం ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఎంపిడివో కార్యాలయ సమావేశ మందిరంలో నవ నిర్మాణ దీక్ష ఆరో రోజులో భాగంగా పరిశ్రమలు, సేవా రంగాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర హాజరయ్యారు. ఈసందర్భంగా జిల్లాలోని పరిశ్రమలపై చర్చించారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. జిల్లాలో రాబోయే రోజుల్లో పారిశ్రామికాభివృద్ధి వేగవంతం కానుందన్నారు.

అక్రమ సంబంధం కోసం కొడుకును హతమార్చిన తల్లి

దర్శి, జూన్ 6 : అక్రమ సంబంధం కోసం కన్న కొడుకునే హతమార్చిన కిరాతకపు తల్లి ఉదంతం కురిచేడు మండలంలోని పేరంబొట్లపాలెం గ్రామంలో జరిగింది. డిఎస్‌పి వి శ్రీరాంబాబు తెలిపిన వివరాల ప్రకారం మాచవరపు కోటేశ్వరరావు గత నెల 27వ తేదిన ఉదయం ఆరు గంటలకు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతని తండ్రి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదుమేరకు కురిచేడు ఎస్‌ఐ కిశోర్‌బాబు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా పలు అనుమానాలువ్యక్తం కావడంతో లోతుగా దర్యాప్తు చేసి అసలు నిందితులను అరెస్టు చేశారు.

Pages