S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం

చీరాల, జూన్ 6: జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి శిద్దారాఘవరావు హామీ ఇచ్చారు. చీరాల్లో నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్ష ఆరో రోజు కార్యక్రమంలో మరో రాష్ట్ర మంత్రి రావెల కిషోర్‌బాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా, జపాన్ దేశాలకు చెందిన కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఇప్పటికే రూ. 42వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

అంతుచిక్కని చంద్రబాబు అంతరంగం

ఒంగోలు, జూన్ 6: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంతరంగం అంతుచిక్కక జిల్లాలోని తెలుగు తమ్ముళ్ళు తలలు బాదుకుంటున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి సంపూర్ణమైన మెజార్టీ ఉన్నప్పటికీ రాష్ట్రంతోపాటు జిల్లాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులతోపాటు, ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకోవటం పట్ల పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోను తెలుగు తమ్ముళ్ళకు ప్రత్యామ్నాయంగా వైకాపా నుండి వచ్చిన నాయకులను చంద్రబాబు తెరపైకి తీసుకువచ్చి వారికి పోటీగా రంగప్రవేశం చేయించారు.

అంతుచిక్కని చంద్రబాబు అంతరంగం

ఒంగోలు, జూన్ 6: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంతరంగం అంతుచిక్కక జిల్లాలోని తెలుగు తమ్ముళ్ళు తలలు బాదుకుంటున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి సంపూర్ణమైన మెజార్టీ ఉన్నప్పటికీ రాష్ట్రంతోపాటు జిల్లాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులతోపాటు, ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకోవటం పట్ల పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోను తెలుగు తమ్ముళ్ళకు ప్రత్యామ్నాయంగా వైకాపా నుండి వచ్చిన నాయకులను చంద్రబాబు తెరపైకి తీసుకువచ్చి వారికి పోటీగా రంగప్రవేశం చేయించారు.

కుల పంచాయతీలకు చెక్!

హైదరాబాద్, జూన్ 6: నవ్యాంధ్రలో ఉన్న సమస్యలకు కులాల తలనొప్పి తోడవడంతో, దానికి తెరదించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సర్వే నిర్వహణకు తెరలేపినట్లు కనిపిస్తోంది. జనాభా సంఖ్య ప్రాతిపదిక న్యాయం చేయాలన్న డిమాండ్లు పెరగడం, అసలు ఏ కులానికి ఎంత జనాభా ఉందో తెలియక ఇప్పటివరకూ తర్జనభర్జన జరుగుతోంది. ఇక ఈ పంచాయితీకి తెరదించడం ద్వారా, భవిష్యత్తులో పాలనపై పూర్తి స్థాయి దృష్టి సారించాలన్నది బాబు లక్ష్యంగా కనిపిస్తోంది.

ఎన్‌ఐఓఎస్ ఇంటర్ ఫలితాలు విడుదల

హైదరాబాద్, జూన్ 6: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) ఇంటర్ ఫలితాలను విడుదల చేసినట్టు జాతీయ డైరెక్టర్ (ఎవాల్యూయేషన్) ధరుమన్ తెలిపారు. జాతీయ స్థాయిలో 2,03,481 మంది రిజిస్టర్ చేసుకోగా అందులో పరీక్షలకు 1,83,733 మంది హాజరుకాగా వారిలో 71,489 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. సబ్జెక్టుల వారీ 7,28,341 మంది హాజరుకాగా వారిలో 4,78,166 మంది కంపార్టుమెంటల్‌గా కొన్ని సబ్జెక్టులలో పాసయ్యారని అన్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని 18001809393 నెంబర్‌కు ఫోన్ చేసి లేదా ఎన్‌ఐఓఎస్ డాట్ ఎసి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని అన్నారు.

ప్రజాతీర్పునూ గౌరవించరా?

హైదరాబాద్, జూన్ 6: ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి కనీసం ప్రజాతీర్పును గౌరవించే పరిస్థితిలో లేడని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని హేళన చేయడం, అవమానకరంగా మాట్లాడటం అంటే ఆయనపై విశ్వాసంతో అధికారాన్ని అందించిన ప్రజలను అవమానించడమేనని అన్నారు. విపక్ష నేత చిల్లర మాటలు మాట్లాడుతున్నారని దానిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.నవనిర్మాణ దీక్ష ఏ ఒక్కరి కోసం కాదని, అన్ని రంగాల్లో పునర్‌వైభవానికి సిఎం శ్రమిస్తుంటే వైకాపా నేతలు మాత్రం రాష్ట్భ్రావృద్ధికి అడ్డుపడుతున్నారని అన్నారు.

ఫుడ్ సేఫ్టీ అధికారుల నియామకంలో జాప్యమేల?

హైదరాబాద్, జూన్ 6: కార్బైడ్ పూసిన పళ్లను మార్కెట్‌లో అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైదరాబాద్ హైకోర్టు తామిచ్చిన ఆదేశాలను పాటించడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన అధికారులను నిలదీసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ అధికారుల వివరణ కోరింది.

ప్రభుత్వాలు విఫలమైతేనే కోర్టుల జోక్యం: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, జూన్ 6: కార్యనిర్వాహక వర్గం తన రాజ్యాంగ బాధ్యతల నిర్వహణలో విఫలమైతేనే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ స్పష్టం చేశారు. విమర్శలను గుప్పించే బదులు ప్రభుత్వం తన విధులను నిర్వర్తించాలని, కార్యనిర్వాహక వర్గం తన ధర్మాన్ని నిర్వర్తించడంలో విఫలమయినప్పుడే ప్రజలు న్యాయస్థానాలు ఆశ్రయిస్తారని ఆయన అన్నారు. ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఠాకూర్ స్పష్టం చేశారు. కోర్టులు తమ రాజ్యాంగ బాధ్యతలనే నిర్వర్తిస్తాయిన ప్రభుత్వం తమ విధులను నిర్వహించుకుంటూ పోతే కోర్టుల జోక్యానికి ఆస్కారమే ఉండదిన వ్యాఖ్యానించారు.

మాజీ డ్రైవర్ అప్రూవర్‌గా మారితే అభ్యంతరం లేదు

ముంబయి, జూన్ 6: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసు కొత్త మలుపుతిరిగింది. ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా మాజీ కారు డ్రైవర్ శ్యామవర్ రాయ్ తాను అప్రూవర్‌గా మారతానని ప్రత్యేక కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో రాయ్ అప్రూవర్‌గా మారితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సిబిఐ స్పష్టం చేసింది. ‘ఇంద్రాణి మాజీ డ్రైవర్ శ్యామవర్ రాయ్ అప్రూవర్‌గా మారితే మరిన్ని వాస్తవాలు వెలుగుచూస్తాయి. కాబట్టి మేం ఎలాంటి అభ్యంతరం చెప్పబోం. ఈ మేరకు మేం పిటిషన్ దాఖలు చేశాం’ అని సిబిఐ అధికారులు వెల్లడించారు. షీనాబోరా కేసులో తాను అప్రూవర్‌గా మారతానని గత నెలలోనే డ్రైవర్ కోర్టుకు తెలిపాడు.

కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తాం

హైదరాబాద్, జూన్ 6: కార్మికుల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. జెనివాలో 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న అంతర్జాతీయ కార్మికుల సదస్సుకు హాజరయ్యేందుకు దత్తాత్రేయ నేతృత్వంలో ప్రతినిధుల బృందం బయలుదేరి వెళ్ళింది. ఈ బృందంలో రాజస్థాన్, హర్యానా, మణిపూర్, తెలంగాణ రాష్ట్రాల కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రులు, మరో 8 మంది అధికారులు తదితరులు ఉన్నారు.

Pages