S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావనపాడు పోర్టు ప్రాంతంలో భూ రిజిస్ట్రేషన్లపై నిషేధం

శ్రీకాకుళం, జూన్ 6: విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయి.. ఈడొచ్చిన పిల్లలకు పెళ్లిళ్లూ కావడం లేదు. ఎవరికైనా రోగమో రొచ్చో వస్తే.. వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. ఇదీ శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టు నిర్మాణానికి భూసేకరణ చేయనున్న తీరప్రాంత గ్రామాల ప్రజల దుస్థితి. పోర్టు నిర్మాణానికి ఆ ప్రాంత ప్రజలతో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించి, భూసేకరణ ప్యాకేజీలు, ఉద్యోగ అవకాశాలపై భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ, ఈ పోర్టు నిర్మాణం వల్ల తమ బతుకులు బాగుపడతాయని స్థానికులు కలలు కన్నారు. అయితే, అధికాల నిర్లక్ష్యం ఫలితంగా వారి కలలు కరిగిపోతున్నాయి.

మహాసంకల్పం.. మహోన్నతంగా ఉండాలి

శ్రీకాకుళం, జూన్ 6: నవ నిర్మాణ దీక్షలో భాగంగా చివరిరోజు బుధవారం మహాసంకల్పంను మహోన్నతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. మహాసంకల్పం నిర్వహణపైకలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ను ముఖ్యమంత్రి నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో మహాసంకల్పం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో గల జలవనరులు, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ శాఖ లు, పరిశ్రమలు, నీరు చెట్టు, ఆరోగ్యం తదితర విషయాలను వివరించాలన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య, సామాజిక, ఆర్థిక సూచికలను ప్రజలకు తెలియజేయాలన్నారు.

నీట మునిగి నలుగురు చిన్నారుల మృతి

కనగానపల్లి/తుగ్గలి, జూన్ 6: సీమలో రెండు ఘటనల్లో నలుగురు చిన్నారులు మృతి చెందారు. అనంతపురం జిల్లా తూముచెర్లలో సోమవారం ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి చనిపోయారు. మల్లేషు, నిర్మలమ్మ దంపతుల కుమారులు తేజ(10), తరుణ్(8) మరికొంతమంది పిల్లలతో కలిసి పారంఫాండ్‌లో నిలిచిన నీళ్లలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వీరిద్దరికీ ఈత రాకపోవడంతో నీట మునిగారు. కాగా కర్నూలు జిల్లా లింగనేనిదొడ్డి గ్రామం సమీపంలోని వ్యవసాయ బావిలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. తిమ్మప్ప కూతూరు శివమ్మ(15), శ్రీనివాసులు కూతూరు పూజిత (12) లింగనేనిదొడ్డిలో పొలం పనులకు వెళ్లారు.

రెండంకెల వృద్ధిరేటే లక్ష్యం

వీరఘట్టం, జూన్ 6: జిల్లాలోని వ్యవసాయశాఖ ఈ ఏడాది రెండెంకల వృద్ధిరేటు సాధించడమే లక్ష్యంగా నిర్ణయించి తమ వంతు చర్యలు తీసుకోవడం జరుగుతోందని వ్యవసాయశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ రామారావు తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు ద్వారా వృద్ధిని సాధిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల 60 వేల 955 హెక్టార్లలో సాగు విస్తీర్ణం ఉందని, దీంట్లో 2లక్షల 13 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి పంట పండుతుండగా, మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగులో ఉన్నట్టు తెలిపారు.

రాజకీయాల్లో ‘అంబుడ్స్‌మెన్’ అవసరం

గుంటూరు, జూన్ 6: రాజకీయాల్లో పెచ్చుమీరుతున్న దూషణల పర్వాన్ని నియంత్రించేందుకు అంబుడ్స్‌మెన్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. సోమవారం గుంటూరులోని తన కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో జరిగిన రైతు భరోసా యాత్రలో ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి తీవ్ర పదజాలంతో ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు సరికాదని ఖండించారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవరూ వాడని పదజాలాన్ని జగన్ వాడటం అతని నైజాన్ని బహిర్గతం చేసిందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ విలువలను మరింత పతనం చేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

పడిగాపులు...!

ఎచ్చెర్ల, జూన్ 6: ఇంజినీరింగ్ విద్యతో ఉజ్వల భవిష్యత్ అందిపుచ్చుకోవాలని ఎంతో ఆసక్తితో ఎంసెట్‌లో ర్యాంకులు సాధించినప్పటికీ వెబ్‌కౌనె్సలింగ్ తొలిరోజు అభ్యర్థులకు పడిగాపులు తప్పలేదు. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రాప్తికి సోమవారం నుంచి వెబ్‌కౌనె్సలింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ సర్వర్లు పనిచేయని కారణంగా సుమారు పదిగంటలు అభ్యర్థులు నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం 9గంటలకు కౌనె్సలింగ్ కేంద్రానికి 1నుంచి 5వేల ర్యాంకు వరకు సాధించిన అభ్యర్థులు రాత్రి 7గంటల వరకు నిరీక్షించడమే కాకుండా తల్లిదండ్రులు కూడా నానా అవస్థలు పడాల్సి వచ్చింది.

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుపై ఎసిబి దాడులు

మార్కాపురం, జూన్ 6: అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. అనధికారికంగా ఉన్న 2,95,250 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎసిబి డిఎస్పీ ఆర్‌విఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై తమ కార్యాలయానికి అనేక ఫిర్యాదులు అందాయని, దీంతో దాడులు నిర్వహించామని తెలిపారు. రికార్డు గదిలో 2,71,100 రూపాయలు వివిధ ప్రాంతాల్లో దాచి ఉండడాన్ని గమనించి స్వాధీనం చేసుకున్నామన్నారు.

రంజాన్ నెల ప్రారంభం

శ్రీకాకుళం(కల్చరల్), జూన్ 6: ముస్లీంల పవిత్ర మాసం రంజాన్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. నెలవంక దర్శనంతో ఉపవాస దీక్షలు చేయడం ఆనవాయితీ నేపథ్యంలో సోమవారం చంద్రుని దర్శనం కావడంతో రంజాన్ నెల క్యాంలెండర్ విడుదలైంది.స్థానిక జి.టి రోడ్‌లోని జామి యా మసీద్‌లో తరాజినమాజ్ పఠనం మంగళవారం నుంచి ప్రారంభం అవుతుందని మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడు మహీబుల్లాఖాన్ తెలిపారు. రంజాన్ నెల ప్రారంభానికి సూచనగా సోమవారం మసీద్‌లో సైరన్ మోగించినట్లు చెప్పారు. మంగళవారం వేకువజామున 3:51గంటలకు సహారి, సాయంత్రం 6:31గంటలకు ఇఫ్తార్ సమయాలుగా ఉంటాయన్నారు.

ఎంఎల్‌నేత సోమాచారి అస్తమయం

సామర్లకోట, జూన్ 6: సిపిఐ ఎంఎల్ ప్రతిఘటన కేంద్ర కమిటీ సభ్యుడు, కమ్యూనిస్టు యోధుడు మొగులూరి సోమాచారి (95) సోమవారం మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాటి 1938 కాలంలో సామర్లకోట కార్యదర్శిగా పనిచేస్తూ సామర్లకోట డెక్కన్ సుగర్స్ ఫ్యాక్టరీలో పనిచేశారు. 1955లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. కమ్యూనిస్టు పార్టీలు విడిపోయిన తర్వాత 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సామర్లకోట అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిపిఎం తరపున పోటీచేశారు.

సైకోలా వ్యవహరిస్తున్న జగన్

అనంతపురం, జూన్ 6: వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సైకోలా వ్యవహరిస్తున్నారని మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. తనస్థాయి మరిచి బాధ్యతాయుతమైన సిఎం పదవిలో ఉన్న చంద్రబాబునాయుడుపై అనుచితవ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం అనంతపురం నగరంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టేలా చెప్పులు, చీపుళ్లు వంటి భాషను సిఎంపై వాడడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి వ్యక్తి ఏ పదవికీ అర్హుడు కాడన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేందుకు జగన్ తన భరోసా యాత్రలను ఎంచుకున్నారన్నారు.

Pages