S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లాకో లెక్కుంది!

హైదరాబాద్, జూన్ 6: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రెండు రెవిన్యూ డివిజన్లు, 20 మండలాలకు ఒకటి చొప్పున కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రామాణికంగా తీసుకోవడంతోపాటు జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్లకు మించకుండా విస్తీర్ణం ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ప్రస్తుతం ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాల సంఖ్య భవిష్యత్‌లో 153 నియోజకవర్గాలకు పెరుగనున్న దృష్ట్యా వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాల ప్రతిపాదనలు తయారు చేయాలని ఇప్పటికే భూ పరిపాలన కమిషనర్‌కు ముఖ్యమంత్రి సూచనలు చేశారు.

విజభన సమయంలో రెండేళ్లు క్లిష్టమని తెలియదా?

వికారాబాద్, జూన్ 6: విభజన సమయంలో రెండేళ్ల సమయం చాలా క్లిష్టమని తెలియదా అని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.నాగేందర్‌గౌడ్ సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఐఎఎస్ విభజనకు ఏడు నెలల సమయం ఎందుకు పట్టిందో చెప్పాలని, ఆ విషయంలో ఏనాడు నోరెందుకు మెదపలేదని ప్రశ్నించారు. తెలంగాణకు వెన్నుపోటు పొడిచేందుకు కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నారనా అని అన్నారు. 24 గంటల కరెంటు, పింఛన్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ.. రెండేళ్ల అభివృద్ధిలో కనిపించకపోవడం విచిత్రకరమని అని పేర్కొన్నారు.

తెలుగు సంస్కృతికి కేంద్ర బిందువు త్యాగరాయ గానసభ

హైదరాబాద్, జూన్ 6: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడానికి కేంద్ర బిందువుగా శ్రీత్యాగరాయ గానసభ నిలుస్తుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు అన్నారు. శ్రీత్యాగరాయ గానసభ స్వర్ణోత్సవ వేడుకలు మూడోరోజు సోమవారం గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ కళాలను, కళాకారులను ప్రోత్సహిస్తున్న కళారంగన్నికి ఎంతో సేవ చేస్తున్నారని పేర్కోన్నారు. ప్రభుత్వం సంస్కృతిక రంగలను ప్రోత్సహించాలని అన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలుకలూరి ఇనాక్ మాట్లాడుతూ శ్రీత్యాగరాయ గానసభ సాహిత్యన్నికి వెలుగునిస్తుందని తెలిపారు.

‘చేప ప్రసాదంలో ఔషధ గుణాలు లేవు’

ఉప్పల్, జూన్ 6: చేప ప్రసాదంలో ఉబ్బస వ్యాధిని నివారించే ఔషధ గుణాలు ఏమి లేవని పద్మభూషన్ అవార్డు గ్రహిత, ప్రముఖ శాస్తవ్రేత్త, సిసిఎంబి వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ పిఎం భార్గవ పేర్కొన్నారు. సోమవారం ఉప్పల్ ప్రశాంతినగర్‌లోని తన కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక, జన చైతన్య వేదిక ఆధ్వర్యలో చేప మందుపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ శాస్ర్తియ ఆధారంగా ఆధునిక సమాజం ముందుకు పోతున్న తరుణంలో రుజువుకు, శాస్ర్తియతకు నిల్వలేని చేపప్రసాదాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడం సమంజసం కాదన్నారు. చేప ప్రసాదాన్ని ప్రయోగశాలలో పరిశీలించగా ఉబ్బసం వ్యాధి నివారణకు తోడ్పడే ఎలాంటి ఔషధం అందులో లేదని తెలిపారు.

శాంతియుత వాతావరణంలో రంజాన్‌ను జరుపుకోవాలి

చాంద్రాయణగుట్ట, జూన్ 6: రంజాన్ పండగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, అందుకు కావాల్సిన ఏర్పాట్లను వివిధ ప్రభుత్వ శాఖలు పర్యవేక్షించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అదేశించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా సోమవారం సాలార్‌జంగ్ మ్యూజియంలో జరిగిన వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదులకు సంబంధించిన ఇమామ్‌లు, మసీదు కమిటీ అధ్యక్షులు ఎల్లపుడు స్థానిక పోలీసులకు ఏమాత్రం ఇబ్బందులు పడకుండా వెంటనే సమాచారం అందించాలని సూచించారు.

ముంచుకొస్తున్న వర్షం ముప్పు

హైదరాబాద్, జూన్ 6: ఎవరో వస్తారని..ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా..! అంటూ రాసిన ఓ సినీగేయాన్ని ఒక్కసారి జంటనగరవాసులు గుర్తుకు తెచ్చుకుని, ఆ దశగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సారి సాధారణం కన్నా అత్యధిక మోతాదులో వర్షం కురిసే అవకాశాలున్నాయంటూ వాతావరణ శాఖ ఇప్పటి పలు సార్లు హెచ్చరికలు జారీ చేసినా, మహానగర పాలక సంస్థ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ఎండల ప్రభావం తగ్గి వాతావరణం చల్లబడిన గడిచిన నెలరోజుల్లో మూడు సార్లు ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే!

చల్లబడిన నగరం

హైదరాబాద్, జూన్ 6: మహానగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. కొద్దిరోజుల క్రితం వరకు పగటి పూట ఎండ వేడిమి, సాయంత్రం కాగానే బలమైన గాలులతో కురిసిన వర్షాలు బీభత్సాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే! ఈ సారి వేసవి కాలంలో నగరంలో పగటి ఉష్ణోగ్రత గరిష్ఠంగా దాదాపు 45 డిగ్రీలు దాటిన సంగతి తెలిసిందే! ఇంకా వర్షాకాలం ప్రారంభం కాకపోయినా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణీ, నైరుతి రుతుపవనాల రాక సందర్భంగా వాతావరణం హైదరాబాద్‌లో వాతావరణం కూల్ కూల్‌గా మారింది. అంతేగాక, పగటి ఉష్ణోగ్రత కూడా ఒక్కసారిగా 28 డిగ్రీలకు పడిపోయింది.

వసతులుంటే వస్తాం

హైదరాబాద్/విజయవాడ, జూన్ 6: హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు విజయవాడ రావాలంటే వౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఉద్యోగుల సంఘం నేత అశోక్‌బాబు పేర్కొన్నారు. సోమవారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ రావడానికి ఇష్టం లేని ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, కొంత మంది వ్యాఖ్యలను అందరికీ ఆపాదించడం సమంజసం కాదని అన్నారు. వౌలిక వసతులు ఏర్పడ్డాక అక్కడికి వచ్చి పనిచేస్తామని తాము ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా చెప్పామని, అంత మాత్రాన ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నట్టో వివాదాస్పద వ్యాఖ్య లు చేసినట్టో పరిగణించరాదని అన్నారు.

రాలేమంటే కుదరదు!

తుళ్లూరు, జూన్ 6: కొత్త రాజధానిలో సహజంగానే ఇబ్బందులు ఉంటాయని, ఉద్యోగులు రాలేమంటే కుదరదని, నిర్దేశిత గడువులోపు తరలి రావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు.

కృష్ణా బోర్డు పరిధి తేల్చండి

విజయవాడ, జూన్ 6:కృష్ణానది యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) అధికార పరిధిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిర్ణయించాలని కోరుతూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 87(1)లో నిర్దేశించిన దానికి అనుగుణంగా కృష్ణానది యాజమాన్య బోర్డు అధికార పరిధి నిర్ణయిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉందన్నారు. ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేయొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి లేఖ రాసినట్టు తెలిసిందని, అందులోని అంశాలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలకు అనుగుణంగా లేవని చంద్రబాబు తెలిపారు.

Pages