S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలేజీల కోల్డ్‌వార్

హైదరాబాద్, జూన్ 6: కార్పొరేట్ కాలేజీల మధ్య మళ్లీ వార్ మొదలైంది. సినిమా సన్నివేశాలను తలపించేలా ఎక్కువ రేటు చెల్లించి లెక్చరర్లను ఎత్తుకువెళ్లే సంస్కృతికి కొద్ది కాలం విరామం చిక్కినా, మళ్లీ అది జడలు విప్పింది. నారాయణ కాలేజీలో పనిచేస్తున్న కొంత మందిని వెలాసిటీ కార్పొరేట్ జూనియర్ కాలేజీలు రిక్రూట్ చేసుకుని వేతనాలను ఖరారు చేయగా, అందుకు రెట్టింపు చెల్లిస్తామని పేర్కొంటూ నారాయణ విద్యాసంస్థలు మళ్లీ వారిని తమ కాలేజీలకు తీసుకువెళ్లాయి. దీంతో వెలాసిటీ విద్యాసంస్థ తమ లెక్చరర్లు కనిపించడం లేదంటూ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు పీటముడి ఇక్కడే పడింది.

నేటి నుంచి రంజాన్ మాసం

హైదరాబాద్, జూన్ 6: ముస్లింల పవిత్ర రంజాన్ మాసం మంగళవారం నుంచి ప్రారంభంకానున్నది. సోమవారం సాయంత్రం నెల వంక దర్శనమివ్వడంతో మంగళవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. నెల రోజుల పాటు ముస్లింలు ఉపవాసం ఉంటారు.

ప్రయాణంలో పదనిసలు!

విజయవాడ, జూన్ 6: విద్యుత్‌తో నడిచే బస్సులు త్వరలోనే రాష్ట్రంలో రోడ్డెక్కనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో కొత్తగా నిర్మించిన ఎన్టీఆర్ పరిపాలన భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 80 కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు. ఇందులో ప్రతి సీటు వెనక ఒక టివి ఉంటుం ది. అందులో ప్రయాణికులు తమ ఇష్టం వచ్చిన ఛానల్‌ను చూసుకునే సౌకర్యం కల్పించారు. ఈ బస్సుల్లో జిపిఎస్ కూడా ఏర్పాటు చేశారు. ఫలానా బస్ ఎక్కడ ఉందన్న విషయాన్ని ప్రయాణికుడు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కావల్సిన యాప్‌ను కూడా ఈసందర్భంగా చంద్రబాబు ఆవిష్కరించారు.

పెరుగుతున్న పొరుగు మైత్రి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అఫ్గానిస్తాన్, ఖతార్ దేశాలలో జరిపిన పర్యటన వ్యూహాత్మక సహకారం విస్తృతికి నిదర్శనం. భారత అఫ్గానిస్తాన్ సంబంధాలలో మైత్రి, ముభావం వంతుల వారీగా దోబూచులాడం 2002 నుండి నడుస్తున్న చరిత్ర. తాలిబన్, అల్‌ఖాయిదాల బీభత్స పాలన నుండి విముక్తి అయిన అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణం కోసం మనదేశం చిత్తశుద్ధితో కృషి చేస్తుండడం సడలని మన మైత్రీ విధానానికి నిదర్శనం. భారత-అఫ్గాన్ మైత్రీ జలాశయాన్ని జూన్ నాలుగవ తేదీన మన ప్రధాని ప్రారంభించడం ఈ మైత్రికి చిహ్నం. కానీ ఇదే సడలని మైత్రిని అఫ్గానిస్తాన్ ప్రభుత్వాలు 2002 నుండి పాటించడం లేదు.

ఉత్తరాఖండ్ పరిణామాలు శ్రేయస్కరం కాదు

భారత ప్రజాస్వామ్య వ్యవస్థ చరిత్రలో ఇప్పటిరకు కనని, వినని ఒక ప్రక్రియలో పాల్గొన్న జయదేవ్ సింగ్ అనే వ్యక్తి గురించి బహుశా చాలామందికి తెలిసి ఉండదు. ఆయన ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి శాసన, పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న ఒక బ్యూరోక్రాట్. ఇంతకూ ఆయన చేసిన పనేంటి? బ్యూరోక్రాట్‌లకు ఎంతమాత్రం ప్రవేశించడానికి వీల్లేని ఉత్తరాఖండ్ విధానసభలోకి అడుగుపెట్టడమే కాదు, ప్రజాస్వామ్యంలో అతిపవిత్రంగా భావించే స్పీకర్ స్థానంలో కూర్చొని, అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహించడం! ఇదంతా జరిగింది గత మే,10వ తేదీన!

-పవన్ కె. వర్మ

ముందు నుయ్యి వెనుక గొయ్యి

భాజపా కలలు కంటున్న కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యాన్ని స్వయంగా కాంగ్రెస్ సాధించిపెడుతుందా? అనే అనుమానం కలుగుతోంది. రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడుగా నియమించే అంశంపై సీనియర్లు, జూనియర్ల మధ్య కొనసాగుతున్న అంతర్గత పోరాటం ఈ అనుమానాన్ని కలిగిస్తోంది. రాహుల్ గాంధీ మూలంగానే కాంగ్రెస్ ప్రతి ఎన్నికలో ఓడిపోతోంది, ఓటమికి ప్రతిరూపమైన అతన్ని అధ్యక్షుడుగా ఎలా నియమిస్తారని సీనియర్లు అడుగుతుంటే గాంధీ కుటుంబ సభ్యులు లేకపోతే కాంగ్రెస్ మనుగడ కొనసాగించగలుగుతుందా? అని జూనియర్లు ప్రశ్నిస్తున్నారు. గాంధీ కుటుంబ సభ్యులు నాయకత్వం వహించకపోతే కాంగ్రెస్ ముక్కలైపోతుందనేది అందరికి తెలిసిందే.

మితిమీరిన ఉత్సాహం ప్రమాదకరం

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పేరిట పలు రాష్ట్రాలలో జరిగే శక్తి పూజల్ని, అమ్మవారి మహోత్సవాల్ని భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో జాతర రీతిలో ఉత్సవాల్ని నిర్వహించడం ఆనవాయితీ. భక్తుల మొక్కులను ఆశీస్సులతో ఆదిపరాశక్తి వరాల కల్పవల్లి కోరికల్ని తీర్చడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే భక్తుల అత్యధిక ఉత్సాహం, నిర్వాహకుల నిర్లిప్తత కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలోని పరపూర్ గ్రామంలోని పుట్టంగల్‌దేవి ఆలయ పరిసరాల్లో ఇటీవల అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న బాణాసంచా పోటీ ఘటనలో 106 మంది నిహతులు కావడం, 383 మంది భక్తులు క్షతగాత్రులు కావడం కేవలం మానవ లోపం, అత్యుత్సాహమే కారణం.

- దాసరి కృష్ణారెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెట్టి కార్మికులా?

పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలనుంచి రూ.100 స్టాంప్ పేపరుపై ఒక అఫిడ విట్ తీసుకోవాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఆదేశించడం విచిత్రం. ప్రతి ఎమ్మెల్యే తన అఫిడవిట్‌లో, తాను పార్టీ విప్‌ను ధిక్కరించబోనని, వేరే పార్టీలోకి ఫిరాయంచబోనని, కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు విధేయులపై ఉంటానని పేర్కొనాలని సోనియా శాసించిందట. ఇంతకంటె భయానకమైన విషయం మరోటుంటుందా? గల్ఫ్ దేశాల్లో, భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో మనం వెట్టి చాకిరి చేసేవారి గురించి వింటుంటాం.

Pages