S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని కావాలన్న కాంక్ష లేదు

పాట్నా, జూన్ 6: ప్రధాన మంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని తాను ఎన్నడూ ఆశించలేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నితీశ్ బిజెపి యేతర కూటమి తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పాట్నాలో సోమవారం ఆయన ‘సూపర్-30’ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ, జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా పార్లమెంట్ సభ్యుడిని కావాలని ఆశిస్తున్నానని, అంతేతప్ప మంత్రినో, ముఖ్యమంత్రినో లేక ప్రధాన మంత్రినో కావాలని తాను ఎన్నడూ కలగనలేదని చెప్పారు.

అర్హులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

రాజేంద్రనగర్, జూన్ 6: దేశంలోనే కనివిని ఎరుగని రీతిలో డబుల్ బెడ్‌రూం పథకం ప్రవేశపెట్టి పేదలకు విజయవంతంగా ఇళ్లను అందజేస్తున్న ఘనత కేసిఆర్‌కే దక్కుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. సోమవారం అరాంఘర్‌లోని ఇంద్రారెడ్డినగర్, ఏక్తాకాలనీలలో నివసిస్తున్న 150 నిరుపేద కుటుంబాలకు డబుల్‌బెడ్‌రూం పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత శతాబ్ద కాలంగా ఇంద్రారెడ్డినగర్, ఏక్తాకాలనీలలో నివసిస్తున్న 150 కుటుంబాలకు స్థానికంగానే డబుల్ బెడ్‌రూం ఇళ్లను కట్టిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

ఓటుకు నోటిస్తే ఎన్నిక రద్దు?

న్యూఢిల్లీ, జూన్ 6: ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి ధనబలాన్ని ఉపయోగించడం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ‘ఓటుకు నోటు’ ఆధారంగా ఎన్నికలను రద్దు చేసేందుకు వీలు కల్పిస్తూ ఎన్నికల చట్టాన్ని సవరించాలని ప్రభుత్వాన్ని కోరే అంశాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి ఓట్లు రాబట్టేందుకు ధనబలాన్ని ఉపయోగిస్తే ఆ ఎన్నికను వాయిదా వేయడానికి లేదా రద్దు చేయడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద ఎన్నికల సంఘానికి అధికారం ఉంది.

ఐదుగురూ దోషులే

న్యూఢిల్లీ, జూన్ 6: డెన్మార్క్‌కు చెందిన 52 సంవత్సరాల మహిళపై రెండేళ్ల క్రితం అత్యాచారానికి పాల్పడ్డారన్న కేసులో ఐదుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఈ మహిళను కత్తితో బెదిరించి, కిడ్నాప్ చేసి వీరు అత్యాచారానికి పాల్పడ్డారని కోర్టు ధ్రువీకరించింది. నిందితులు ఐదుగురిపై నమోదైన ఆరోపణలను నిర్ధారిస్తున్నామని అదనపు సెషన్స్ న్యాయమూర్తి రమేష్ కుమార్ వెల్లడించారు. అయితే కొత్త చట్టం ప్రకారం వీరికి ఏ విధమైన శిక్షలు వేయాలనే దానిపై తొమ్మిదిన విచారణ జరుపుతామని వెల్లడించారు. ఈ చట్టం ప్రకారం దోషులు 20ఏళ్ల కనీస కారాగార శిక్ష, గరిష్ఠ స్థాయిలో జీవితాంతం జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

నిరాశ్రయులకు గ్రంథాలయం!

న్యూఢిల్లీ, జూన్ 6: నిలువ నీడలేని పేదలకు ధార్మిక సంస్థలు పట్టెడన్నం పెట్టడం, బట్టలివ్వడం, ఆశ్రయం కల్పించడం చూస్తుంటాం. కాని, ఢిల్లీలోని మానవతా దృక్పథం కలిగిన ఒక స్వచ్ఛంద సంస్థ ఓ అడుగు ముందుకేసి అలాంటి అభాగ్యులకు పుస్తక పఠనానికి అవకాశం కల్పించడం ద్వారా వారిలో విజ్ఞానాన్ని, వికాసాన్ని పెంపొందించడానికి నడుం కట్టింది. ఢిల్లీలోని అత్యంత పెద్ద మురికివాడల్లో ఒకటయిన యమున పుష్ట వద్ద ఇప్పుడు ఇళ్లు లేని పేదల కోసం ఒక ఉచిత గ్రంథాలయం వెలసింది.

మీకే మా మద్దతు

జెనీవా, జూన్ 6: అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జి)లో చేరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారత్ చేసిన దౌత్య ప్రయత్నాలకు ఫలితం దక్కింది. 48 దేశాలతో కూడిన ఎన్‌ఎస్‌జి కీలక సమావేశం జరుగనున్న తరుణంలో భారత్ సోమవారం స్విట్జర్లాండ్ మద్దతు సంపాదించగలిగింది. భారతీయులు స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో కూడబెట్టిన నల్లధనాన్ని వెలికితీయడంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు జోహన్ స్క్నెయిడర్ అమ్మన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక, ప్రపంచ అంశాలపై చర్చలు జరిపిన అనంతరం.. ఎన్‌ఎస్‌జిలో భారత్ చేరికకు తమ దేశం మద్దతు ఇస్తోందని ప్రకటించారు.

తీర ప్రాంత భద్రతకు చర్యలు

న్యూఢిల్లీ, జూన్ 6: తీరప్రాంత భద్రతపై కేంద్రం దృష్టిసారించింది. ఉగ్రవాదుల దాడులను నుంచి తీరప్రాంతాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఈ నెల 16న ముంబయిలో ముఖ్యమంత్రుల సమాశం ఏర్పాటు చేశారు. కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరవుతారని ఓ అధికార ప్రకటనలో తెలిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగనుంది. దేశంలో 7,517 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న తీర ప్రాంతంలో 12 మేజర్ పోర్టులు, 187 చిన్న, మధ్యతరగతి పోర్టులు ఉన్నాయి. తీర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంత సిఎంలకు ఈ మేరకు హోంశాఖ ఆహ్వానాలు పంపింది.

సమన్యాయమే!

న్యూఢిల్లీ, జూన్ 6: తెలుగు రాష్ట్రాలు రెండూ విభజన చట్టం ప్రకారమే నడుచుకోవాలని, కృష్ణా జలాల పంపకాలు కేటాయింపుల ప్రకారం సాగాలని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. ఈమేరకు బోర్డు అధికారులకు టెలిఫోన్‌లో ఆదేశాలిస్తూ, తెలంగాణ, ఆంధ్రకు దేనికీ నష్టం వాటిల్లకుండా వ్యవహరించాలని సూచించారు. ఒక రాష్ట్రం పట్ల పక్షపాతంతో వ్యవహరించటం ఎంతమాత్రం మంచిదికాదని బోర్డు అధికారులకు ఉమాభారతి స్పష్టం చేశారు.

కోదండపై ముప్పేట దాడి

న్యూఢిల్లీ/ హైదరాబాద్, జూన్ 6:తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జెఎసి, టిఆర్‌ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది.ఇక అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధం అన్నట్టుగా ఇరు వర్గాలు మాటల దాడిని ప్రారంభించాయి. తెలంగాణ విద్యావంతుల వేదిక సమావేశంలో కెసిఆర్ పాలనను విమర్శిస్తూ టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ చేసిన విమర్శలపై టిఆర్‌ఎస్ మంత్రులు, ఎంపిలు తీవ్ర స్వరంతో స్పందించారు. ఢిల్లీలో ఎంపిలు,హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి మంత్రులు ఒకేసారి కోదండరామ్‌పై ధ్వజమెత్తారు.

ఎమ్మెల్యేలకు ఆఫీసులు!

హైదరాబాద్, జూన్ 6: రాష్టవ్య్రాప్తంగా 119 నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాల నిర్మాణానికి తక్షణం స్థల సేకరణ జరిపి, డిసెంబర్‌లో టెండర్లు పిలువాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యేలకు తమ నియోజక వర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాలు నిర్మించాలని నిర్ణయించారు. నిధులు కూడా మంజూరు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు నియోజక వర్గంలో సొంత ఇళ్లు ఉంటే అదే నియోజక వర్గ ప్రజలకు కార్యాలయంగా మారింది. ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా నియోజక వర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాలుంటే ప్రజలకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

Pages