S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలింక్విజ్ 87

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి

అగ్గిబరాటా (ఫ్లాష్‌బ్యాక్ @ 50)

కథ: బివి ఆచార్య
రచన: జి కృష్ణమూర్తి
కెమెరా: వరదరాజన్
కూర్పు: గోవిందస్వామి
నృత్యం: చిన్ని, సంపత్
కళ: నాగరాజన్
స్టంట్స్:
సంగీతం: విజయా కృష్ణమూర్తి.
నిర్మాత, దర్శకుడు: బి విఠలాచార్య

-సివిఆర్ మాణిక్యేశ్వరి

వెరైటీ కావాలి

పాత చింతకాయపచ్చడి లాంటి సినిమాలు చేసినా చూస్తారన్న ధీమా దర్శక, నిర్మాతలకు ఉంది. అందుకే బ్రహ్మోత్సవం చిత్రాన్ని చావుదెబ్బతీశారు. హిట్టయ్యిందని అవే లాజిక్‌లు, కథనాలు పెడితే చాలదు. కథాబలం, మంచి పాటలు, కళాత్మక విలువలు వినోదభరితంగా సినిమా ఉంటే ఆదరిస్తారని మహేష్ తెలుసుకోవాలి. సినిమాలో సరైన పట్టులేకపోవడంతో బిచ్చగాడులాంటి డబ్బింగ్ సినిమాకు ఆదరణ పెరిగింది.
- పి.శేషగిరిరావు, విశాఖపట్నం

రంగ రంగా..!

ఘటోత్కచుడు ఎలా ఉంటాడు? నేపాళ మాంత్రికుడు ఎలా ఉంటాడు? హిరణ్యకశిపుడు ఎలా ఉంటాడు? అప్పాపురం జమీందారుగారూ, రత్తయ్యగారు ఎలా వుంటారు? వీళ్ళంతా ఎలా ఉంటారో మనకు తెలీదు. ఎస్వీ రంగారావుగారు ఎలా ఉంటారో తెలుసు. ఆయన తెలిస్తే, పైవాళ్ళంతా తెలిసినట్టే. స్పురద్రూపం, గంభీరమైన కంఠస్వరం, అలవోకగా భావాలు పలికే వాచకం.. ఆయన్ను అభిమానించనివారు ఎవరుంటారు? వాళ్ళలో నేను కూడా వున్నందుకు గర్వంగా వుంటుంది.

-బాలకృష్ణ, సికిందరాబాద్

ట్రేడ్ టాక్

బ్రహ్మోత్సవం ప్రభావం తెలుగు తెరపై బాగానే పడింది. ఎంత పెద్ద సినిమా అయినా ఏముందిలే అన్నట్లుగా ఆ సినిమాతో ప్రేక్షకులు నిర్లిప్తతలోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. ఈవారం త్రివిక్రమ్, నితిన్, సమంతల అఆ, కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంగా శ్రీ శ్రీ, చాలాకాలం క్రితం పూర్తయిన శ్రీమతి బంగారంతోపాటుగా స్ట్రాబెరీ అనే చిత్రం విడుదలయ్యాయి. ఈ చిత్రాలలో అఆ ఒక్కటే కాస్త నిదానంగా కలెక్షన్లు రాబడుతోంది. థియేటర్లవద్ద బాక్సాఫీసు గలగలమంటోంది. శ్రీశ్రీ ఫరవాలేదు అన్న మాట వినిపిస్తున్నా థియేటర్లవద్ద ప్రేక్షకులు పల్చగా కనిపిస్తున్నారు. శ్రీమతి బంగారం చిత్రం సెక్సీ కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా వృధా అయింది.

ప్లీజ్..!

వేగంగా పరిశ్రమలోకి అడుగుపెట్టి పెద్ద హీరోలతోనూ చకచకా సినిమాలు చేసేసి అనూహ్యంగా పెళ్లి చేసుకుని వేషాలకు బ్రేక్ చెప్పిన ఈ భారీ అందాల భామ గుర్తుంది కదూ. సంఘవి. ఇప్పుడు తెలుగు పరిశ్రమలో ఆంటీ క్యారెక్టర్లకు డిమాండ్ పెరిగింది కనుక, మళ్లీ చాన్స్ అంటూ ప్రయత్నాలు మొదలెట్టిందట. క్యారెక్టర్ ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధమైందన్న మాట. ఇప్పటికే తమిళంలో మూడార్ కూడమ్, కొళంజి చిత్రాలు చేస్తున్న సంఘవి, ఆ పాత్రలు తనకు మంచి పేరు తెస్తాయన్న ఆశతో ఉంది. తెలుగు లేడీ విలన్ వేషాలపై కనే్నసిన సంఘవి ఎంతవరకూ వర్కవుట్ చేస్తుందో చూద్దాం.

బీచ్‌లో బికినీ హీట్

ఈమధ్య పబ్లిసిటీ పిచ్చి హీరోయిన్స్‌కే కాకుండా టీవి నటీమణులకు కూడా పట్టినట్టుంది. అందుకే ఒక్కొక్కరుగా తమ అందాలను ఆరబోస్తూ.. హీటెక్కిస్తున్నారు!! ఇప్పటికే సీరియల్ నటిగా పాపులర్ అయిన సోనారికా హీరోయిన్‌గా మారి హాట్ హాట్‌గా రెచ్చిపోయి నటిస్తుంది. గ్లామర్ పాత్రలకు సై అంటున్న ఈ భామ ఇటీవలే ఓ బీచ్‌లో బికినీ అందాలు ఆరబోసి షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ భామకు పోటీగా మరో టీవి నటి.. చిన్నారి పెళ్లికూతురు (బాలికావధు) ఫేం నేహ కూడా తానేం తక్కువ కాదని నిరూపించుకుంది. సమ్మర్ హాలీడేస్‌ని ఎంజాయ్ చేయడానికి థాయ్‌లాండ్ వెళ్ళిన ఈ భామ అక్కడ బీచ్‌లో హాట్ బికినీ వేసి గ్లామర్ ఒలకబోస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.

లవ్ ఇన్నింగ్స్

లవర్స్ అన్న తరువాత ముద్దూ ముచ్చట.. కొట్లాట కీచులాటా మామూలే. అందులోనూ సెలబ్రిటీస్ లవ్ అంటే -వీటి మోతాదు కాస్త ఎక్కువే ఉంటుంది. అంతేకాదు, వీలైతే కొంత ఇగో.. కుదిరితే కప్పు కాక ఉండటం సహజం. అందుకే ప్రేమను ప్రదర్శించినపుడు ఇచ్చే గిఫ్ట్‌లూ అతే మోతాదులో ఉంటాయ. కొట్లాడుకున్నపుడు ఇద్దరి మధ్యా కోపాలూ అంతే శ్రుతిలో ఉంటాయ. ఇదంతా బాలీవుడ్ హాట్ లవ్ జంట అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లిల గురించే. ఇద్దరి మధ్యా పబ్లిక్‌గానే ప్రేమాయణం నడిచింది. తరువాత పొరపొచ్చాలు వచ్చాయ. తూచ్ నీకూ నాకూ సంబంధం లేదన్నట్టు దూరందూరంగా ఉన్నారంటూ వార్తలూ వచ్చాయి. తూచ్ తూచ్ మేమిద్దరం సెట్ అయపోయాం అంటూ తాజా షాకిస్తున్నారు.

కొత్తగా... కాపీ ర్యాట్స్!

ఒక సినిమాను డైరెక్ట్‌గా ఎత్తేస్తే
-కాపీ క్యాట్స్. మరి సన్నివేశాలను
ఎడాపెడా ఏరేస్తే -కాపీ ర్యాట్స్
అనాలేమో. ఈ పదానికి ఫిక్సయితే -్భషా బేధాలు,
ప్రాంతీయ తారతమ్యాలు
లేకుండా ‘సినిమా’ను
లెక్కలేనన్ని కాపీ ర్యాట్స్
కొరికేస్తున్నాయి. తెలుగు సినిమాల్లో
సరికొత్త సన్నివేశాలుగా
వండి వడ్డిస్తున్నాయి.

-జి. రాజేశ్వర రావు

Pages