S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరివంశం 152

అక్కడున్న రాజులందరూ ఆయనకు ససంభ్రమంగా ప్రత్యుత్థానం చేశారు. అంజలి ఘటించారు ప్రతి ఒక్కరూ. అట్లా వీణాలాపనం ముగించి ‘కమలాక్షా! అమరులందరు నిన్ను కీర్తిస్తారు. వారిని నీవు కరుణిస్తావు. నీ కీర్తితో సమానమైన కీర్తి ఈరేడు లోకాలలో ఎవరికీ దుర్లభం. నీతో సములెవరూ లేరు’ అని స్తోత్రించాడు నారదుడు.
దానికి కృష్ణుడు ఆహ్లాదకరంగా నవ్వుతూ, ‘నిజమే నీవన్నది. నేను అత్యంత ప్రీతిపాత్రుణ్ణి, పూర్ణ మనోరథ సిద్ధుణ్ణీ, పరిపూర్ణుణ్ణీ అవుతాను ఎప్పుడంటే, అందుకు అనుగుణమైన దక్షిణ ఏ లోపమూ లేకుండా నాకు సమర్పించిన వారి యెడల!’ అన్నాడు.

యమహాపురి 61

‘‘ఇంత చిన్న సాయానికి అంత పెద్ద మాటలొద్దు. మావల్ల ఓ కుటుంబం నిలబడితే అదే పెద్ద సంతోషం నాకు’’ అన్నాడాయన.
అలా వ్యాఘ్రేశ్వరుడు అనంతం ఇంటికి వచ్చాడు. అక్కణ్ణించి అతడి జీవితంలో స్వర్ణయుగం మొదలైంది.
వ్యాఘ్రేశ్వరుడు ఇంజనీరింగులో చేరేసరికి అనంతం కూతురు జయకి పద్దెనిమిదేళ్లు. ఆమె తమ్ముడు ప్రభాకరానికి పధ్నాలుగేళ్లు.
అనంతం, భార్య అతణ్ణి కన్నబిడ్డలతో సమంగా నెత్తిన పెట్టి చూసుకునేవారు. పిల్లలు ముగ్గురూ ఏకోదరుల్లా కలిసిమెలిసి ఉండేవారు.

వసుంధర

నేర్చుకుందాం

చ. ‘ఇది మునికన్య యేని మఱి యే లకొ రుూ లలితాంగి యంచు నా
హృదయము దద్దయుం దవిలె నిప్పలుకింకను నమ్మనేర న
య్యెద విజతేంద్రియుం దనఁగ నిమ్ముని ఁ బాయక బిందు’ నంచు దా
నిది కలరూ పెఱుంగ నవనీపతి యుత్సుకు ఁ డయ్యె నాత్మలోన్

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

అసత్యం కాదు

మనిషంటే మనిషికి
ప్రతిక్షణం భయం
మనిషికన్న మృగం
ప్రతి నిత్యం నయం
దొరతనం పైపైన
దోషగుణం లోలోన
ద్వేషభావం అనునిత్యం
పెత్తనమేనా మనతత్వం
మనిషికున్న బలం
మంచితనం కాదా
అది మరచిన వాడు
అరాచకానికి పెద్దన్నా
మనిషి మాటలు
తేనెల ఊటలవ్వాలి
మనసు తలపులు
బంగారు బాటలవ్వాలి
పరహితం కనిపించని చోట
ఎవరి హితమైనా ఏమేరకు
ఎందుకొచ్చిన తిరస్కారం
ఎవరుమెచ్చే ఛీత్కారం
సుఖమొక్కటే సత్యంకాదు
దుఃఖం సైతం అసత్యం కాదు

- కొల్లు రంగారావు, 9866266740

ఓ ఆడపిల్ల... ఒక మగపిల్లాడు

చాన్నాళ్ళుగా
నేను వాళ్ళనే గమనిస్తున్నాను
ఆ ఇంట్లో ఓ మగపిల్లాడు
ఓ ఆడపిల్ల...
వాడెప్పుడు బయటకెళ్ళినా
తిరిగి ఇంటికొచ్చేదెప్పుడో?!
ఆ పిల్లమాత్రం
ఎలా వెళ్తుందో అలా వచ్చేస్తుంది
ఒంచిన తల ఎత్తకుండా...
వాడికి తలబిరుసుకానీ-
ఆమెకి తనెలాగుండాలో తెలుసు
ఆ ఇంట్లో...
పదిహేనేళ్ళు రాకుండానే
ఆడపిల్ల పెద్దమనిషయ్యింది
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న
ఇంటికి మరో ఐదేళ్ళకే
పెద్ద దిక్కయ్యింది...
పాతికేళ్ళు దాటిపోతున్నా
ఆ మగపిల్లాడు మాత్రం
పెద్దమనిషవ్వలేదు...
ఎప్పటికవుతాడో గ్యారెంటీ లేదు...

- యన్.కె. నాగేశ్వరరావు, 9030360988

దృశ్యాదృశ్యం

ఆరో అంతస్తు బాల్కనీ -
ఊగీ ఊగని ఊయల
పైన
బూడిద రంగులో ఆకాశం
కింద
గాడిద మేస్తున్న మైదానం.
గత కాల వర్తమానాల రజ్జువులకి
ఊగీ ఊగని ఊయల
పెంటుహౌస్ రేకుల మధ్యనుంచి
పావురాళ్ళ మూలుగుల మూర్ఛనలు
వాటి అందం మాటెలా వున్నా,
అవి పాడుచేసిన వైనమే ఎక్కువ
ఎక్కడో విమానం ఎగురుతోంది
చిన్న పక్షిలా -
మనసులో పిల్లలు మెదిలి
గుండె ముడుచుకుంది పిట్టలా -
బావురుమంటున్న ఇంట్లో
పదిలంగా ఈ దేహం
కనురెప్పల వెనుక
గడిచిన కాలం
వెలిసిన పట్టుబట్టలా
రెపరెపలాడుతోంది
ఊగీ ఊగని ఊయల మీంచి

- ఇంద్రగంటి జానకీబాల 9640052509

నిశ్శబ్దపు చెరశాలలో..

అక్కడ
మైదానంలో కూర్చుంటే చాలు
నిశ్శబ్దపు చెరశాలలో
బంధీనైపోతాను
రెక్కలు విప్పాలన్న భావాలు
ఆకాశంవైపు చూపుల్ని అతికిస్తాయి
మట్టిపొరల్ని తరిచి తరిచి చూస్తాయి
ఆ గదిలో
ఒక్కో నీడ కనిపిస్తూ మాయమవుతుంది
మరోసారి
స్పష్టమైన చిత్రం... రంగులు పూసుకుంటుంది
హఠాత్తుగా... కురిసిన వానజల్లు
ఆ చిత్రాన్ని చెరిపేస్తుంది
మరలా... నిశ్శబ్దంలోకి దూకిన నేను
కొత్త లోకంలోకి అడుగులేస్తాను
అక్కడి కన్నీటి జలపాతాల వౌనం
నను ప్రశ్నిస్తుంది
సమాధానం కోసం గాలింపు మొదలవుతుంది
భుజంపై... అక్షరాలు వాలుతాయి

- కెరె జగదీష్, 9440708133

మేటి రచయతల మేలి పరిచయం

డాక్టర్ దేవరాజు మహారాజు సైన్స్ పరిశోధకుడు. సాహిత్యంలో కూడా అతని శోధనలు శాస్ర్తియంగా సాగుతాయి. గతంలో ఈయన కవితా భారతి పేరున భారతీయ భాషలలోని కవులు, వారి కవితలను తెలుగు పాఠకులకు పరిచయం చేసారు. ఆ ప్రయత్నంనుంచి ముందుకు సాగి ఈ పుస్తకంలోని వ్యాసాల ద్వారా తెలుగునుంచి మొదలు ప్రపంచ భాషలలో కొన్నింటివరకు ఎందరో రచయితలను పరిచయం చేస్తున్నారు. బాగా చదివే అలవాటున్న రచయిత, రచనలను, రచయితలను విశే్లషించడానికి పూనుకుంటే తప్పకుండా ఆసక్తికరమైన సమాచారం ముందుకు వస్తుంది. ఈ పుస్తకమే అందుకు ఉదాహరణ. ఈ పుస్తకంలో మొత్తం 160 మంది రచయితల పరిచయ వ్యాసాలున్నాయి. వీటిలో 15 తెలుగు సాహిత్యానికి సంబంధించి నవి.

- కె.బి.గోపాలం, 9849062055

మార్క్స్ విశ్వాసులకు ఓ దిక్సూచి

‘‘మానవుని జైత్రయాత్ర ముగిసి,
సర్వోన్నత దశకు చేరుకొనే స్థాయికి మనిషి ఎదిగేడనీ, అతడు అవతరించిన కొన్ని వేల సంవత్సరాలకు మార్క్సు
అనే ఆయన వివేచించేడు. కాని ఆ
వివేచన అర్థం కోల్పోయింది.
ఇంకా వేల యేండ్లు ప్రకృతితో
పోరాడుతూనే ఉంటాడనీ, ఆ పోరాటం అనంతమనీ అనుభవం చెప్తూంది.’’

కవి కథకుడు కాగలడా?

పద్యం, కవిత, కథ, నాటకం, నవల-ఇవన్నీ సాహిత్య ప్రక్రియలు. పద్యాలు, కవితలు రాసేవారిని కవులని, కథలు రాసేవారిని కథకులనడం మనందరికీ తెలుసు. కవితలు రాసే కవి పద్యాన్ని కూడా అవలీలగా రాయగలడు. ఎందుకంటే పద్యానికి కవితకి దగ్గర సంబంధం ఉంది. ఛందోబద్ధంగా రాస్తే కవితే పద్యం అవుతుంది. ఈ రెండింటికీ భాషలో పట్టు వుంటేనే సాధ్యం. ఛందస్సులో అవగాహన ఉండి భాషా పరిజ్ఞానం వున్నవారెవరైనా పద్యాలు రాయగలరు.

- దూరి వెంకటరావు 9666991929

Pages