S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖండ జ్యోతిస్వరూపమే!

హిరణ్యకశ్యపుడు మహాతపస్వియై ప్రపంచం అంతటిలోనూ ఎదురులేని మహాశక్తివంతుడు అయినాడు. తనను ఎదిరించగల వ్యక్తి ఎవడైనా ఈ భూమి మీద ఉంటే వచ్చి తనను గెలవ వలసిందిగా సవాలు విసిరాడు.
హిరణ్యకశ్యపుణ్ణి ఎదిరించగల ధీరుడు ఎవ్వడూ ముందుకు రాలేదు. దానితో అతడు అహంభావంతో విర్రవీగి- ఈ త్రిలోకాలకూ అధిపతి తానే అనీ, ఈ సర్వసృష్టికీ కర్త తానేననీ ప్రకటించుకొనసాగాడు.
అతని భార్య లీలావతి తన భర్త చేస్తున్న ఆ ప్రకటనను ఆమోదించలేక పోయింది. భర్తను వ్యతిరేకించడం భార్యకు ధర్మంకాదు కాబట్టి వౌనంగా ఉండిపోయింది.

సన్నిధానం యజ్ఞనారాయణ మూర్తి

ఆరాధన.. అమృతయోగం

దై వాన్ని ప్రార్థించడం మనిషికి పెద్ద ఉపశమనం. పొద్దుట లేవగానే ‘నా ఈ జీవితం సుఖ సంతోషాలతో సాగించాలని శతకోటి దేవతలకి వందనాలు’ అని మనసులోనే చెప్పుకోవటంలో మనిషికి ఒక తృప్తి లభిస్తుంది. ఆపదలో వున్నపుడు ఇష్టదైవాన్ని స్మరించడంతో మనసు స్వాంతన పొందుతుంది. ప్రార్థించడమంటే ప్రత్యేకించి గుడికి వెళ్ళనవసరం లేదు. ఎక్కడ వున్న ఏం చేస్తున్నా దైవాన్ని ఆరాధించడం సాధ్యమే. ఇది మూఢ నమ్మకం కాదు. బలహీనత కాదు. మనిషికి ఉత్తేజాన్ని ఇచ్చే అంశం. ఏ బంధమైనా సరే బలపడే ముందు, భరించలేనంతగా బాధిస్తుంది. బాధలను భరిస్తే బంధం బానిస అవుతుంది. కాదని విడిస్తే కాలక్షేపమే కష్టవౌతుంది. గాయపడిన మనసుకి ఓదార్పు గొప్ప ఆరాధన అవుతుంది.

- ఆర్. భల్లం

కృతజ్ఞతాంజలి!

ఛేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయడమో లేక ఆ ఉపకారాన్ని చేసిన మనిషిని సదాగుర్తుంచుకోవడం వారి పట్ల గౌరవభావాన్ని కలిగి ఉండడమే కృతజ్ఞత అని చెప్పుకోవచ్చు. అనేకానేకవిధాలుగా మనిషికి సాయం చేస్తున్న ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పడానికే అనేక రకాల పండుగలు పుట్టుకొచ్చాయి.అట్లానే ప్రతి చెట్టూ ఏదోఒక రకంగా మానవునికి ఉపయోగపడేది. ఆయుర్వేదశాస్తమ్రూ ప్రతిచెట్టూ మనిషి అవసరాలకు పనికి వచ్చేదని చెప్తుంది. ఆదిమ మానవుని దగ్గరనుంచి నేటి ఆధునిక జీవితం గడుపుతున్నా మనిషి సహజమైన గాలి కోసం సహజవనరుల కోసంప్రకృతిమీద ఆధారపడుతున్నాడు. మనిషి కనిపెట్టిన అనేక వస్తువులు యంత్రాలు వల్ల ఏర్పడే కాలుష్యాన్ని చెట్లే పోగొడుతున్నాయి.

- సత్య

మార్గానే్వషకులకు మార్గదర్శి

సర్వమంగళకరమైన రామనామము ఎక్కడ జపించబడుతుందో అక్కడ చిరంజీవి ఆంజనేయుడు పద్మాసనారూఢుడై కొలువుతీరి ఉంటాడు. రామకథాగానం చేస్తున్న ప్రతిచోటా హనుమంతునికి ఒక ఉచితాసనం ఏర్పాటుచేయడం మన సంప్రదాయం. మాతృదేవి అంజన, పితృదేవులు కేసరిలకు వాయుదేవుని వరముచే ఉదయించిన కారణజన్ముడు చిరంజీవి హనుమ. బాల్యంలో సూర్యబింబాన్ని ఫలముగా భావించి ఆరగించడానికి సూర్యమండలములోకి లంఘించిన బాలాంజనేయుని గ్రహణావస్థలోనున్న రాహువు అడ్డుపడగా అతనిని నిరోధించి ముందుకు సాగాడు. ఇది చూసి ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుని హనువులపై మోదగా అవి పొంగి హనుమంతుడైనాడు.

-వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు

శివుని చిద్విలాసమే చిదంబరం

చిదంబరంలోని తిల్లయ్ నటరాజ మందిరం, చిదానంద స్వరూపుడైన పరమేశ్వరుని పావన నిలయం. అనాది అద్భుత నర్తక నాయకుడైన, అందాల నటరాజస్వామి రమ్య రంగ స్థలం. రమణీయ రత్నసభ. చిదంబర నటరాజస్వామి ‘ఆనంద నటరాజ’స్వామి.
ఆయన ఆనంద నాట్యం అతిలోక సుందరం.. అతని అనితర సాధ్యం.. అఖిల జనావళికి సుఖశాంతి సంతోష సంధాయకం. నిజానికి పరమేశ్వరుడు పరమానంద స్వరూపుడు. పరమానందానికి ఓ పాట, ఓ నాట్యం ఒక విస్పష్ట సూచిక. పరమానందాన్ని ప్రాణకోటికి అందించడమే, ఈ నాట్యంలోని అంతరార్ధం. ప్రముఖ జర్మన్ తత్వమేత్త నిట్సే, దైవ పద వివరణ సందర్భంగా తన నిశ్చితాభిప్రాయాన్ని ప్రకటిస్తూ- నాట్యం చేయలేని దైవ రూపాన్ని తాను విశ్వసించలేనని పేర్కొన్నారు.

. - జమలాపురం ప్రసాదరావు

రాముని వయస్సు ఎంత ఉండవచ్చు?

* రావణ సంహారం తరువాత, కుశలవులకు పట్ట్భాషేకం చేసినాక, శ్రీరాముడు అవతారం చాలించాడని విన్నాను. అప్పటికి ఆయన వయస్సు ఎంత వుండవచ్చు?
- కె.యల్.శివాజీరావు, హైద్రాబాద్

- కుప్పా వేంకట కృష్ణమూర్తి

ఇంటిలిజెన్స్ అధికారిగా...

ప్రముఖ నటుడు మహేష్‌బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ ఆశించిన స్థాయి విజయం సాధించకపోవడంతో ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు మహేష్‌బాబు. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చాయి. ఈనెల చివర్లో ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలిసింది. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కే ఈ చిత్రంలో మహేష్‌బాబు ఇంటిలిజెన్స్ అధికారిగా కనిపిస్తాడు. అందుకోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ ఆఫీస్ సెట్‌ను వేస్తారట. మహేష్ సరసన బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.

వైజాగ్‌లో సినీ మ్యూజియం

ప్రముఖ నిర్మాత రామానాయుడు పేరుతో విశాఖలో ‘మ్యూజియం ఆఫ్ సినిమా’ను ఏర్పాటు చేస్తామని, ఆయన పేరుమీద అవార్డును కూడా ప్రకటిస్తామని ఆయన తనయుడు, నిర్మాత సురేశ్‌బాబు అన్నారు. ఆదివారం తమ సొంత స్టూడియోలో రామానాయుడు జయంతి సందర్భంగా స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సురేశ్‌బాబు, తన తండ్రి పేరుతో మెదక్ జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి వ్యవసాయంలో నూతన పద్ధతులపై రైతులుకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. అలాగే ఈ ఏడాదినుంచి కొత్తనటీనటులు, సాంకేతిక నిపుణలను ప్రోత్సహించేలా చిన్నసినిమాలను నిర్మిస్తామని అన్నారు.

నాని సరసన కీర్తి

తెలుగులో హీరోయిన్‌గా నటించిన ‘నేను శైలజ’ చిత్రం మంచి విజయం సాధించడంతో హీరోయిన్‌గా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది కీర్తి సురేష్. ఆ సినిమా తర్వాత ప్రస్తుతం తమిళంలో బిజీ అయిన ఈమెకు అవకాశాలు ఎక్కువయ్యాయి. నటనతోపాటు గ్లామర్‌కు కొదవలేని కీర్తిసురేష్ తాజాగా ఓ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పింది. ఇటీవలే ‘్భలే భలే మగాడివోయ్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని ప్రస్తుతం ‘జెంటిల్‌మెన్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన సినిమా చూపిస్తమావ ఫేమ్ త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తిసురేష్ ఓకే అయింది.

సమంత మాటతోనే అ.. ఆ

కథానాయిక సమంత ఒక రోజు ‘మీ బ్రెయిన్ చాలా తెలివైనది. హృదయం ఎంతో మెత్తనైనది. ఎప్పుడు బ్రెయిన్‌తోనే కథాకథనాలు రాస్తారు. హృదయంతో ఎందుకు రాయరు?’ అని అడిగినప్పటినుండి ఆలోచిస్తూ ‘అ.. ఆ’ చిత్రాన్ని రాసుకున్నాను అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన తారాగణంగా హాసిని అండ్ హారిక క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ రూపొందించిన ‘అ ఆ’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..

Pages