S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదావత్ సత్రం భూముల ఆక్రమాల నిగ్గు తేల్చాలి

తిరుమల, జూన్ 2: సదావత్ సత్రంకు సంబంధించిన భూముల విక్రయాలలో అవకతవకలు జరిగాయని సత్రం పేరుతో ఉన్న వందలాది ఎకరాల భూములను అమ్ముకున్నారని భూము అక్రమాలను ప్రభుత్వం నిగ్గు తేల్చాలని విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి డిమాండ్ చేశారు. ఆయన గురువారం ఉదయం నైవేద్య విరామదర్శన సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయంలో తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటి ఇ ఒ కోదండరామారావు దర్శనం ఏర్పాటు చేసి తీర్థం ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ గంగాతీరాన చాతుర్మాస దీక్ష చేయడం ఆనవాయితీ అన్నారు.

సిఎం నవనిర్మాణ దీక్షలో భాగస్వాములవుదాం

తిరుపతి, జూన్ 2: రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్‌ను అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నవ నిర్మాణ దీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలో భాగస్వాములై రాష్ట్ర ప్రగతికి తోడ్పడదామంటూ ప్రజలు, అధికారులు చేసిన ప్రతిజ్ఞలతో తిరుపతి పుణ్యక్షేత్రం మారుమోగింది. గురువారం నుండి ఈనెల 7వ తేదీ వరకు నవనిర్మాణ దీక్షలు చేపట్టాలని, 8న మహాసంకల్పం చేపట్టాలని రాష్ట్ర ప్రజలకు, అధికారులకు ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపునేపథ్యంలో గురువారం తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద నవనిర్మాణ దీక్షను చేపట్టారు.

రాష్ట్భ్రావృద్ధికి సహకరించండి

చిత్తూరు, జూన్ 2: రాష్ట్భ్రావృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి పిలుపు నిచ్చారు. గురువారం చిత్తూరులో గతంలో సమైక్యాంధ్ర ఉద్యమాలకు వేదికయిన పిసిఆర్ వద్ద నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన దినాన్ని ప్రభుత్వం నవనిర్మాణ దీక్షగా పరిగణించి ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విభజన నేపథ్యంలో మనం అనేక రకాలుగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. ఈనష్టాన్ని పూడ్చుకొని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందివ్వాలన్నారు.

హోదా మరచి అనుచిత వ్యాఖ్యలు

అనంతపురం, జూన్ 2 : తానొక ప్రతిపక్ష నేత అనే విషయాన్ని సైతం మర్చిపోయి వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న జగన్ గురువారం పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామంలో విలేఖరుల సమావేశంలో సిఎం చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశారు. మంత్రి సునీత విలేఖరులతో మాట్లాడుతూ పదేళ్ల వైఎస్ పాలనలో ఏనాడూ తాము విజ్ఞత కోల్పోయి మాట్లాడలేదన్నారు. జగన్ నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని హితవు పలికారు.
పద్ధతి మార్చుకో: జెసి ప్రభాకర్‌రెడ్డి

బస్సు బోల్తా: 14 మందికి గాయాలు

పాడేరు, జూన్ 2: విశాఖ జిల్లా పాడేరు మండలం మినుములూరు వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడిన సంఘటనలో పద్నాలుగు మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న పాడేరు డిపోకు చెందిన బస్సు మినుములూరు గ్రామం వద్ద మలుపులో అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లో బోల్తా పడింది. మలుపు వద్ద డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 25 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.

అమరావతికి పంపొద్దు

హైదరాబాద్, జూన్ 2: తాత్కాలిక రాజధానికి తరలి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు ఉన్నాయని ఎపి ఉద్యోగులు కొందరు గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో చెప్పారు. అమరావతి వెళ్లేందుకు ఇష్టపడని ఎపి ఉద్యోగులు బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరిని , బిజెపి ప్రధాన అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్లను కలిసి ఐదు పేజీల వినతి పత్రం ఇచ్చారు. తాత్కాలిక రాజధానికి ఉద్యోగులను తరలించకుండా చొరవ తీసుకోవాలని వారు పురంధ్రీశ్వరిని కోరారు. తాత్కాలిక రాజధాని వద్దు, శాశ్వత రాజధాని ముద్దు అని వారు పేర్కొన్నారు. నేరుగా తమను అమరావతికి తీసుకువెళ్లాలని వారు చెప్పారు.

సిఆర్‌డిఏ అధికారులతో కాంబోడియా రాయబారి భేటీ

విజయవాడ, జూన్ 2: రాజధాని ప్రాంత అభివృద్ధి అధారిటీ (సిఆర్‌డిఏ) అధికారులతో కంబోడియా రాయబారి నవీన్ శ్రీవాత్సవ, ఉగాండాలోని భారత హై కమిషనర్ ఎవిఎస్ రమేష్‌చంద్ర గురువారం సమావేశమయ్యారు. రాజధాని అమరావతి బృహత్ ప్రణాళిక, భూ సమీకరణ విధానం, పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. అలాగే ఇక్కడ ఉపాధి అవకాశాలపై కూడా సిఆర్‌డిఏ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఆర్‌డిఏ కార్యదర్శ అజయ్ జైన్, కమిషనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉగాండాలో భారత రాయబారి ఏవిఎస్ రమేష్, ముఖ్యమంత్రి చంద్రబాబును సిఎంఓలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రమేష్‌ను ముఖ్యమంత్రి సత్కరించారు.

ఆన్‌లైన్ వ్యాపారంలోకి జిసిసి

విశాఖపట్నం, జూన్ 2: రాష్ట్ర విభజన తరువాత ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వ్యాపారాన్ని పెంచుకుంటూ ఆదాయ లక్ష్యాలను సాధించడంలో గిరిజన సహకార సంస్థ (జిసిసి) ప్రత్యేకతను చాటుకుంటోంది. కేవలం అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారానే ఏడాదికి ఆర్జించే రూ.250 కోట్లతో సరిపెట్టకుండా అనేక రకాలైన వ్యాపారాలతో ఆర్థిక ప్రగతిని సాధించగలుగుతోంది. ఆదాయంతోపాటు, గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. రెండు విధాలా ఫలితాలను సాధిస్తున్న జిసిసి ఇపుడు దేశీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టగలుగుతోంది.

అరెస్టులకు భయపడను

రాజమహేంద్రవరం, జూన్ 2: ప్రభుత్వంలోని కాపు సామాజికవర్గానికి చెందిన కొందరు పెద్దలతో చేయిస్తున్న విమర్శలు, అరెస్టులు జరుగుతాయనే బెదిరింపులకు భయపడి తమ ఉద్యమాన్ని విరమించేది లేదని కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టంచేశారు. కాపులను బిసిల్లో చేరుస్తానని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే హామీ ఇచ్చినందున, దాన్ని నెరవేరుస్తారో, మళ్లీ రోడ్డెక్కమంటారో ఆయనపైనే ఆధారపడివుందన్నారు.

ఫిరాయంపు నేతలకు పదవులా?

కర్నూలు, జూన్ 2 : తెలుగుదేశం పార్టీని భుజాల మీద పెట్టుకుని మోస్తున్న బిసిలను చిన్న చూపు చూస్తున్నారు, పార్టీ మారిన వారికి, డబ్బులున్న వారికి పదవులు ఇస్తున్నారు ఇది మంచి సంప్రదాయం కాదని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి సోదరుడైన మాజీ మంత్రి కెఇ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిడిపి తరపున రాజ్యసభకు బిసిలను ఎంపిక చేయకపోవడంపై కెఇ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం కర్నూలులో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అలాగే నగరంలోని టిడిపి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

Pages