S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొరియాపాడులో అతిసార

హిరమండలం, జూన్ 2: మండలంలోని ఎం.ఎల్.పురం గ్రామ పంచాయతీ పరిధిలోని గొరియాపాడు గిరిజన గ్రామంలో అతిసార విజృంభించింది. 15 మంది అస్వస్థతకు గురయ్యరు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. గ్రామంలోని వ్యాధిబారిన పడిన రోగులు కొంతమంది ఇంటి వద్ద చికిత్స పొందుతుండగా, మరికొంతమంది చొర్లంగి పిహెచ్‌సి ఆసుపత్రిలో చేరారు. వ్యాధి ప్రబలడానికి కలుషిత నీరే కారణమని భావిస్తున్నారు. రోగులకు చికిత్స నిమిత్తం గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వ్యాధిబారిన బిడ్డిక లలిత, రామారావు, గురవమ్మ, సాయింత్, భారతమ్మ తదితర రోగులున్నారు. వీరందరికీ చొర్లంగి పిహెచ్‌సికి తరలించారు.

ఆటోలకు జిపిఎస్ విధానం

శ్రీకాకుళం(టౌన్), జూన్ 2: జిల్లాలో నేర తీవ్రత కంటే ట్రాఫిక్ అత్యంత దారుణంగా ఉందని జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి అన్నారు. స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్ రికార్డుల పరిశీలనకు గురువారం ఆయన విచ్చేసిన సందర్భాన్ని విలేఖర్లతో మాట్లాడారు. జాతీయ రహదారిపై వాహనాలు అత్యంత వేగంగా వెల్తుండటాన్ని నియంత్రించాల్సి ఉందని, దీనికై రోడ్డుపక్కన ఇనుప స్టాపర్స్ కాకుండా ప్లాస్టిక్ స్టాపర్‌లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అలాగే ఆటోలకు పోలీసుస్టేషన్ల రిజిస్ట్రేషను తప్పనిసరని, అయితే చాలా ఆటోలకు పోలీసు స్టేషన్ రిజిస్ట్రేషన్ లేకపోవడం విచారకరమన్నారు.

ఇబ్బందులున్నా.. అధిగమిస్తాం

విజయనగరం, జూన్ 2: రాష్ట్ర విభజన అశాస్ర్తియంగా జరగటంతో ప్రభుత్వం, ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖల మంత్రి డాక్టర్ మృణాళిని అన్నారు. తెలంగాణకు మేలు కలిగిన కారణంగా అక్కడ సంబరాలు జరుపుకుంటున్నారని, కష్టాల్లో, నష్టాల్లో ఉన్న మనం అభివృద్ధి చెందేంత వరకు నవనిర్మాణ దీక్షలు కొనసాగించాలని సూచించారు. నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మంత్రి మృణాళిని, జడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్యే మీసాల గీత, కలెక్టర్ ఎంఎం నాయక్, ఎస్పీ కాళిదాసు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

నవనిర్మాణ దీక్షకు ‘ఉపాధి కూలీలు’

గజపతినగరం, జూన్ 2: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నవ నిర్మాణ దీక్షా కార్యక్రమానికి ఉపాధి హామీ కూలీలను ర్యాలీ కోసం తీసుకువచ్చి వారి కూలీ డబ్బులకు గండి కొట్టారు. మండల కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాలైన గజపతినగరం, ఎం. వెంకటాపురం, పురిటిపెంట, బూడిపేట గ్రామాల నుండి ర్యాలీకి కూలీల పనులను నిలిపివేసి తీసుకురావడం కనిపించింది. గజపతినగరం ఎం.వెంకటాపురం గ్రామంలో అయితే ఉదయం పూట పూర్తిగా పనులు నిలిపివేసి ర్యాలీ కోసం తరలించారు. ఉదయం ఎనిమిది గంటలకు ఎంపిడిఓ కార్యాలయం వద్దకు కూలీలు చేరుకొని 11 గంటల వరకు పడిగాపులు కాసారు.

ఎసిబి దాడులతో ఉద్యోగుల్లో గుబులు

విజయనగరం (్ఫర్టు), జూన్ 2: విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో గురువారం సాయంత్రం అవినీతి నిరోధకశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ నారాయణరావులక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడిన మరుక్షణమే పలు విభాగాల అధికారులు, ఉద్యోగులు కార్యాలయం నుంచి పరుగులు తీశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎసిబి డిఎస్‌పి లక్ష్మీపతి ఆధ్వర్యంలో సిఐలు ఎస్.లక్ష్మోజి, బి.రమేష్ రికార్డులను పరిశీలించారు. పట్టణానికి చెందిన బిల్డర్ మురళీకి చెందిన జి-ప్లస్ 4 భవన నిర్మాణానికి సంబంధించిన ఎండార్స్‌మెంట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

పాడిపరిశ్రమ అభివృద్ధికి చర్యలు

విజయనగరం, జూన్ 2: జిల్లా అవసరాలను దృష్టిలో పెట్టుకుని పాడి పరిశ్రమ, పశు సంపద అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం ఎం నాయక్ పశుసంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే పాల ఉత్పత్తి ఇంకా పెంచవలసిన అవసరం ఉందని చెప్పారు. రైతులకు అవసరమైన రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించి పశువులు కొనుగోలు చేయించడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్సు హాలులో పశు సంవర్ధక శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పశువులకు అవసరమైన దాణాకోసం జిల్లాలో విస్తృతంగా పశుగ్రాసం క్షేత్రాలను ఏర్పాటుచేయాలని చెప్పారు.

జిల్లాలో రూ.531 కోట్ల రుణాలు లక్ష్యం

బొండపల్లి, జూన్ 2: ప్రస్తుత ఏడాదిలో 531కోట్ల మేర డ్వాక్రా సభ్యులకు రుణాలు అందించడమే లక్ష్యమని డిఆర్‌డిఎ పిడి ఢిల్లీరావు తెలిపారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల మంది డ్వాక్రా సభ్యులు ఉండగా వీరిలో లక్ష మందికి జీవనోపాధి శిక్షణకు కసరత్తుపూర్తయిందని చెప్పారు. ఇప్పటికే తమ సిబ్బంది గ్రామ స్థాయిలో ఆసక్తి గల సభ్యులను శిక్షణ కోసం గుర్తించారని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రణాళికను సెర్ఫ్‌కు పంపించామని అన్నారు. స్ర్తినిధి, బ్యాంకు లింకేజీ ద్వారా జీవనోపాధిలో భాగంగా మహిళలకు ఆర్థిక పరిపుష్టిత చేస్తామని చెప్పారు.

పిహెచ్‌సి సిబ్బంది పనితీరు మార్చుకోవాలి

వేపాడ, జూన్ 2: స్థానిక పిహెచ్‌సి వైద్యసిబ్బంది తమ పనితీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం. శారద హెచ్చరించారు. గురువారం వేపాడ పిహెచ్‌సిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అపుడే ప్రసవించిన మహిళను, బిడ్డను పరిశీలించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసారు. సక్రమమైన రీతిలో వైద్య సేవలు అందిస్తే ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అన్నారు. ఇన్ పేషెంట్లు 50శాతం ఉన్నారు. ఐపి ఓపి పెరిగితే పట్టిక కూడా పెరుగుతుందని చెప్పారు. ఓపి నమోదుతోపాటు అప్‌లోడ్ చేయాలని అన్నారు. దీనివలన ఆసుపత్రికి అవసరమైన మందులు హెచ్‌డి ఎఫ్ బడ్జెట్ వస్తుందని తెలిపారు.

చీడివలసలో వైద్యశిబిరం

కొత్తవలస, జూన్ 2: మండలంలోని చీడివలస గ్రామంలో గురువారం వియ్యంపేట పిహెచ్‌సి వైద్యాధికారులు వైద్య శిబిరం నిర్వహించారు. ఆంధ్రభూమి గురువారం పత్రికలో మంచంపట్టిన చీడివలస అనే శీర్షికలతో కథనం వెలువడింది. దీనిపై వైద్య సిబ్బంది స్పందించి గురువారం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. వియ్యంపేట పిహెచ్‌సి వైద్యులు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సిబ్బంది రోగులను పరీక్షించారు. చీడివలస గ్రామంలో ప్రతి ఇంటికీ తమ సిబ్బందిని పంపించి పరీక్షలు చేసారు. జ్వరాలతో బాధపుడుతున్న రోగులను పరిశీలించారు. ఈ సీజన్‌లో వైరల్ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయని, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు లేవని చెప్పారు.

బ్యాంక్ మేనేజర్‌ని.. నటుడిగా మారా..

బొబ్బిలి, జూన్ 2: టివి సీరియల్స్, చలనచిత్రాల్లో సందేశాత్మకం కొరవడిందని, కేవలం వినోదానికే పరిమితమయ్యాయని ప్రముఖ సినీ నటుడు, నాటక రచయిత కోట శంకరరావు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గురువారం బొబ్బిలిలో ఓ నాటకం ప్రదర్శించడానికి వచ్చిన ఆయన స్థానిక లోకబంధు రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు నాటకరంగం ఎంతో సంతృప్తి ఇచ్చినట్లు తెలిపారు. విద్యార్థి దశ నుంచి వివిధ నాటకాల్లో నటించినట్టు తెలిపారు. అప్పటికే తన సోదరుడు కోట శ్రీనివాసరావుచలన చిత్రరంగంలో మంచిపేరు సాధించినట్లు వెల్లడించారు. తాను బ్యాంకులో మేనేజర్ స్థాయి ఉద్యోగం చేస్తూ నాటకరంగంలోకి వచ్చినట్టు తెలిపారు.

Pages