S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

భట్టిప్రోలు, జూన్ 2: పదవ తరగతి మార్కుల జాబితా తెచ్చుకునేందుకు పాఠశాలకు వెళ్ళి తిరిగి వస్తున్న ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ సంఘటన మండలంలోని పల్లెకోనలో జరిగింది. గ్రామానికి చెందిన ఆర్ పిచ్చమ్మ (15) అనే విద్యార్థిని అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది పదవ తరగతి ఉత్తీర్ణురాలైంది. మార్కుల జాబితా తెచ్చుకునేందుకు గురువారం ఉదయం తన సోదరుడు రాధా ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళ్ళి తిరిగి వస్తుండగా గ్రామంలోని మద్యం దుకాణం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్క మార్జిన్‌లో ద్విచక్ర వాహనం జారి పడిపోయింది.

తెనాలిలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

తెనాలి రూరల్, జూన్ 2: రాష్ట్రంలోని పలుజిల్లాలలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ పసుపులేటి బాలశంకర్ అలియాస్ శంకర్‌ను తెనాలి పోలీసులు గురువారం వలపన్ని పట్టుకున్నారు. స్థానిక త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ జివి రమణమూర్తి అరెస్టు వివరాలు వెల్లడించారు. నేరస్తుడు బాలశంకర్ చేబ్రోలు మండలం బండపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలిపారు. 2014నుండి పలు నేరాలకు పాల్పడుతూ భారీగా బంగారం, నగదు, వస్తువులు అపహిరిస్తున్నట్లు చెప్పారు. తెనాలి పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన ఐదు దొంగతనాలలో ముద్దాయిగా విచారణలో తేలిందన్నారు.

తుపాకీ నీడలో పాలకొండ మండల సమావేశం

పాలకొండ(టౌన్), జూన్ 2: ప్రజాసమస్యలు ప్రస్తావించేందుకు ఏర్పాటు చేసిన సాధారణ మండల సమావేశానికి 144 సెక్షన్ అమలపై స్థానికులు నివ్వెరపోయారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం తుపాకీ నీడలో మండల సమావేశం ఎంపిపి లక్ష్మి అధ్యక్షతన జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో కర్నేన అప్పలనాయుడును ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించడం చెల్లదని, కొంతమంది ఎంపిటిసిలు లేవనెత్తారు. ఈ అంశం పట్ల సమావేశంలో ప్రస్తావించాలని వాటపాగు వారాడ సుభాషిణి రెండు రోజుల కిందట ఎంపిడిఒను కోరడంతో ఆ ప్రస్తావనను కూడా ఎజెండాలో చేర్చారు. దీంతో ప్రత్యేక ఆహ్వానితుని నియామకంపై సుమారు రెండు గంటలు వాడీవేడిగా చర్చ జరిగింది.

నిరుద్యోగుల ఫిర్యాదుపై డిప్యూటీ డిఇవో విచారణ

మందస, జూన్ 2: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ప్రైవేట్ కళాశాల్లో విద్యార్థులను చేర్పించాలని కొంతమంది ఇంటింటా ప్రచారం చేస్తుండడంపై పలువురు నిరుద్యోగులు డిప్యూటీ డిఇవో సత్యానారాయణమూర్తికు ఫిర్యాదు చేశారు. గురువారం మందస మండల రిసోర్స్ కార్యాలయంలో ఆరుగురు ఉపాధ్యాయులు, ఫిర్యాదుదారులు బి.హరికృష్ణ, సింహాచలం, మోహనరావు తదతరులను డెప్యూటీ డిఇవో గురువారం విచారించారు. దీనిపై డెప్యూటీ డిఇవో ఫిర్యాదుదారులు, ఉపాధ్యాయులు నుంచి లిఖితపూర్వకంగా వివరాలను సేకరించారు. దీనిపై తుది నివేదికను డిఇవోకు నివేదిస్తామని తెలిపారు.

200 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు

ఆమదాలవలస, జూన్ 2: అందరికీ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో నియోజకవర్గంలో సుమారు 200 ఎకరాల్లో వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత పాలకులు అవినీతి, అక్రమాలు రాజకీయ కుట్రలు కారణంగా రాష్ట్రం విడిపోయి తీవ్ర కష్టనష్టాలకు గురైందని ఈ నష్టాలను తిరిగి ప్రజల కష్టంతో భర్తీ చేసుకుని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుకుంటామని ఆయన అన్నారు.

నేటి నుంచి నవ నిర్మాణ సదస్సులు: కలెక్టర్

శ్రీకాకుళం, జూన్ 2: నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నుంచి వివిధ అంశాలపై సదస్సులను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ సదస్సులు బి.ఆర్.అంబేద్కర్ ఆడిటోరియంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి జరుగుతాయని చెప్పారు.

నయవంచన దీక్ష!

శ్రీకాకుళం(టౌన్), జూన్ 2: రాష్ట్ర విభజనలో తనవంతు పాత్రను నిర్వహించి, నాలుగు పర్యాయాలు విభజనకు అనుకూలంగా లేఖలిచ్చి, నేడు నవనిర్మాణ దీక్ష అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో మొదటిసారిగా విభజనకు అనుకూలంగా మాట్లాడింది తెలుగుదేశం పార్టీ నేతలే అంటూ మండిపడ్డారు. ఆనాడు అనుకూలంగా ప్రకటన చేసి, నేడు ఏ విధంగా చంద్రబాబు నవనిర్మాణ దీక్ష చేపడతారని ఆమె ప్రశ్నించారు.

‘నవ్యాంధ్ర’ సాధ్యం

శ్రీకాకుళం, జూన్ 2: రాష్ట్భ్రావృద్ధికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పనిచేయాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. నవ నిర్మాణ దీక్ష కార్యక్రమం గురువారం ఇక్కడ ఏడు రోడ్లు జంక్షన్‌లో జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శోభాయాత్రను మంత్రి ప్రారంభించారు. అంతకుముందు ఎపీ రాష్ట్ర సాధనలో ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు విగ్రహానికి అచ్చెన్న పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు. సమైఖ్యాంధ్రకు వేదికగా నిలిచిన ఏడు రోడ్ల కూడలి వరకూ శోభాయాత్ర ఘనంగా జరిగింది.

రాష్ట్భ్రావృద్ధి అందరి బాధ్యత

ఇచ్ఛాపురం, జూన్ 2: రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా చేయడం అందరి బాధ్యత అని ఎమ్మెల్యే బి.అశోక్ అన్నారు. గత యుపిఎ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడం వల్ల ఎన్నో కష్టానష్టాలను ఎదుర్కొంటున్నామన్నారు. పట్టణంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి నవ నిర్మాణ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. విభజన పరిణామాలను ప్రజలకు వివరించడానికి నవ్యాంధ్ర నిర్మాణానికి వారిని సమాయత్తపరచడానికి సిఎం చంద్రబాబునాయుడు సంకల్పం మేరకు ఆరు రోజులు పాటు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.

సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిదీ

జి.సిగడాం, జూన్ 2: నేటి సమాజంలో సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉత్తరాంధ్రా సాధు పరిషత్ సంఘ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. స్థానిక షిర్డీసాయి ఆలయంలో గురువారం నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధర్మాన్ని రక్షించడం కోసం భగవంతుడు అనేక రూపాలలో అవతరిస్తున్నారన్నారు. మనస్సును నిగ్రహ శక్తి కలిగి ఉండాలన్నారు. ఈవిశ్వాన్ని నడిపించేది ధర్మమన్నారు. శ్రీరాముని మాట ప్రతీ ఒక్కరు ఆచరించి గ్రామాలను రామనామ సంకీర్తనలతో అయోధ్యగా మార్చేందుకు భక్తులందరూ కృషి చేయాలన్నారు.

Pages