S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘనంగా నవ నిర్మాణ దీక్ష

భీమవరం, జూన్ 2: భీమవరం పట్టణంలో నవ నిర్మాణదీక్ష ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీ వరకు ఈ దీక్ష సాగనుంది. గురువారం జ్యోతి ప్రజ్వలన చేసి నియోజకవర్గంలో నవనిర్మాణ దీక్షను ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. గత రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందో ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. సిఎం చంద్రబాబుతో పాటు ఎవరి స్థాయిలో వారు కష్టపడితే గ్రామ, పట్టణం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయన్నారు. ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ భీమవరం మున్సిపాల్టీలో రెండేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని వివరించారు. భీమవరం ఎంపిడిఒ వై.

సిఎం ప్రసంగం పూర్తి కాకుండానే...

యలమంచిలి, జూన్ 2: మండల కేంద్రం యలమంచిలి రైతు భవనంలో గురువారం నిర్వహించిన నవనిర్మాణ దీక్ష అధికారుల కోసమేనన్నట్టు సాగింది. నవనిర్మాణ దీక్షకు అధికారులు, ప్రజాప్రతినిధులంతా పాల్గొన్నారు. తొలుత టివిని ఏర్పాటుచేసి సిఎం చంద్రబాబు ప్రసంగాన్ని, ప్రతిజ్ఞను వీక్షించారు. సిఎం చంద్రబాబునాయుడు ఉదయం 11 గంటలకు నవ నిర్మాణ దీక్షా ప్రతిజ్ఞను ప్రారంభించిన వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు నిలబడి ప్రతిజ్ఞ చేశారు. సిఎం ప్రసంగం మధ్యలోనే ఎంపిపి బొప్పన సుజాత తప్ప మిగిలిన ప్రజాప్రతినిధులందరూ ఒక్కొక్కరూ వేదికపై నుండి వెళ్లిపోయారు.

ఆరుగురు అరెస్టు

కొవ్వూరు, జూన్ 2: ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మోటారు సైకిళ్లు తదితర దొంగతనాలకు, మహిళల మెడల్లో గొలుసుల చోరీకి పాల్పడిన, చోరీ సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తులను పట్టణ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుండి రూ.16 లక్షల విలువైన 34 మోటారు సైకిళ్లు, బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం జరిగిన విలేఖరుల సమావేశంలో పట్టణ డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు.

రాష్ట్ర పునర్నిర్మాణానికి కంకణబద్ధులు కండి

గుంటూరు, జూన్ 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కంకణబద్ధులు కావాలని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్లు పూరె్తైన సందర్భంగా ప్రభుత్వాదేశాల మేరకు గురువారం శ్రీ వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో జిల్లా యంత్రాం గం ఏర్పాటుచేసిన నవ నిర్మాణదీక్ష సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అశాస్ర్తియంగా రాష్ట్రాన్ని విభజించిన తీరు బాధాకరమని, అయినా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని పుల్లారావు అన్నారు.

‘కోల్డ్’స్కాంలో 15 మంది ఉద్యోగులు

గుంటూరు, జూన్ 2: జిడిసిసిబిలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూరె్తైంది. మొత్తం కోటి 55 లక్షలకు సంబంధించిన నరసరావుపేట కోల్డ్‌స్టోరేజీ అవినీతి భాగోతంలో 15 మంది ఉద్యోగులకు భాగస్వామ్యమున్నట్లు తేలింది. 2013లో నరసరావుపేట కోల్డ్‌స్టోరేజీలో రైతులు నిల్వచేసుకున్న క్వింటాళ్ల కొద్దీ మిర్చిటిక్కీలు మాయమైన వ్యవహారంలో అప్పటి జిడిసిసిబి చైర్మన్ నల్లపాటి చంద్రశేఖరరావుతో సహా కొందరు అధికారులు, ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో నల్లపాటి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా, అక్రమాలకు పాల్పడిన మరికొందరు ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది.

అర్ధరాత్రి కుంభవృష్టి

గుంటూరు, జూన్ 2: జిల్లాలో బుధవారం అర్ధరాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. రాత్రి 1 గంట నుంచి గంటన్నరపాటు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టితో పాటు ఈదురుగాలుల ధాటికి భారీ వటవృక్షాలు నేలకొరిగాయి. గుంటూరు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపునీరు ప్రవహించడంతో పాటు చెట్లు కూలిపోవడంతో రాక పోకలకు అంతరాయం కలిగింది. అరండల్‌పేట, కలెక్టరేట్, ఏటి అగ్రహారం, పట్ట్భాపురం, శ్యామలానగర్, బృందావనగార్డెన్స్, రెడ్డిపాలెం తదితర ప్రాంతాల్లో చెట్లు రోడ్లకు అడ్డంగా విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు తెగి పడటంతో తెల్లవారు ఝాము వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

సినీ సెట్టింగ్ లారీ బోల్తా

అచ్చంపేట, జూన్ 2: తాడువాయి పంచాయతీ పరిధిలోని బంగారుతండా వద్ద గురువారం లారీ అదుపు తప్పి బోల్తా పడింది. కృష్టా పుష్కరాల్లో భాగంగా మాదిపాడు నుండి దోసపాటిచెరువు వరకు రెండు దారుల రోడ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నరసరావుపేటకు చెందిన సినీ సెట్టింగ్ లారీ బెల్లంకొండ అడ్డ రోడ్డు వద్ద గురువారం రాత్రి సాంఘిక నాటకం ప్రదర్శించి వస్తున్న న్యూ బన్ని సినీ సెట్టింగ్ లారీ మరో ప్రదర్శన కోసం కృష్ణా జిల్లా మేళ్ళచెరువు వద్ద వదినేపల్లిలో నాటక ప్రదర్శనకు వెళ్తూ బంగారుతండా వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో లారీలో ప్రయాణిస్తున్న 20 మందిలో 18 మందికి గాయాలయ్యాయి.

రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబే..

తెనాలి, జూన్ 2: రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడేనని, నీరు చెట్టు, ఇసుక దోపిడీతో అవినీతికి అడ్డాగా మారుస్తున్నారని రాష్ట్ర వైసిపి కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున ఆరోపించారు. గురువారం తెనాలి వైసిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నాడు రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడైన చంద్రబాబు నేడు అసత్య మాటాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అంతా బిజెపినే చేసిందంటూ కల్ళబొల్లి మాటలు చెప్పి మాయం చేస్తున్నారన్నారు.

నష్టపరిహారం చెల్లించి నిర్మాణం చేపట్టండి

గుంటూరు (పట్నంబజారు), జూన్ 2: ఎఇఎల్‌సికి సంబంధించిన గుంటగ్రౌండ్‌కు చెందిన స్థలాన్ని నగరపాలక సంస్థ అధికారులు రోడ్డు వెడల్పులో భాగంగా తీసుకుంటున్న దృష్ట్యా ఆ స్థలానికి వెంటనే నష్టపరిహారం చెల్లించి నిర్మాణ పనులు చేపట్టాలని ఇద్వా వ్యవస్థాపక అధ్యక్షుడు గోళ్లమూడి రాజసుందరంబాబు డిమాండ్ చేశారు.

అన్నవరపు రామస్వామికి ఆదిశేషయ్య స్మారక తొలి పురస్కారం

గుంటూరు (కల్చరల్), జూన్ 2: ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామికి ప్రసిద్ధ డోలు వాద్య విద్వాంసులు భూసురపల్లి ఆదిశేషయ్య పేరిట ఏర్పాటు చేసిన తొలి స్మారక పురస్కారాన్ని ఈ నెల 4వ తేదీన ప్రదానం చేయనున్నారు. గురువారం పురస్కార ప్రదానోత్సవ విశేషాలను ఆదిశేషయ్య కుమారుడు, సాహితీవేత్త డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు విలేఖర్లకు తెలిపారు. తంజావూరు తవిల్ వాద్య బాణిని ఆంధ్ర రాష్ట్రంలో అనుసరించి అనేకమందిని శిష్యులుగా తయారుచేసిన భూసురపల్లి ఆదిశేషయ్య ప్రథమ ఆరాదనోత్సవ సభను శనివారం సాయంత్రం 6.30 గంటలకు బృందావన గార్డెన్స్ వెంకన్న ఆలయం ప్రాంగణంలో అన్నమయ్య కళా వేదికపై నిర్వహిస్తామన్నారు.

Pages