S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

06/19/2018 - 23:56

భారతీయ జనతాపార్టీ తప్పిదాన్ని దిద్దుకొంది. పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ-పీడీపీ-తో కలసి జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం భాజపా చేసిన ఘోరమైన తప్పిదం. మంగళవారం భాజపా ఈ చారిత్రక మహాపరాధాన్ని దిద్దుకొంది, జమ్మూ కశ్మీర్ మంత్రివర్గం నుంచి వైదొలగింది! భాజపాకు చెందిన మంత్రులందరూ తమ రాజీనామా పత్రాలను రాష్ట్ర గవర్నర్‌కు పంపించారట!

06/18/2018 - 23:56

మన మెతకదనం ప్రధాన కారణం.. జమ్మూ కశ్మీర్‌లో మానవ అధికారాలకు భంగం వాటిల్లుతోందని ‘ఐక్యరాజ్య సమితి’ వారి నివేదికలో ఆరోపించడం అన్యాయం మాత్రమే కాదు, అతార్కికం కూడ! మానవుల వౌలికమైన హక్కులకు నియంతృత్వ దేశాలలోను, రాజరిక వ్యవస్థలున్న దేశాలలోను, మత రాజ్యాంగ వ్యవస్థలున్న దేశాలలోను, బీభత్సకాండను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలున్న దేశాలలోను దశాబ్దుల తరబడి విఘాతం కలిగించింది.

06/15/2018 - 23:45

ప్లాస్టిక్ కాలుష్యంపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం ప్రకటించడం ప్రశంసనీయం. 2022 నాటికి రాజధాని నగరాన్ని ‘ప్లాస్టిక్’ రహిత ప్రాంగణంగా మార్చడం తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమట. ప్లాస్టిక్ వ్యర్థాల నుండి దేశాన్ని విముక్తం చేయడానికి దేశవ్యాప్తంగా దశాబ్దుల తరబడి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు చర్యలను ప్రకటించాయి. కాని ఈ ప్రకటనలు ప్రచారానికి మాత్రమే పరిమితం కావడం నడుస్తున్న కథ.

06/14/2018 - 23:07

న్యాయ ప్రక్రియలో కొనసాగుతున్న అలసత్వానికి ఇది మరో నిదర్శనం. తమిళనాడుకు చెందిన పద్దెనిమిది మంది శాసన సభ్యత్వాలు రద్దయ్యాయా? లేదా? అన్న విషయం గురువారం మదరాసు ఉన్నత న్యాయస్థానం చెప్పిన తీర్పు వల్ల స్పష్టం కాకపోవడం ఈ ‘అలసత్వం’! తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబర్ ఐదవ తేదీన దివంగత అయిన తరువాత కొనసాగుతున్న నాటకీయ పరిణామక్రమంలో ఈ శాసనసభ్యుల ‘బహిష్కరణ’ గొప్ప వైచిత్రి.

06/14/2018 - 01:35

పాకిస్తాన్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని మాటిమాటికీ ఉల్లంఘిస్తుండడానికి ప్రధాన కారణం మన రక్షణ నీతిని మళ్లీ ఆవహించిన మెతకతనం. 2003లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని 2013 నుంచి పాకిస్తాన్ నిరంతరం ఉల్లంఘిస్తుండడం నడుస్తున్న వైపరీత్యం. 2014 తరువాత ఈ ఉల్లంఘనలు దాదాపు నిత్యకృత్యమయ్యాయి.

06/12/2018 - 23:47

మానవీయ నైతిక నిష్ఠను అక్రమ వాణిజ్య సామ్రాజ్య విస్తరణ విలాసం- ఫాషన్- ఆవహించి ఉండడం అమెరికా, ఉత్తర కొరియాల మధ్య కుదిరిన ఒప్పందానికి నేపథ్యం. ఈ ఒప్పందం ప్రకారం ఉత్తర కొరియా ప్రభుత్వం అణ్వస్త్ర నిర్మాణ కార్యక్రమాన్ని, అణుపాటవ పరీక్షలు శాశ్వతంగా నిలిపివేస్తుంది. అణుపాటవ పరీక్షా ప్రాంగణాలను, అణ్వస్త్ర ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేస్తుందట! అమెరికా ప్రభుత్వం ఉత్తర కొరియా భద్రతను కాపాడుతుంది.

06/11/2018 - 23:45

చైనాతో కొనసాగుతున్న మన సంబంధాలలో నిహితమై ఉన్న వైరుధ్యాలకు ‘షాంఘయి’ కూటమి మరో నిదర్శనం. చైనా ఆధిపత్య విస్తరణ కోసం 2001లో ఏర్పడిన ఈ ‘షాంఘయి సహకార సమాఖ్య’- ఎస్‌సిఓ- షాంఘయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్-లో మనదేశం సభ్యత్వం పుచ్చుకోవడమే మన విదేశ వ్యవహారాల విధాన వైపరీత్యం.

06/10/2018 - 00:12

రాజకీయ ప్రత్యర్థులను నిర్మూలించి రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలు ప్రపంచ చరిత్రలో కొత్తేమీకాదు. మహానేతలు అబ్రహాం లింకన్, కెన్నడీ వంటి వారెందరో హత్యా రాజకీయాలకు బలైపోయారు. మన దేశానికి సంబంధించినంతవరకు శ్యాంప్రసాద్ ముఖర్జీ, పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి వారెందరో ఉగ్రవాదానికి ప్రాణాలు కోల్పోయారు. అయినా మానవ సమాజం గుణపాఠాలు నేర్చుకోలేదు.

06/08/2018 - 23:53

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం పట్ల పెరుగుతున్న ఆదరణకు ఇది మరో ప్రబల చిహ్నం. నిజానికి ఇది జాతీయ అస్తిత్వం పట్ల పెరుగుతున్న ధ్యాసకు, జాతీయ అస్తిత్వ పరిరక్షణ పట్ల పెరుగుతున్న శ్రద్ధకు నిదర్శనం. ‘సంఘం’ గురువారం సాయంత్రం నాగపూర్‌లో నిర్వహించిన మహాసభ వేదిక పైనుంచి ప్రసంగించిన మాజీ రాష్టప్రతి ప్రణవ్‌కుమార్ ముఖర్జీ ఈ ‘్ధ్యస’ను మరోసారి ప్రస్ఫుటింప చేశాడు, ఈ ‘శ్రద్ధ’ను మరోసారి ఆవిష్కరించాడు!

06/07/2018 - 23:59

ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే చర్యలకు దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ప్రాధాన్యం లభించింది. రిజర్వు బ్యాంకు వారు ‘వడ్డీ’ శుల్కాన్ని- ఇంటరెస్ట్ రేట్- రిపోరేట్-ను పెంచారు. వడ్డీ రేట్లు పెరగడం వల్ల ధరలు తగ్గుతాయన్నది వౌలిక ఆర్థిక సూత్రం. ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఇందుకు వ్యతిరేకంగా వడ్డీ రేట్లు తగ్గడం వల్ల ధరలు, ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతాయట!

Pages