S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/21/2017 - 00:53

న్యూఢిల్లీ, మార్చి 20: విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్ టైటిల్‌ను హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన తమిళనాడు కైవసం చేసుకుంది. సోమవారం నాటి ఫైనల్‌లో ఆ జట్టు బెంగాల్‌ను 37 పరుగుల తేడాతో ఓడించింది. సెంచరీతో కదంతొక్కిన తమిళనాడు వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు 47.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది.

03/21/2017 - 00:51

రాంచీ, మార్చి 20: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ చివరి రోజున కూడా యుద్ధ పూర్వక వాతావరణం నెలకొంది. ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం కలహించుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్, ఓపెనర్ మాట్ రెన్‌షాను చిత్రమైన హావభావాలను ప్రదర్శిస్తూ హేళన చేసిన భారత పేసర్ ఇశాంత్ శర్మ మరోసారి అతనితో కయ్యానికి కాలుదువ్వాడు.

03/21/2017 - 00:49

ఇండియన్ వెల్స్, మార్చి 20: ప్రతిష్ఠాత్మక ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషులు, మహిళల విభాగాల్లో ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్, 14వ ర్యాంకర్ ఎలెనా వెస్నినా తమ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్న ప్రత్యర్థులను ఓడించి టైటిళ్లు కైవసం చేసుకున్నారు. ఇద్దరూ తమతమ దేశాలకు చెందిన వారితోనే తుది పోరాటాన్ని కొనసాగించడం గమనార్హం.

03/21/2017 - 00:46

న్యూఢిల్లీ, మార్చి 20: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు ఏప్రిల్ 22న జరగనున్న నేపథ్యంలో, అదే రోజు ఢిల్లీలో జరగాల్సిన మ్యాచ్‌ల్లో మార్పులు అనివార్యమయ్యాయి. తాజా షెడ్యూల్ ప్రకారం మే ఆరున ఢిల్లీ డేర్‌డెవిల్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ మే ఆరున జరుగుతుంది. ఏప్రిల్ 22న అదే జట్టుతో ముంబయిలో తలపడుతుంది.

03/21/2017 - 00:45

దుబాయ్, మార్చి 20: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్‌ఓ)గా అంకూల్ ఖన్నా నియమితుడయ్యాడు. ఏడాది కాలంగా అతను ఎయిర్ ఏషియాలో సిఎఫ్‌ఓగా పని చేస్తున్నాడు. ఆ ఉద్యోగాన్ని విడిచి, అతను ఐసిసి సిఎఫ్‌ఓగా ఈనెలాఖరున పదవీ బాధ్యతలు స్వీకరిస్తాడు. ఈ విషయాన్ని ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ ప్రకటించాడు. అంకూర్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపాడు.

03/21/2017 - 00:45

మాడ్రిడ్, మార్చి 20: స్పానిష్ సాకర్ లీగ్ లా లిగా టోర్నమెంట్‌లో భాగంగా వలెన్షియాతో జరిగిన మ్యాచ్‌ని బార్సిలోనా 4-2 తేడాతో గెల్చుకుంది. స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ రెండు గోల్స్ సాధించి, బార్సిలోనా విజయంలో కీలక భూమిక పోషించాడు. అతను 45, 52 నిమిషాల్లో గోల్స్ చేశాడు. లూయిస్ సౌరెజ్ (35వ నిమిషం), ఆండ్రె గోమ్స్ (89వ నిమిషం) చెరొక గోల్ చేశారు.

03/20/2017 - 01:20

రాంచీ, మార్చి 19: ఫస్ట్‌డౌన్ ఆటగాడు చటేశ్వర్ పుజారా డబుల్ సెంచరీ పూర్తిచేయగా, వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా శతకాన్ని నమోదు చేయడంతో, ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ను తొమ్మిది వికెట్లకు 603 పరుగుల భారీ స్కోరువద్ద భారత్ డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

03/20/2017 - 01:13

ఇండియన్ వెల్స్, మార్చి 19: గతంలో నాలుగు పర్యాయాలు ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించిన తాను మరోసారి విజేతగా నిలుస్తానని స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ధీమా వ్యక్తం చేశాడు.

03/20/2017 - 01:11

న్యూఢిల్లీ, మార్చి 19: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రక్షాళను దృష్టిలో ఉంచుకొని సుప్రీం కోర్టు నియమించిన అధికారుల కమిటీ (సిఒఎ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ క్రికెట్‌లో పవర్ హౌస్‌గా వెలిగిపోతున్న ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ)కు షాకిచ్చింది. బోర్డు నిబంధనావళిలో మార్పులను సిఒఎ ఆదివారం ఖారారు చేసింది. మారిన నిబంధనల ప్రకారం, ఇన్నాళ్లూ ఎంసిఎకు ఉన్న శాశ్వాత ఓటింగ్ హోదాకు తెరపడింది.

03/20/2017 - 01:10

కొలంబో, మార్చి 19: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టును 4 వికెట్ల తేడాతో గెల్చుకున్న బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను డ్రా చేసుకుంది. మొదటి టెస్టులో విజయం సాధించిన లంక, ఈ మ్యాచ్‌ని కూడా తన ఖాతాలో వేసుకొని క్లీన్‌స్వీప్ చేయాలని అనుకుంది. కానీ, బంగ్లాదేశ్ ఎదురుదాడి ముందు నిలవలేక ఓటమిపాలైంది.

Pages