S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/24/2015 - 07:53

నాగపూర్, నవంబర్ 23: దక్షిణాఫ్రికా పేసర్, ప్రపంచ నంబర్ వన్ బౌలర్ డేల్ స్టెయిన్ ఫిట్నెస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 25 నుంచి భారత్‌తో మొదలయ్యే మూడో టెస్టులో అతను ఆడతాడా లేదా అన్నది ఇంకా ఖరారు కాలేదు. సోమవారం అతను కొంత సేపు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే, అతను కండరాల నొప్పి నుంచి పూర్తిగా కోలుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

11/23/2015 - 06:04

గ్రీస్‌లో దేశవాళీ టోర్నీ మ్యాచ్ రద్దు

11/23/2015 - 06:03

సెబ్రింగ్, నవంబర్ 22: లాంబోర్గిని బ్లాన్క్‌పెయిన్ ట్రోఫియో ఆసియా సిరీస్‌లో భారత డ్రైవర్ అర్మాన్ ఇబ్రహీంకు ద్వితీయ స్థానం లభించింది. కార్ రేసింగ్‌ను కెరీర్‌గా స్వీకరించిన తర్వాత విశేష ప్రతిభ కనబరుస్తున్న 26 ఏళ్ల అర్మాన్ తన సహచరుడు దిలాంతా మలగమువాతో కలిసి అద్భుత ప్రతిభ కనబరిచాడు. గేర్ బాక్స్ సమస్యలు తలెత్తకపోతే, ఈ సీజన్‌లో అర్మాన్ తొలి టైటిల్‌ను అందుకొని ఉండేవాడు.

11/23/2015 - 06:02

లా లిగాలో రియల్ మాడ్రిడ్‌పై బార్సిలోనా గెలుపు

11/23/2015 - 06:02

అఫ్గాన్‌పై బంగ్లాదేశ్ విజయం

11/23/2015 - 06:01

కోల్‌కతా, నవంబర్ 22: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఆది వారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో గోవా ఫుట్‌బాల్ క్లబ్‌ను 4-0 తేడాతో ఓడించిన డిఫెండింగ్ చాంపి యన్ అట్లెటికో డి కోల్‌కతా నంబర్ వన్ స్థానాని కి దూసుకెళ్లింది. సమీగ్ దౌతీ రెండు గోల్స్ చేసి కోల్‌కతా విజయంలో కీలక భూమిక పోషించా డు. బొర్జా ఫెర్నెండెజ్, ఇయాన్ హ్యూమ్ చెరొక గోల్ సాధించారు.

11/23/2015 - 06:01

న్యూఢిల్లీ, నవంబర్ 22: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌కు ఇరు దేశాల ప్రభుత్వాల నుంచి ఆమోద ముద్ర లభిస్తే, వేదిక ఎక్కడ ఉండాలనే అంశంపై చర్చ జరుగుతోంది. గత ఏడాది కుదిరిన ఒప్పందం ప్రకారం తమ దేశానికి టీమిండియా రావాల్సి ఉంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) స్పష్టం చేస్తున్నది.

11/23/2015 - 06:00

హర్గడా, నవంబర్ 22: భారత క్యూయిస్టు పంకజ్ అద్వానీ ఖాతాలో మరో ప్రపంచ టైటిల్ చేరింది. ఇక్కడ జరిగిన ఐబిఎస్‌ఎఫ్ ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో అతను చైనాకు చెందిన జువా జింటాంగ్‌ను ఢీకొని 8-6 ఫ్రేమ్స్ (117-6, 75-16, 29-68, 63-23, 87-01, 16-72, 110-13, 113-01, 52-65, 13-84, 77-36, 14-126, 26-82, 116-24) తేడాతో విజయం సాధించాడు. అద్వానీకి కెరీర్‌లో ఇది 15వ ప్రపంచ టైటిల్. స్నూకర్స్‌లో ఐదవది.

11/23/2015 - 05:59

నాగపూర్: భారత ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపిస్తున్నది. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ అతను సున్నాకే అవుటయ్యాడు. పేసర్ వెర్నన్ ఫిలాండర్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. బెంగళూరులో జరగాల్సిన రెండో టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట మాత్రమే సాధ్యమైంది.

Pages