S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/30/2017 - 05:06

ఏలూరు, జూలై 29: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెక్నాలజీ అంటే ఎంత ఇష్టపడతారో రాష్ట్రప్రజలందరికీ తెలిసిందే. ఇక ఆ టెక్నాలజీని వాడి ప్రభుత్వ ధనం పొదుపు చేస్తానంటే అంతకుమించిన ఇష్టం. ఈ ఒరవడి అందిపుచ్చుకున్నారో ఏమోగాని పశ్చిమగోదావరి జిల్లాలో కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ లబ్ధిదారుల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త యాప్‌ను తెరపైకి తీసుకువచ్చారు.

07/30/2017 - 05:05

విశాఖమపట్నం, జూలై 29: యువతరంతో ఉప్పొంగుతున్న యువ భారత్‌ను ప్రపంచంలోనే అగ్రామిగా నిలిపే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనాలని నలంద విశ్వ విద్యాలయం కులపతి ఆచార్య విజయ్ పాండురంగ భట్కర్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 83,84 స్నాతకోత్సవ కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా ఎయు కాన్వొకేషన్ హాల్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

07/30/2017 - 02:17

హైదరాబాద్, జూలై 29: ఉస్మానియా యూనివర్సిటీ సి హాస్టల్‌లో నాన్‌బోర్డర్లు ఖాళీ చేయాలని పేర్కొంటూ అధికారులు నీటి సరఫరాను, విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దాంతో ఇక్కట్లకు గురైన విద్యార్థులు ఉద్యమానికి సిద్ధమయ్యారు. ప్ల కార్డులు పట్టుకుని వారంతా వర్సిటీ ధర్నా, నిరసన కార్యక్రమాలను నిర్వహించడంలో వర్శిటీలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

07/30/2017 - 02:26

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ టెట్ తుది కీ విడుదల చేసినట్టు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. టిఎస్‌టెట్ పోర్టల్ నుండి తుదికీని అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని వారు సూచించారు.

07/30/2017 - 02:25

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విస్తృతమవుతోంది. గాంధీ దవాఖానాలో భవాని అనే ఏడునెలల గర్భిణి (23) శనివారం స్వైన్‌ఫ్లూవల్ల మరణించింది. గాంధీ దవాఖానాలో స్వైన్‌ఫ్లూ చికిత్సకు ప్రభుత్వం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసింది. స్వైన్‌ఫ్లూ సోకిన వారిని ఈ వార్డులో చేర్చి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

07/30/2017 - 02:02

హైదరాబాద్, జూలై 29: విద్యుత్ సంస్థలో ఔట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న 20,903 మంది ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ సిఎం కె చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఫైలుపై సంతకం చేశారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్‌పిడిసిఎల్, ఎన్‌డిపిడిసిఎల్ పరిధిలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఈ నాలుగు సంస్థల పాలక మండళ్లు నిర్ణయం తీసుకున్నాయ.

07/30/2017 - 02:01

హైదరాబాద్, జూలై 29: రానున్న రోజుల్లో న్యాయవిద్యలో సర్ట్ఫికేట్ కోర్సులను ప్రారంభించాలని నల్సార్ -న్యాయ విశ్వవిద్యాయలయాన్ని సిఎం కె చంద్రశేఖరరావు సూచించారు. శనివారం నాడిక్కడ అట్టహాసంగా జరిగిన నల్సార్ 15వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

07/30/2017 - 01:58

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ బంగారమే. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి పన్ను విధానంతో ఆదాయం తగ్గుతుందన్న అంచనాలు తలకిందులయ్యాయి. రాష్ట్ర ఖజానాపై కాసుల వర్షం కురిసింది. 2017-18 సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసిక కాలంలో గత ఏడాదితో పోలిస్తే దాదాపు 11 శాతం పెరిగింది. 2016-17లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు రూ.11,895 కోట్లు వసూలైతే, ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో రూ. 13,194.42 కోట్ల ఆదాయం వచ్చింది.

07/30/2017 - 01:56

విజయవాడ, జూలై 29: కేంద్ర మంత్రిగా సంతృప్తికరంగానే తన విధులు నిర్వర్తించినప్పటికీ రెండు ఆకాంక్షలు నెరవేరలేదనే బాధ తనను వెంటాడుతున్నదని ఎన్‌డిఏ ఉప రాష్టప్రతి అభ్యర్థి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో శనివారం జరిగిన ఆత్మీయ సన్మాన సభలో వెంకయ్య తన మనసులో మాట బయటపెట్టారు. పూర్తి కాశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగం కావాలనేది తన చిరకాల ఆకాంక్ష.

07/30/2017 - 01:54

నంద్యాల, జూలై 29: కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఆగస్టు నెలలో జరుగనున్న ఉప ఎన్నిక నామినేషన్ల ఘట్టం శనివారం ప్రారంభమైంది. తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ శనివారం బాధ్యతలు చేపట్టారు.

Pages