S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/27/2017 - 02:24

అమరావతి, జూలై 26: డ్రగ్స్ విచారణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఆ బాధల నుంచి తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అనే్వషిస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు పరిశ్రమను తరలించేందుకు లాబీయింగ్ ప్రారంభించారు. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

07/27/2017 - 02:23

హైదరాబాద్, జూలై 26: మాదకద్రవ్యాల కేసులో నోటీసు అందుకున్న ఐటెం సాంగ్ గర్ల్ ముమైత్ ఖాన్ గురువారం సిట్ ముందుకు హాజరుకానున్నారు. తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో బుధవారం నటి చార్మిని సిట్ బృందం విచారించిన విషయం తెలిసిందే. ఒక ఏఎస్పీ స్థాయి అధికారిణితోపాటు ముగ్గురు మహిళా అధికారులు ముమైత్‌ఖాన్‌ను విచారించనున్నట్టు సిట్ అధికారులు తెలిపారు.

07/27/2017 - 02:23

హైదరాబాద్, జూలై 26: ఆరుగురు సినీ ప్రముఖుల విచారణతో కీలక సమాచారం రాబట్టిన సిట్ బృందం, డ్రగ్స్ దందా ఆట కట్టించేందుకు మరింత దూకుడుగా ముందుకు వెళ్లనుంది. బుధవారం హీరోయిన్ చార్మి కౌర్ ఇచ్చిన సమాచారం సిట్ బృందానికి కీలకం కానుందని అంటున్నారు.

07/27/2017 - 01:46

న్యూఢిల్లీ, జూలై 26: రాష్ట్భ్రావృద్ధికి అవసరమైన రక్షణ శాఖ భూములను బదలాయించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సుముఖత వ్యక్తం చేశారని సిఎం కె చంద్రశేఖర్ రావు వెల్లడించారు. సచివాలయ నిర్మాణం, రహదార్ల విస్తరణకు అవసరమైన భూములను బదలాయించేందుకు అవసరమైన ప్రక్రియను స్వయంగా తానే పర్యవేక్షిస్తానని కూడా హామీ ఇచ్చారని చెప్పారు. బుధవారం కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని విడివిడిగా కలిశారు.

07/27/2017 - 01:45

హైదరాబాద్, జూలై 26: టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం పేదల సంక్షేమానికి స్వర్ణయుగంగా మారిందని, ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రూ. 40వేల కోట్లతో వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నా రు. నగరంలోని కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జియాగూడలో రూ. 71.40 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన 840 డబుల్ బెడ్ రూం ఇళ్లకు మంత్రి బుధవారం శంకుస్థాపన చేశా రు.

07/27/2017 - 01:40

హైదరాబాద్, జూలై 26: ‘డ్రగ్స్ గురించి నాకు తెలీదు. షూటింగ్ విరామం, పేకప్ తరువాత కొందరు డ్రిక్స్ తీసుకునేవారు. అందులో మత్తు పదార్థాలు మిళితమై ఉండేవేమో.. స్పష్టంగా తెలీదు’ అంటూ విచారణలో సినీ నటి చార్మి వాంగ్మూలమిచ్చినట్టు సమాచారం. డ్రగ్స్ కేసులో బుధవారం హీరోయిన్ చార్మికౌర్‌ను సిట్ బృందం విచారించింది. కోర్టు ఆదేశాలమేర ఉదయం 10:30కు మొదలైన విచారణ సాయంత్రం 4:45కు ముగించింది సిట్ బృందం.

07/27/2017 - 01:39

కాకినాడ, జూలై 26: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నిరవధిక పాదయాత్ర విషయంలో ఊహించినట్జే జరిగింది. పాదయాత్రపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అనుమతి లేదంటూ యాత్రకు ఉపక్రమించిన ముద్రగడను అడ్డుకుని గృహ నిర్భంధం చేశారు. దీంతో కిర్లంపూడి గ్రామంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

07/27/2017 - 01:38

ఖమ్మం, జూలై 26: ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబాన్ని అంతం చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ కుటుంబంలోని పెద్ద కొడుకు. ఖమ్మం జిల్లా జీళ్లచెరువు గ్రామంలో ఈ దుర్ఘటన సంచలనమైంది. కుటుం బ సమస్యలను తట్టుకోలేక తల్లితండ్రులు, భార్య, కూతుళ్లును మట్టుబెట్టి పాలేరు రిజర్వాయర్ కాల్వలోకి తోసేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఆరుగురి మృతదేహాలు పాలేరు రిజర్వాయర్ కాలువలో బుధవారం ఉదయం బయటపడ్డాయి.

07/27/2017 - 01:38

హైదరాబాద్, జూలై 26: ఆంధ్ర, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం కొత్త సమస్యలకు తావిస్తోంది. వచ్చే నెలాఖరునాటికి శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోకి నీటి ప్రవాహం పెరిగితే గత ఏడాది మాదిరిగా ఆంధ్రకు 512 టిఎంసి, తెలంగాణకు 299 టిఎంసి నీటి నిష్పత్తి మేరకు పంపకాలకు ఒప్పుకునేది లేదంటూ తెలంగాణ తెగేసి చెప్పేసింది. ఆగస్టులో ఈ ఏడాది కృష్ణా జలాల పంపిణీపై బోర్డు సమావేశం జరగనుంది.

07/27/2017 - 01:37

విశాఖపట్నం, జూలై 26: అవినీతి అధికారులు, రాజకీయ నేతలపట్ల ఛండశాసనుడిలా వ్యవహరిస్తానని సిఎం చంద్రబాబు హెచ్చరించారు. విశాఖ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న 100 చ.గజాల స్థలాలను రెగ్యులరైజ్ చేస్తూ, ఆయా ఇళ్ళలో నివసిస్తున్న వారికి బుధవారం పట్టాలు పంపిణీ చేశారు.

Pages