S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/26/2017 - 20:42

హైదరాబాదులో నవంబర్‌లో జరుగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరయ్యేందుకు నరేంద్రమోదీ అంగీకరించారని చంద్రశేఖరావు వెళ్లడించారు. అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు తేదీలు ఇంకా ఖరారు కాలేదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ పర్యటన తేదీలు ఖరారు కాగానే సదస్సు తేదీలు ప్రకటిస్తామన్నారు.

07/26/2017 - 20:42

హైదరాబాదులోని కరీంనగర్ రహదారిపై ఉన్న రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆంగీకరించిందని చంద్రశేఖరరావు వెళ్లడించారు. రాష్ట్ర సచివాలయం నిర్మాణానికి మార్గం సుగమం అయినట్లేనా అని ఒక విలేకరి అడుగగా కేవలం సచివాలయ నిర్మాణం తమకు ముఖ్యం కాదని ముఖ్యమంత్రి చెప్పారు.

07/25/2017 - 20:08

గద్వాల: ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి జలాశయానికి గత వారం రోజులుగా వస్తున్న వరద నీటి ఉద్ధృతి రోజు రోజుకు పెరుగుతోంది. సోమవారం ఎగువ ప్రాంతం నుండి ఆల్మట్టి జలాశయానికి 1,42,325 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటిని సద్వినియోగం చేసుకుంటూ అక్కడి అధికారులు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని పెంచుకుంటున్నారు.

07/25/2017 - 02:39

భద్రాచలం టౌన్, జూలై 24: తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధుల నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

07/25/2017 - 03:02

హైదరాబాద్, జూలై 24: మాదకద్రవ్యాల కేసులో రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తోంది. ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు సినీ నటుడు నవదీప్‌ను సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసులో వరుసగా నాలుగు రోజులు సినీ ప్రముఖులను విచారించిన సిట్ అధికారులు ఆదివారం విరామం ఇచ్చారు.

07/25/2017 - 03:02

హైదరాబాద్, జూలై 24: డ్రగ్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న సినీ నటి ఛార్మిపై మానసికంగా , శారీరకంగా ఎలాంటి ఒత్తిడికి గురిచేయవద్దని, ఆమె నుండి రక్త నమూనాలు, గోళ్లు, తలవెంట్రుకలు సేకరించవద్దని ఉమ్మడి హైకోర్టు అబ్కారీ శాఖను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఉత్తర్వులు జారీ చేశారు.

07/25/2017 - 03:03

హైదరాబాద్, జూలై 24: హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల వ్యవహారం సంచలనం సృష్టించిన నేపథ్యంలో మరో డ్రగ్ ముఠా పట్డుబడింది. సోమవారం ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఒక వైపు డ్రగ్స్ కేసు విచారణ జరుగుతుండగానే మరో డ్రగ్ ముఠా పట్టుబడడం కలకలం రేపుతోంది.

07/25/2017 - 19:22

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరొక బహుమతిచ్చింది. 2017-18 యాసంగి పంటకు ఫిబ్రవరి నుంచి 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు సేద్యానికి రోజూ 9 గంటలపాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో సేద్యానికి రోజూ ఏడు గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా చేశారు. కాగా, తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత రోజూ 9 గంటలకు పెంచారు.

07/25/2017 - 19:21

హైదరాబాద్జూ: డ్రగ్స్ మాఫియా కేసులో విచారణ పారదర్శకంగా సాగుతోందని, సినీ పరిశ్రమను టార్గెట్ చేయడంలేదని రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఆర్‌వి చంద్రవదన్ స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగ పరీక్షల కోసం బలవంతంగా రక్తనమూనాలు, వెంట్రుకలు సేకరించడం లేదన్నారు. నోటీసులు అందుకుని విచాణకు వచ్చినవారి అంగీకారంతోనే రక్త నమూనాలు సేకరించడం జరుగుతుందని చంద్రవదన్ పునరుద్ఘాటించారు.

07/24/2017 - 01:53

హైదరాబాద్, జూలై 23: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితితులు తెలుసుకోవడానికి నిర్వహించిన సమగ్ర సర్వే తరహాలోనే భూముల వివరాలు, రికార్డులు, క్రయ, విక్రయాల ఆప్‌డేట్, పంటల సాగు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల వారీగా భూ వివరాలను ‘గామ్ ఆబాది’పై సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Pages