S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/23/2017 - 01:09

కర్నూలు, జూలై 22: రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదు. రాజధాని నగరం లేకుండా అప్పులతో బయటకు వచ్చాం. ఆ సమయంలో నన్ను నమ్మి ప్రజలు అధికారం అప్పగించటంతో ధైర్యంగా ముందడుగు వేశాం. అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నాం. ఎంతైనా శ్రమిస్తా. రాష్ట్భ్రావృద్ధే ప్రధాన అజెండా అని సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.

07/23/2017 - 01:07

బళ్లారి: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద పెరుగుతూ శనివారానికి నీటి మట్టం 1601 అడుగులకు చేరింది. 44.6 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 22 టిఎంసి నీరుంది. 50 టిఎంసి చేరగానే కాల్వలకు నీరు వదులుతామని అధికారులు తెలిపారు. వరద నీటితో కళకళలాడుతున్న తుంగభద్ర జలాశయం.

07/23/2017 - 01:05

హైదరాబాద్,జూలై 22: నూతన జాతీయ విద్యావిధానంలో కొత్త నిబంధనలను చేర్చాలని కేంద్రం యోచిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుండి 5, 8 తరగతుల్లో డిటెన్షన్ పద్ధతి అమలుకు గట్టిగా నిర్ణయించింది. ఆంధ్ర, తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఈ విధానానికి వ్యతిరేకంగా ఉన్నా, కేంద్రం తన చట్టంలోనే గట్టి నిబంధనలను చేర్చాలని భావిస్తోంది.

07/23/2017 - 03:27

హైదరాబాద్, జూలై 22: డ్రగ్స్ దందా డొంక కదిలించిన సిట్ ఆఫీసర్ అకున్ సబర్వాల్‌కు బెదిరింపులు రావడం, కేసు మరింత తీవ్రం కానుందన్న సంకేతానికి తావిస్తోంది. మత్తు అభియోగాలతో సిట్ విచారణ ఎదుర్కొంటున్న చిన్న చేపలిచ్చే సమాచారంతో, పెద్ద చేపల గుట్టు రట్టయ్యే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ముప్పేట దాడి మొదలైంది.

07/22/2017 - 03:15

నల్లగొండ, జూలై 21: యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం విస్తరణ నిర్మాణ పనులు ఒక్కొక్కటిగా ముందుకు సాగుతున్నాయి. వచ్చే దసరా నాటికి స్వామివారి గర్భాలయం దర్శనాలు పునఃప్రారంభించే దిశగా ప్రణాళిక మేరకు పనులు సాగుతున్నా కొండపైన శిల్పాలు, ఇతర నిర్మాణాలు సాగించడంలో కొంత జాప్యం కొనసాగుతోంది.

07/22/2017 - 01:33

హైదరాబాద్, జూలై 21: ఏడేళ్ల క్రితం నాటి నోటిఫికేషన్ ప్రాతిపదికగా నిర్వహించిన గ్రూప్-1 ఎంపిక పరీక్ష ఇంటర్వ్యూల దశకు చేరుకుంది. అయితే ఈ ఇంటర్వ్యూల అనంతరం ఎంపిక జాబితా తామిచ్చే ఇచ్చే తీర్పు నియమనిబంధనలకు లోబడి ఉండాలని మరో మారు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం నాడు వ్యాఖ్యానించింది.

07/22/2017 - 01:10

హైదరాబాద్, జూలై 21: రానున్న మరో నాలుగేళ్లలో ప్రాంతాల సరిహద్దుల్లేకుండా దేశంలో ఎక్కడినుంచైనా ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయవచ్చని తెలుగు రాష్ట్రాల ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ శ్యామప్రసాద్ చౌదరి వెల్లడించారు. ఇందుకు ప్రత్యేకంగా కమిటీని నియమించినట్టు చెప్పారు.

07/22/2017 - 01:06

చిత్తూరు, జూలై 21: నిరుపేదలు, దిక్కులేనివారు చనిపోతే అంత్యక్రియలకు ప్రభుత్వం 30వేలు ఆర్థిక సాయం అందిస్తుందని సిఎం చంద్రబాబు ప్రకటించారు. వారి మరణం గౌరవప్రదంగా ఉండేలా సంతాప సభలు కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండోరోజు పర్యటనలో భాగంగా శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

07/22/2017 - 01:03

హైదరాబాద్, జూలై 21: మత్తు పదార్థాల (డ్రగ్స్) కేసులో నటుడు సుబ్బరాజు పోలీసు విచారణలో ఏం చెప్పాడు? సినీ పరిశ్రమ గుట్టు విప్పాడా? మూడో రోజు విచారణతో బడాబాబుల పేర్లు బయటకు రానున్నాయా? అనే అనుమానాలు పరిశ్రమలోని కొందరిని తొలిచేస్తున్నాయి. అందుక్కారణం ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అనుసరిస్తున్న విచారణ తీరే.

07/22/2017 - 00:55

హైదరాబాద్, జూలై 21: కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతోన్న పేచీకి ఇప్పుడు గోదావరి తోడైంది. గోదావరి జలాలపైనా రెండు రాష్ట్రాలు పట్టు కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. జల సౌధలో శుక్రవారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్‌కె సాహు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పరస్పరం వాదనలకు దిగాయి.

Pages