S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/24/2017 - 01:53

ఖమ్మం, జూలై 23: ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఖమ్మంలో 150 పడకల మాతా-శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు.

07/24/2017 - 01:50

హైదరాబాద్, జూలై 23: తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మాదక ద్రవ్యాల దందా, తాజాగా ఐటి రంగాన్ని దడ పుట్టిస్తోంది. ఐటి కంపెనీల్లో పని చేసే కొందరు ఉద్యోగులు పని ఒత్తిడి, మానసికంగా అలసిపోవడంతో ప్రశాంతత కోసం మాదక ద్రవ్యాలు స్వీకరిస్తున్నట్లు ఒకటి రెండు కంపెనీలు గుర్తించాయి.

07/24/2017 - 01:15

హైదరాబాద్, జూలై 23: హైదరాబాద్‌లో ఉన్న పబ్ లైసెనులన్నీ రద్దు చేయాలని టి కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం అసెంబ్లీ మీడియా హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బహుమతి డ్రగ్స్ దందా అంటూ డ్రగ్స్ మాఫియాపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

07/24/2017 - 01:14

కుభీర్, జూలై 23: నిర్మల్ జిల్లా కుభీర్ మండలానికి సమీపంలోని మహారాష్ట్ర సరిహద్దులో ఆదివారం ప్రేమజంట దారుణహత్యకు గురైంది. తన చెల్లెలు పెళ్లయన కొద్ది రోజులకే భర్తను కాదని ప్రియుడితో కలిసి పారిపో వడాన్ని సహించలేని అన్న చెల్లి, ఆమె ప్రియుడిని దారు ణంగా హత్య చేశా డు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నా య. పూజ (20), గోవింద్ (25) అనే ఇద్దరు ప్రేమికులు. బోకర్ తాలూకాలోని పేర్వాన్ గ్రామానికి చెందిన వారు.

07/24/2017 - 01:14

గద్వాల, జూలై 23: ఎగువ ప్రాం తంలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది పరీవాహక ప్రాం తాలలో నిర్మించిన ఆల్మట్టి జలాశయానికి ఆదివారం పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరుతున్నట్టు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు. ఆల్మట్టి జలాశయానికి ఎగువ ప్రాంతం నుండి 1,30,148 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులో నీటి ఉద్ధృతి పెరుగుతోంది.

07/24/2017 - 01:13

హైదరాబాద్, జూలై 23: నగరంలో ఉన్న హై లైఫ్, టానిక్ పబ్స్ టిఆర్‌ఎస్‌కు చెందిన నేతలవేనని టిటిడిపి వర్కింగ్ ప్రెసిండెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మియాపూర్ భూ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే డ్రగ్స్ వ్యవహారాన్ని వెలికి తీశారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఆదివారం నాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్ మాఫిలో ఉన్న పెద్దలను వదిలి చిన్న వాళ్లకే సిట్ నోటీసులు జారీ చేస్తోందని అన్నారు.

07/24/2017 - 01:26

హైదరాబాద్, జూలై 23: తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టిలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జాతీయ ఎస్‌సి కమిషన్ సభ్యుడు కె. రాములు తెలిపారు. ‘ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్‌సి, ఎస్‌టి ఎంప్లాయిస్’ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో రాములుకు సన్మానం జరిగింది.

07/24/2017 - 00:59

హైదరాబాద్, జూలై 23: సాగునీటి వనరుల సమగ్ర సమాచారాన్ని శాటిలైట్‌కు అనుసంధానం చేసి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి మట్టం, నీటి పంపిణీ, ఆయకట్టు పరిధిలోని పంటల పరిస్థితిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. అలాగే ఇప్పుడు కొనసాగుతున్న ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ, నాణ్యతాప్రమాణాలపై నిరంతరం నిఘా పెట్టాలని నిర్ణయించింది.

07/24/2017 - 00:57

హైదరాబాద్, జూలై 23: ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎం మహేందర్‌రెడ్డి అన్నారు. వాహనదారుల్లో రహదారి భద్రత, క్రమశిక్షణ అలవరచాలనే ఉద్దేశ్యంతో పెనాల్టీ పాయిం ట్స్ సిస్టంను తీసుకు వచ్చామని కమిషనర్ తెలిపారు.

07/24/2017 - 00:53

హైదరాబాద్, జూలై 23: తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్ కింద లక్షలాది ఎకరాల్లో ఆయకట్టు ఎడారిని తలపిస్తోంది. మరో 50రోజులు గడిచిన తర్వాత కాని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు ఆల్మట్టి నుంచి నీరు వచ్చే పరిస్థితి కనపడక పోవడంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. తెలంగాణలో జూరాల నుంచి ఆంధ్రాలో ప్రకాశం బ్యారేజి వరకు కృష్ణా బేసిన్‌లో నీటి చుక్క లేదు.

Pages