S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/31/2015 - 07:05

శ్రీకాకుళం, డిసెంబర్ 30: వచ్చే ఫిబ్రవరి 12, 13 తేదీల్లో శ్రీకాకుళంలో ఎన్టీవోల రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి అశోక్‌బాబు చెప్పారు. మహాసభలు జరగనున్న శ్రీకాకుళంలోని శివానీ కళాశాల మైదానాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

12/31/2015 - 05:48

విజయవాడ, డిసెంబర్ 30: ఇసుకను అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకుగాను వచ్చే ఫిబ్రవరి 1 నుంచి నూతన విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

12/31/2015 - 05:46

విజయవాడ, డిసెంబర్ 30: ఆంధ్రప్రదేశ్‌లో అపార వనరులు, అపరిమితమైన ల్యాండ్ బ్యాంక్, సమృద్ధిగా నీరు, నిరంతర విద్యుత్ అందుబాటులో వున్నాయని, కావాల్సినదంతా కేంద్రంనుంచి సహకారమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియాతో బుధవారం సాయంత్రం విజయవాడలోని తన కార్యాలయంలో సమావేశమైన ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ కుదేలైందని వివరించారు.

12/31/2015 - 05:45

రాజమండ్రి, డిసెంబర్ 30: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆదేశాలకు అనుగుణంగా జనవరి 1నుండి 15వరకు రాష్ట్రంలోని నగరపాలక సంస్థల పరిధిలో ప్రత్యేక స్వచ్ఛ భారత్ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ ప్రణాళికను సిద్ధంచేసింది. ఈ ప్రణాళికలో భాగంగా అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్ వంతెనలు, మెయిన్ రోడ్లను శుభ్రంచేసే కార్యక్రమాలపై కమిషనర్లు దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది.

12/31/2015 - 05:43

కడప, డిసెంబర్ 30: ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పేరుమోసిన నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్లను కడపజిల్లా పోలీసులు అరెస్ట్‌చేశారు. చైనాకు చెందిన లీమింగ్ హుయ్, చిన్‌పింగ్, జాంగ్‌క్వింగ్, హర్యానా రాష్ట్రం గుర్గావ్‌కు చెందిన అంజుదహియాలను కడప పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అరెస్టుచేసి బుధవారం కడపకు తీసుకొచ్చారు.

12/31/2015 - 05:34

హైదరాబాద్, డిసెంబర్ 30: విద్యుత్ చార్జీలు పెంచేందుకు అనుమతించాలని కోరుతూ ఆంధ్రలోని రెండు డిస్కాంలు ఒకట్రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు సమర్పించనున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది నవంబర్ నెలాఖరులోపలే వార్షిక రెవెన్యూ నివేదికను డిస్కాంలు ఏపిఇఆర్‌సికి అందించాల్సి ఉంటుంది.

12/31/2015 - 05:24

హైదరాబాద్, డిసెంబర్ 30: కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దిగిరాకుంటే జాతీయస్థాయిలో అన్ని కేంద్ర ప్రభుత్వ యూనియన్లతో కలిసి మార్చి మొదటివారంలో నిరవధిక సమ్మె చేస్తామని భారతీయ రైల్వే ఉద్యోగుల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎం రాఘవయ్య ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో రైల్వే యూనియన్లతో సంప్రదింపులు జరిపి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు.

12/31/2015 - 05:23

విజయవాడ, డిసెంబర్ 30: మూడోవిడత జన్మభూమిని విస్తృతంగా ప్రచారం చేయాలని, పార్టీ నేతలు, కార్యకర్తలు సహా ప్రతి ఒక్కరూ ఇందులో చురుగ్గా పాల్గొనాలని ముఖ్యమంత్రి, అధికార తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

12/30/2015 - 16:51

హైదరాబాద్ : ఎమ్మెల్సీగా గెలుపొందిన కోమటిరెడ్డి, దామోదర్ రెడ్డిలకు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ బెదిరింపు రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, ఇది గ్రేటర్ ఎన్నికల్లో రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ గెలుపు కాంగ్రెస్ శ్రేణుల్లో మనోస్థైర్యం నింపిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ పేర్కొన్నారు.

12/30/2015 - 14:30

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో 12మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. విజయరావు, రాహుల్‌దేవ్‌ శర్మ, విశాల్‌లను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

Pages