S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/27/2016 - 07:12

హైదరాబాద్, నవంబర్ 26: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల హైదరాబాద్ పర్యటన ముగించుకుని శనివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. విమానాశ్రయంలో ప్రధానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు, బిజెపి నాయకులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కెసిఆర్ ప్రధానమంత్రిని శాలువాతో సత్కరించి, వెండి వీణ, ఒక పుస్తకాన్ని బహూకరించారు.

11/27/2016 - 07:11

హైదరాబాద్, నవంబర్ 26: సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్నింగ్ వాక్ చేశారు. అరగంట సేపు మార్నింగ్ వాక్ చేసిన తర్వాత మోదీ అకాడమీలోని పరేడ్ మైదానంలో యోగా చేశారు. యోగా కార్యక్రమంలో పోలీసు డిజిపి, ఐజిపిలు పాల్గొన్నారు.

11/27/2016 - 07:10

హైదరాబాద్, నవంబర్ 26: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ శనివారం హైదరాబాద్ నగరాన్ని సందర్శించారు. శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకున్న ప్రధాని శనివారం పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పర్యటించగా, ఆయన సోదరుడు మాత్రం సామాన్య సందర్శకుడిలా పాతబస్తీలో ప్రత్యక్షమయ్యారు.

11/27/2016 - 05:23

ఏలూరు, నవంబర్ 26: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో బిజెపి, టిడిపి ప్రభుత్వాలు కట్టుబడి వున్నాయని, ప్రజలంతా బిజెపికి బాసటగా నిలిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తామని బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని, వారి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు.

11/27/2016 - 05:20

నిఘాకు మరింత పదునుపెట్టండి దేశం అంచుల్లో ఉగ్రవాద ముప్పు
వామపక్షవాదంతో ప్రగతికి ప్రమాదం సమూల నిర్మూలనకు ప్రణాళిక రచించాలి
బలగాలకు సాంకేతిక సామర్థ్యం పెంచాలి పోలీస్ శిక్షణలో మరింత ఒడుపు కావాలి
అప్పుడే శాంతి భద్రతలు పరిరక్షించగలం డిజిపిల సదస్సులో నరేంద్ర మోదీ పిలుపు
రోజంతా అకాడమీలో గడిపిన ప్రధాని సంస్కరణలు, సవాళ్లపై విస్తృత సమీక్ష

11/26/2016 - 07:14

హైదరాబాద్, నవంబర్ 25: చండీగఢ్ నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం సాయంత్రం శంషాబాద్ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.

11/26/2016 - 06:09

నల్లధనం నిర్మూలనకే పెద్ద నోట్ల రద్దు ఉగ్రవాదం, తీవ్రవాదంపై రాజీలేని పోరు
పోలీసు వ్యవస్థలో పారదర్శకత ఉండాలి టెక్నాలజీతో జాతివిద్రోహులపై ఉక్కుపాదం
డిజిపిల సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్‌సింగ్ పిలుపు

11/25/2016 - 07:45

హైదరాబాద్, నవంబర్ 24: కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి, డాక్టర్ జిగ్నేష్‌రెడ్డిల వివాహం గురువారం ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, పలువురు మంత్రులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, బిజెపి నేతలు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

11/25/2016 - 07:10

హైదరాబాద్, నవంబర్ 24: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేంద్రీయ పోలీస్ సంస్థల అధిపతుల 51వ వార్షిక సమావేశం శుక్రవారం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమిలో మూడు రోజులపాటు జరుగునున్న సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరుకానున్నారు.

11/25/2016 - 06:48

హిందూ ధర్మంపై దాడులకు అడ్డుకట్ట
పల్లెల్లోకి ధార్మిక సాహిత్యం
హిందూ స్ఫూర్తి కార్యక్రమాల నిర్వహణ
ఎజెండా వెల్లడించిన చినజీయర్, పరిపూర్ణానంద, సుబుధేంద్ర

Pages