S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/23/2016 - 03:56

భద్రాచలం, నవంబర్ 22: తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలే లక్ష్యంగా మంగళవారం ఉదయం ప్రెషర్‌బాంబును పేల్చారు. ఈ ఘటన మారాయిగూడెం-గొల్లపల్లి గ్రామాల మధ్య జరిగింది. సుక్మా జిల్లా లింగంపల్లిలోని 217 సిఆర్‌పిఎఫ్ బేస్‌క్యాంపునకు చెందిన జవాన్లు మారాయిగూడెం-గొల్లపల్లి గ్రామాల మధ్య రహదారి నిర్మాణానికి పహారా కాస్తున్నారు.

11/23/2016 - 02:02

హైదరాబాద్, నవంబర్ 22: పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆర్థిక వనరులకు జరిగిన నష్టం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధ్యయనానికి కేంద్ర బృందం బుధవారం రాష్ట్రానికి రానుంది. నోట్ల రద్దు వల్ల రాష్ట్రాలకు ఎదురైన సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు అధ్యయనం చేయడానికి కేంద్ర బృందాలను రాష్ట్రాలకు పంపాలని సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

11/23/2016 - 01:56

విజయవాడ, నవంబర్ 22: మైనింగ్ కోసం లీజుకు తీసుకున్న క్వారీలను వేరొకరికి బదిలీ చేయడాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మైనింగ్ బదిలీల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని భావించిన సిఎం, అనుబంధ పరిశ్రమలకు ఉన్న క్వారీలను మాత్రమే బదలాయించేందుకు అనుమతివ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 20 ఏళ్లుగా ఉన్న లీజు కాలాన్ని 30 ఏళ్లకు పెంచాలని సూచించారు.

11/23/2016 - 01:03

విజయవాడ, నవంబర్ 22: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో పచ్చదనం, సుందరీకరణ పనులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మహా నగరాన్ని అత్యంత ఆధునికంగా, సకల సౌకర్యాలతో పచ్చదనం, జలకళ (బ్లూ-గ్రీన్) ఉట్టిపడేలా అద్భుతంగా నిర్మించాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. అందులో భాగంగానే వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయం నిర్మించారు.

11/22/2016 - 05:43

రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి 80వ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఢిల్లీలోని ఆయన ఇంట్లో వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా పాల్వాయికి అభినందనలు తెలియజేస్తున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి

11/22/2016 - 04:11

హైదరాబాద్, నవంబర్ 21: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం వాయిదా వేయాలని రాష్ట్ర హైకోర్టు ఎపి ప్రభుత్వాన్ని సోమవారం నాడు ఆదేశించింది. అగ్రిగోల్డ్ మోసంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ అగ్రి గోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం దాఖలు చేసిన పిటీషన్‌ను జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ ఎస్ వి భట్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం నాడు విచారించింది.

11/22/2016 - 03:34

సీలేరు, నవంబర్ 21: మావోయిస్టు మిలీషియా సభ్యులతో పాటు 101 మంది మద్దతుదారులు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ ఎదుట సోమవారం లొంగిపోయారు. వీరికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని ఎస్పీ తెలిపారు.

11/22/2016 - 03:24

విజయవాడ, నవంబర్ 21: సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులు తమ బకాయిలను పాత 500, 1000 నోట్లతో చెల్లించేలా వెసులుబాటు కల్పించేందుకు రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమితి ప్రత్యేక సమావేశం తీర్మానించింది. రైతుల రుణాల రీషెడ్యూల్‌ను వచ్చే జూన్ వరకూ పొడిగించేలా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్‌బిఐని కోరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలో సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో తీర్మానించారు.

11/22/2016 - 03:23

గుంటూరు, నవంబర్ 21: రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపిన పత్తి కొను‘గోల్‌మాల్’ వ్యవహారంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌తోపాటు ఇద్దరు సంయుక్త సంచాలకులు, మరో 89మంది కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులపై చార్జిషీటు దాఖలైంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కమిషనర్ మల్లికార్జున నేతృత్వంలో అవినీతి ఉద్యోగులకు తాఖీదులు అందాయి.

11/22/2016 - 03:21

ఏలూరు, నవంబర్ 21: వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రాష్ట్రాన్ని సోలార్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సౌరశక్తికి సంబంధించి వచ్చే ఏప్రిల్ నాటికి దేశంలోనే రాష్ట్రం ఆగ్రస్ధానంలో నిలవడానికి అనువుగా ఏర్పాట్లు చేశామన్నారు. కాగా సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల మేళవింపు ద్వారా అధికంగా ప్రయోజనాలు సాధించవచ్చునని అంచనా వేస్తున్నామని, ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.

Pages