S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/21/2016 - 00:41

శ్రీకాళహస్తి, నవంబర్ 20: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ప్రధానార్చకుడు ఎస్‌ఎంకె బాబుగురుకుల్ (78) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతున్నారు. ఈనేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటిలేటర్‌పై ఉంచి ప్రత్యేక వాహనంలో శనివారం రాత్రి శ్రీకాళహస్తిలోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు.

11/20/2016 - 03:58

హైదరాబాద్, నవంబర్ 19: పెద్ద నోట్ల రద్దు రవాణా రంగానికి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ పరిసరాలతో సహా రెండు తెలుగురాష్ట్రాల్లో జాతీయ రహదారులపై ఎక్కడ బడితే అక్కడ భారీ సంఖ్యలో లారీలు, ట్రక్కులు నిలిచిపోయాయి. సరిపడా చెల్లుబాటయ్యే నోట్లు లేకపోవడం, చిల్లర నోట్లకొరత వల్ల రవాణా రంగం స్తంభించింది.

11/20/2016 - 03:57

విశాఖపట్నం, నవంబర్ 19: అగ్రరాజ్యాలు ఉమ్మడి సైనిక విన్యాసాల పేరిట ఆయుధ వ్యాపారానికి అర్రులు చాస్తున్నాయని ఇంటర్నేషనల్ ఫోరమ్ ఆన్ గ్లోబలైజేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కుహాన్ పాయక్ ఆందోళన వ్యక్తం చేశారు.

11/20/2016 - 03:57

విజయవాడ, నవంబర్ 19: ప్రముఖ విద్యావేత్త, బహుగ్రంథ రచయిత కొమరగిరి యోగానంద లక్ష్మినరసింహారావు (93) శనివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. పలు విద్యాసంస్థల్లో ప్రిన్సిపాల్‌గా పని చేసిన నరసింహారావు ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారంటూ శ్లాఘించారు.

11/20/2016 - 04:03

హైదరాబాద్, నవంబర్ 19: జలవనరుల నిర్వహణలో డాక్టర్ సాహెబ్ రావ్ సోన్ కాంబ్లే అందించిన వినూత్న సేవలకు గాను అసోసియేషన్ ఆఫ్ హైడ్రాలజిస్ట్ ఆఫ్ ఇండియా ఆయనకు ఎహెచ్ ఫణికిశోర్ యంగ్ సైంటిస్టు అవార్డును ప్రదానం చేసింది. జలవనరులు- జల విధానాలపై ఎహెచ్‌ఐ వార్షిక సమావేశంలో జరిగిన చర్చాగోష్ఠి సందర్భంగా ఆయన పరిశోధనల ఫలితాలను అత్యుత్తమ సమర్పణగా పరిగణించి న్యాయనిర్ణేతలు ఆ అవార్డుకు సోన్ కాంబ్లేను ఎంపిక చేశారు.

11/20/2016 - 03:54

షాద్‌నగర్, నవంబర్ 19: సాంకేతిక లోపం కారణంగా బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం రాత్రి ఎనిమిది గంటలకు షాద్‌నగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని చటాన్‌పల్లి రైల్వే గేటు వద్ద సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. కాచిగూడ నుండి బెంగళూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోవడంతో అటు ప్రయాణికులు ఇటు వాహన దారులు అనేక అవస్థలకు గురయ్యారు.

11/20/2016 - 04:22

సింహాచలం, నవంబర్ 19: తెలుగు రాష్ట్రాలు రెండూ సుభిక్షంగా ఉండాలని శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని కోరుకున్నట్టు ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఇఎల్‌ఎస్ నరసింహన్ చెప్పారు. శనివారం ఆయన సింహాచలేశుని దర్శించుకున్న అనంతరం విలేఖరులతో మాట్లాడారు. శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలసిన ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదని ఆయన అన్నారు.

11/20/2016 - 02:32

ఖమ్మం, నవంబర్ 19: ప్రజల ఇబ్బందులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కమీషన్ పద్ధతిలో పాత నోట్లకు కొత్త నోట్లు ఇచ్చేలా కొత్త తరహా వ్యాపారం జోరుగా సాగుతోంది. తమవద్ద కొత్తనోట్లు ఉన్నాయని, పాతనోట్ల స్థానంలో కమీషన్ పద్ధతిలో చెల్లుబాటు అయ్యే నోట్లు ఇస్తామంటూ, భారీ మొత్తంలో అయితే ఇవ్వాల్సిన మొత్తానికి సరిపోను భూములను రిజిస్ట్రేషన్ చేయిస్తామంటూ దళారులు చెప్పుకొస్తున్నారు.

11/20/2016 - 02:31

హైదరాబాద్, నవంబర్ 19: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రముఖ్, 93 ఏళ్ల వృద్ధ సైద్ధాంతికవేత్త కె సూర్యనారాయణ శుక్రవారం అర్ధ రాత్రి బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం శనివారం ఉదయం బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో ఉంచారు. సాయంత్రం చామరాజపేట శ్మశానవాటికలో అంతిమసంస్కారం నిర్వహించారు. సూర్యనారాయణను అందరూ సురుజీగా పిలుస్తారు.

11/20/2016 - 02:25

పెనుకొండ, నవంబర్ 19: న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు పై కోర్టులు తప్పుపట్టే విధంగా ఉండరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. శనివారం జరిగిన అనంతపురం జిల్లా పెనుకొండలోని మున్సిఫ్ కోర్టు 144వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో న్యాయవాదుల పని ఎంతో గౌరవంగా ఉండేదన్నారు. నేటి పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు.

Pages