S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/22/2016 - 00:56

హైదరాబాద్, నవంబర్ 21: రైతుల రుణ బకాయిలు మాఫీ కాకపోవడం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని సంకల్పించింది.

11/22/2016 - 00:55

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఒక తుపాకీ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం జప్తు చేసిన తుపాకుల నుండి యుఎస్ కార్బైన్ కాల్.30 విన్‌చెస్టర్ (తయారీ)ను మార్కెట్ ధరకే విక్రయించేందుకు హోం (ఆర్మ్స్) శాఖ అంగీకరించింది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర పేరుతో జీఓ (ఆర్‌టి నెంబర్ 1386, తేదీ 21-11-2016) జారీ అయింది.

11/21/2016 - 03:39

హైదరాబాద్, నవంబర్ 20: దక్షిణ మధ్య రైల్వేకు ‘రైల్ వికాస్ శిబిర్’ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఆదివారం న్యూఢిల్లీలోని సూరజ్‌కుండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా అందుకున్నారు.

11/21/2016 - 03:36

హైదరాబాద్, నవంబర్ 20: కేంద్రంలో చక్రం తిప్పిన నాయకుడిగా చంద్రబాబుకు పేరు ఉంది. కెసిఆర్ తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నేత. కానీ నోట్ల రద్దు వ్యహారం తరువాత తలెత్తిన సంక్షోభంపై ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ సిఎం కెసిఆర్‌ను పిలిపించుకుని మాట్లాడడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

11/21/2016 - 03:52

హైదరాబాద్, నవంబర్ 20: కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్ల ప్రభావం మెడికల్ టూరిజంపై పడింది. హైదరాబాద్‌కు పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల నుంచి పెద్ద ఎత్తున రోగులు ఇక్కడ ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు వస్తుంటారు. భాషాపరమైన సమస్య లేకపోవడం, తక్కువ ఖర్చులో వైద్యం, వసతి సదుపాయాలు, వైద్య నిపుణులు ఉండడం తదితరకారణాల వల్ల ఇక్కడకు విదేశాల నుంచి ఎక్కువ మంది రోగులు వస్తుంటారు.

11/21/2016 - 02:05

హైదరాబాద్, నవంబర్ 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం కుడికాల్వ గట్టుపై ఐదు మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్‌ను సోమవారం ప్రారంభిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామం వద్ద ఈ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారు. ఈ ప్లాంట్ ద్వారా సాలీనా 8.06 ఎంయు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.37.58 కోట్లు ఖర్చయింది.

11/21/2016 - 02:04

విజయవాడ, నవంబర్ 20: పెద్ద నోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న చందంగా ఏదో రీతిలో నల్లధనాన్ని అతి సామాన్యుల ద్వారా చెలామణిలోకి తీసుకురావటానికి నల్ల కుబేరులు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో హడలెత్తిపోతున్న కేంద్ర ప్రభుత్వం రోజుకో విధమైన ఆంక్షలు తీసుకువస్తుండటంతో బ్యాంకు ఉద్యోగులు తల్లడిల్లిపోతున్నారు.

11/21/2016 - 00:56

హైదరాబాద్, నవంబర్ 20: అత్యాధునిక ఆయుధాలతో నిత్యం ప్రచ్ఛన్నయుద్ధం చేస్తూ, భారత్‌పై దుష్ప్రచారం చేస్తున్న పాకిస్థాన్‌తో చర్చలు కానీ, సయోధ్య కాని ఎంత మాత్రం అవసరం లేదని, పాక్ పని అయిపోయిందని ‘సోషల్‌కాజ్’ సంస్థ ఆదివారం ఉదయం నిర్వహించిన సదస్సులో పలువురు వక్తలు పేర్కొన్నారు.

11/21/2016 - 00:42

కాకినాడ, నవంబర్ 20: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పాత నోట్ల మార్పిడిపై బేరసారాలు పతాకస్థాయికి చేరాయి. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే తంతు కనిపిస్తోంది. ప్రస్తుతం 30 శాతం కమీషన్‌పై పాత నోట్ల మార్పిడి జరుగుతున్నట్టు తెలుస్తోంది.

11/21/2016 - 00:41

విజయనగరం, నవంబర్ 20: మహాకవి గురజాడ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త, సహస్రావధాని గరికిపాటి నరసింహరావుకు ప్రదానం చేయనున్నారు. ఇక్కడి గురజాడ గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గురజాడ సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ మాట్లాడారు. ఈ నెల 30న గురజాడ వర్ధంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 2000 సంవత్సరం నుంచి ఈ పురస్కారాలు అందజేస్తున్నారు.

Pages