S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/28/2016 - 02:09

హైదరాబాద్, అక్టోబర్ 27: తమిళనాడు తరహాలో వెనుకబడిన తరగతులకు రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచడానికి అధ్యయనం చేయాల్సిందిగా బిసి కమిషన్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. కమిషన్ చేసే సిఫారసుల మేరకు రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాలంటూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రాన్ని కోరుదామని ముఖ్యమంత్రి సూచించారు.

10/28/2016 - 02:07

హైదరాబాద్, అక్టోబర్ 27:కొత్త సచివాలయ భవనాల నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం అక్కడ నడుస్తున్న కార్యాలయాలను వేరే చోటకు తరలించాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం పునరాలోచన పడింది. సచివాలయంలో ఏపి భవనాలను తెలంగాణకు అప్పగించే పక్షంలో తమ కార్యాలయాలను తాత్కాలికంగా వాటిలోకి మార్చి, ఆ తరువాతే కూల్చివేతలు చేపట్టడం ఉత్తమమని ఇంజనీరింగ్ నిపుణులు తాజాగా ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు తెలిసింది.

10/28/2016 - 02:05

హైదరాబాద్, అక్టోబర్ 27: ఉద్యోగ భద్రత, వేతనాల పెంపును కోరుతూ కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న హోంగార్డులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. గురువారం తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నించారు. ఇందిరాపార్కు నుంచి భారీ ర్యాలీగా వచ్చిన హోంగార్డులు ఒక్కసారిగా సచివాలయంలోకి దూసుకెళ్ళేందుకు యత్నించారు. ఈ హఠాత్పరిణామాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

10/28/2016 - 01:52

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా ప్రభుత్వ విధానాల రూపకల్పనకు తోడ్పడాలని ప్రభుత్వ కార్యదర్శులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయం, ఇంధనం, రవాణా సహా పని కీలక సెక్టార్ల అభివృద్ధికి తగిన సూచనలు చేసేందుకు పది బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సందర్భంగా మోదీ మాట్లాడారు.

10/28/2016 - 01:50

గుంటూరు, అక్టోబర్ 27: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో మరో అంకానికి తెరలేచింది.. సువిశాలమైన 950 ఎకరాల స్థలంలో శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణానికి నేడు అంకురార్పణ జరగనుంది.

10/28/2016 - 01:48

ఎన్‌కౌంటర్ తరువాత మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే పార్టీకి అందుబాటులో లేరు. అందువలన ఏపి ప్రభుత్వమే ఆయనను అదుపులోకి తీసుకుందని భావిస్తున్నాం.
-వరవరరావు, ‘విరసం’ నేత
మూల్యం తప్పదు!
పోలీస్ కస్టడీలో ఉన్న ఆర్కేని వదలకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. ఆయనను బేషరతుగా విడుదల చేయాలి.
-హరగోపాల్, పౌరహక్కుల నేత
మావద్ద లేరు

10/28/2016 - 01:45

విశాఖపట్నం, అక్టోబర్ 27: కాకులు దూరని కారడవిలో ఖాకీల దండయాత్ర కొనసాగుతోంది. సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేతలు తప్పించుకున్నారని భావిస్తున్న పోలీసులు వారి కోసం వేట మొదలుపెట్టారు. ఒక్కరు కాదు. ఇద్దరు కాదు ఏకంగా వెయ్యి మంది గ్రేహౌండ్స్, సిఆర్‌పిఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు ఏఓబిని జల్లెడ పడుతున్నారు.

10/28/2016 - 02:14

విజయవాడ, అక్టోబర్ 27: భారతదేశంలోనే అంబేద్కర్, జగ్జీవన్ రాం ఆలోచనావిధానాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రభుత్వ దళిత, గిరిజన సంక్షేమ బాటలో భాగంగా కృష్ణాజిల్లా స్థాయిలో జరిగిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

10/28/2016 - 01:39

విజయవాడ, అక్టోబర్ 27: ‘పనిలో మీ వేగం మా వేగానికి సరిపోయింది. ఇంత వేగంగా స్పందించి, పనిచేసే మీలాంటి నాయకుణ్ణి ఎక్కడా చూడలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం’ అని రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సులేట్ జనరల్ క్యుంగ్సూ కిమ్ ప్రశంసించారు. గురువారం ఆయన దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తలతో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు.

10/28/2016 - 01:35

హైదరాబాద్, అక్టోబర్ 27: ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసేందుకు హైకోర్టు ఏపి ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.

Pages