S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/27/2016 - 05:22

హైదరాబాద్, అక్టోబర్ 26: అమరావతి రాజధాని నిర్మాణానికి స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించాలని నిర్ణయంపై ఏపి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. స్విస్‌చాలెంజ్ కింద కాంపిటీటివ్ బిడ్స్ నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఏపి ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు తెలిపింది. అమరావతి రాజధాని నిర్మాణంపై తాజా నోటిఫికేషన్ జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది.

10/27/2016 - 05:18

హైదరాబాద్, అక్టోబర్ 26: రాష్ట్ర విభజన జరిగి రెండున్నర సంవత్సరాలు కావస్తుండటంతో ఇక ఘర్షణలకు స్వస్తి చెప్పి సామరస్యంతో మెలగాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. కారణాలు ఏవైనా ఘర్షణ పడితే వ్యక్తిగతంగానూ, పరిపాలనాపరంగానూ ఇబ్బందులు ఏర్పడతాయన్న ఆలోచనకు ఇద్దరూ వచ్చినట్టు తెలిసింది.

10/26/2016 - 07:42

హైదరాబాద్, అక్టోబర్ 25: పదవ తరగతి పరీక్షలు, ఇతర పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన వారిని ఎందుకు ప్రాసిక్యూషన్ చేయలేదని హైకోర్టు రెండు రాష్ట్రప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ప్రశ్నించింది. పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలపై కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

10/26/2016 - 07:42

హైదరాబాద్, అక్టోబర్ 25: రైతుల నుంచి ప్రీమియం వసూలు చేసినా నష్టపరిహారం ఎందుకు చెల్లించలేదంటూ హైకోర్టు మంగళవారం ఆంధ్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, బీమా కంపెనీలకు నోటీసులు జారీ చేస్తూ అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం జారీ చేసింది. కడప జిల్లా వేములపల్లి మండల పరిషత్ అధ్యక్షుడు రవికుమార్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

10/26/2016 - 07:41

హైదరాబాద్, అక్టోబర్ 25: అమెరికా రాయబార కార్యాలయాలతో పాటు భారతదేశంలోని కాన్సులేట్ కార్యాలయాల వెబ్ పోర్టల్ చిరునామాను మంగళవారం నాడు మార్చింది. ఈ మేరకు కాన్సులేట్ సలహాదారు మహ్మద్ అబ్దుల్ బాసిత్ ఒక ప్రకటన చేశారు. తాజా నిర్ణయంతో చెన్నై, కొల్‌కతా, హైదరాబాద్, ముంబై కాన్సులేట్ వెబ్ చిరునామాలు మారుతాయి. ఇన్ డాట్ యుఎస్ ఎంబసీ డాట్ జీవోవీ పేరుతో పోర్టల్ వెబ్ చిరునామాను ఏర్పాటు చేశారు.

10/26/2016 - 07:07

కర్నూలు, అక్టోబర్ 25: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వానికి వేసవి కాల సమావేశాలవరకూ గడువు ఇస్తున్నామని, ఆ తరువాత కూడా హోదా ఇస్తున్నట్లు ప్రకటన చేయకపోతే తమ పార్టీ పార్లమెంటుసభ్యులు రాజీనామా చేస్తారని వైకాపా అధినేత జగన్ హెచ్చరించారు. కర్నూలు నగరంలో మంగళవారం వైకాపా ఆధ్వర్యంలో యువభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు.

10/26/2016 - 05:38

హైదరాబాద్/ బేగంపేట, అక్టోబర్ 25: షిర్డీసాయి దేవుడు కాదు..అతనొక ముస్లిం అని, ముస్లింలకు సాయి పూజలు నిలిచిపోవాలి, హిందువులు ఎవ్వరూ సాయిని పూజించవద్దని, సాయి మందిరం శ్మశాన వాటిక, అక్కడికి హిందువులు ఎవ్వరూ వెళ్లొద్దని, సాయిబాబ భూతమని జగద్గురు శంకరాచార్య స్వరూపానంద సరస్వతి స్వామి మరోసారి సంచన వ్యాఖ్యలు చేశారు.

10/26/2016 - 05:31

హైదరాబాద్, అక్టోబర్ 25: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ నెల 19న ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత కార్యకారిణి సమావేశాలు మంగళవారంతో ముగిసాయి. 22వ తేదీ నుంచే కీలకమైన భేటీ జరిగింది.

10/26/2016 - 03:31

విశాఖపట్నం, పాడేరు, అక్టోబర్ 25: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేవలం ఇద్దరు నేతలే హతమైనట్టు స్పష్టమవుతోంది. ఇందులో ఆర్‌కె, గాజర్ల రవి తప్పించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. పోలీసులు మాత్రం ఎన్‌కౌంటర్ జరిగిన కొద్ది గంటలకే మావోయిస్ట్ కీలక నేతలు మరణించినట్టు మీడియాకు సమాచారం అందించారు. ఇందులో చలపతి, అతని భార్య, దయతోపాటు మరికొంతమంది పేర్లు ఉన్నాయి.

10/26/2016 - 03:26

విశాఖపట్నం, సీలేరు, అక్టోబర్ 25: విశాఖ మన్యంలో తుపాకుల మోత కొనసాగుతోంది. సోమవారం బూసిపుట్టు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో 24 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలిస్తుండగా మంగళవారం బెజ్జంగి దగ్గర మావోయిస్ట్‌లు ఎదురుపడ్డారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్ట్‌లు మరణించారు.

Pages