S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/21/2016 - 02:14

తిరుమల, సెప్టెంబర్ 20: రాష్ట్రంలోని 500 ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మంగళవారం తెలిపారు. 5 లక్షల రూపాయలతో ఒక్కో ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.

09/21/2016 - 02:11

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ‘టేబుల్‌పై రివాల్వర్ పెట్టి...మల్లన్న సాగర్ రైతుల వద్ద నుంచి బలవంతంగా భూముల రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు..’ అని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ తరపున ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధుల శిక్షణాతరగతుల ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ మల్లన్న సాగర్ రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు.

09/21/2016 - 02:09

హైదరాబాద్, సెప్టెంబర్ 20: తెలంగాణలో నిర్వహించబోయే గ్రూప్-2 స్థాయి పోస్టుల ఎంపిక పరీక్ష షెడ్యూలులో పబ్లిక్ సర్వీసు కమిషన్ స్వల్ప మార్పులు చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్నా, అదే రోజు ఇండియన్ ఫారెస్టు సర్వీసు ఎంపిక పరీక్షను యుపిఎస్‌సి నిర్వహిస్తుండటంతో షెడ్యూలులో మార్పులు చేసినట్టు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు.

09/21/2016 - 02:08

హైదరాబాద్, సెప్టెంబర్ 20: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం యుజి, పిజి , ఎంఫిల్, పిహెచ్‌డి కోర్సులకు నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్, వరంగల్, రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడి ప్రాంగణాల్లో నిర్వహించే ఈ కోర్సులకు ఈ నెల 20వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించబోతోంది. దరఖాస్తులను వచ్చే నెల 3వ తేదీలోగా సమర్పించాలి.

09/21/2016 - 02:08

హైదరాబాద్, సెప్టెంబర్ 20:మిషన్ భగీరథ పథకానికి రుణాలు ఇవ్వడానికి పలు బ్యాంకులు ముందుకు వచ్చాయి. పంచాయితీరాజ్ స్పెషల్ సిఎస్ మిషన్ భగీరథ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్పీసింగ్‌ను బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు వేరువేరుగా మంగళవారం కలిశారు. మిషన్ భగీరథకు 2270 కోట్ల రూపాయల రుణం ఇవ్వనున్నట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ జోనల్ మేనేజర్ విశ్వనాథ్ తెలిపారు.

09/20/2016 - 07:45

హైదరాబాద్, సెప్టెంబర్ 19: క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడేందుకు కార్యకర్తలు సమాయత్తం కావాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు. పార్టీ తరఫున ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది.

09/20/2016 - 07:36

హైదరాబాద్, సెప్టెంబర్ 19: మిషన్ భగీరథ పథకం అమలుకు రెండువేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు యూకో బ్యాంక్ అంగీకరించింది. హైదరాబాద్‌లోని ఆర్‌డబ్ల్యుయస్ ప్రధాన కార్యాలయంలో ఇఎన్‌సి సురేందర్‌రెడ్డిని యూకో బ్యాంకు హైదరాబాద్ రీజినల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ వెంకటేశ్ కలిసి రెండువేల కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి అంగీకరించారు.

09/20/2016 - 03:32

హైదరాబాద్, సెప్టెంబర్ 19: రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి 21న ఢిల్లీలో నిర్వహిస్తున్న అపెక్స్ కౌన్సిల్ భేటీకి హాజరుకావాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కోరింది. అపెక్స్ కౌన్సిల్ చర్చించే అంశాల అజెండాను రెండు రాష్ట్రాలకు పంపింది.

09/20/2016 - 03:34

భద్రాచలం, సెప్టెంబర్ 19: ఖమ్మం జిల్లాలోని దండకారణ్యం ముఖద్వారం దుమ్ముగూడెం మండలం శివారులో చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మరో సిఆర్‌పిఎఫ్ బెటాలియన్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం శాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే ఈ బెటాలియన్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అనువైన స్థలానే్వషణలో భాగంగా పరిశీలనకు సిఆర్‌పిఎఫ్ ఐజీ సదానంద ధాతే సోమవారం భద్రాచలం మన్యంలో పర్యటించారు.

09/20/2016 - 03:20

హైదరాబాద్, సెప్టెంబర్ 19: నైరుతీ బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడ్డ ఉపరితల తుపాను ద్రోణి మూలంగా మంగళవారం ఏపీలోని కోస్తా జిల్లాలతోపాటు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. ఐఎండి శాస్తవ్రేత్త చరణ్‌సింగ్ పేరిట సోమవారం బులెటిన్ జారీ అయింది.

Pages