S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/15/2016 - 00:28

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ప్రపంచ ప్రేమికుల దినాన్ని జరుపుకుంటున్న పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదివారం నగరవ్యాప్తంగా వాలెంటైన్స్ డే జరుపుకునేందుకు యువతీయువకులు ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలో విదేశీ సంస్కృతిని ప్రదర్శించొద్దంటూ, బజరంగ్‌దళ్ కార్యకర్తలు సికిందరాబాద్‌లో ప్రేమికుల దినానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.

02/15/2016 - 00:28

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురంలో ఇంధన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తక్షణమే అన్ని చర్యలు తీసుకుంటామని ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్ (టెరి) కొత్త డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన అజయ్ మాథుర్ అన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన రాష్ట్ర ఇంధన కార్యదర్శి అజయ్ జైన్‌తో మాట్లాడారు.

02/15/2016 - 00:27

విశాఖపట్నం, ఫిబ్రవరి 14: విద్యార్థుల్లో మానవీయ విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ పిలునిచ్చారు. సత్యసాయి విద్యా సంస్థల అయిదో జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమం విశాఖలోని గీతం విశ్వవిద్యాలయం ఆవరణలో ఆదివారం జరిగింది.

02/15/2016 - 00:27

తిరుమల, ఫిబ్రవరి 14: సప్తగిరీశుడైన శ్రీ వేంకటేశ్వరుడి ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి తిరుమలలోని చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. 15 గంటల్లో స్వామివారు 7 వాహనాలపై విహరించారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన ఈ వేడుకలు వరుసగా చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై సాగి చివరిగా చంద్రప్రభ వాహనంతో ముగిశాయి.

02/15/2016 - 00:26

శ్రీకాకుళం, ఫిబ్రవరి 14: అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. వేడుకలను విశాఖపట్నం శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి ప్రారంభించారు. మూలవిరాట్‌కు స్వరూపానందేంద్ర స్వామి మహాక్షీరాభిషేకం చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలాది భక్తులు తరలివచ్చారు.

02/15/2016 - 00:17

మేడారం జాతర ముందే మొదలైపోయంది. సమ్మక్క-సారలమ్మ తల్లుల రాకకుముందే భక్తులు దండిగా తరలివస్తున్నారు. సెలవు దినమైన ఆదివారం ఒక్కరోజే ఐదు
లక్షలకు మించి భక్తులు సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చినట్టు అంచనా.

02/15/2016 - 00:16

హైదరాబాద్, ఫిబ్రవరి 14: మూడురోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకున్న సిఎం కెసిఆర్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, మంత్రి పియూష్, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో వేర్వేరుగా సమావేశమైన సంగతి తెలిసిందే.

02/15/2016 - 00:16

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఎప్పుడెప్పుడా అని పార్టీ నేతలు ఎదురు చూస్తోన్న పదవుల పందేరం మళ్లీ వాయిదా పడినట్టేనని తెరాస వర్గాల సమాచారం. వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలతోపాటు కొన్ని మున్సిపాల్టీలకు జరుగనున్న ఎన్నికలకు నెలాఖరున నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే శాసనసభ బడ్జెట్ సమావేశాలు వచ్చే మార్చి మొదటివారంలో ప్రారంభంకానున్నాయి.

02/15/2016 - 00:14

విశాఖ వేదికగా జరిగిన మూడో టి-20 మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. తిలకరత్నే దిల్షాన్ వికెట్ కుప్పకూల్చిన బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ఆనందాన్ని పంచుకుంటున్న భారత ఆటగాళ్లు.

02/15/2016 - 00:12

హైదరాబాద్, ఫిబ్రవరి 14 : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం, ఎపి బ్రాహ్మణ సహకార పరపతి సొసైటీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఈ సంఘం చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. బ్రాహ్మణ సంక్షేమ సంఘంతో పాటు ఎపి ఎండోమెంట్స్ అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ ఫండ్ ట్రస్ట్‌కు కూడా ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

Pages