S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/24/2015 - 23:19

శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. రాజాం, ఎచ్చెర్ల, రణస్థలం, తదితర ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో నాలుగు సెకన్ల పాటు భూమి కంపించింది.

12/24/2015 - 23:18

* కుటుంబ కలహాలతో మేనమామ ఘాతుకం
విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక దారుణహత్యకు గురయింది. దేవరాపల్లికి చెందిన ఏడేళ్ల బాలిక వేపాడ దివ్య రెండురోజుల క్రితం అపహరణకు గురయింది. గురువారం బాలిక మృతదేహం ఊరికి దూరంగా క్వారీలో బయటపడింది. బాలిక గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. కుటుంబ కలహాలతో బాలిక మేనమామ గుణశేఖర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడయింది.

12/24/2015 - 23:18

* 2018 నాటికి పోలవరం పూర్తి
* జల వనరులశాఖ మంత్రి దేవినేని

12/24/2015 - 23:18

* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ: అసెంబ్లీలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. స్థానిక విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలపై జనవరి మొదటి వారం నుండి ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.

12/24/2015 - 23:17

* విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్
ప్రత్తిపాడు: సనాతనధర్మ వికాసానికి ప్రతిఒక్కరూ పాటుపడాలని విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ విజ్ఞప్తి చేశారు. దత్తజయంతిని పురస్కరించుకుని భక్తులకు ఆయన సందేశమిచ్చారు.

12/24/2015 - 23:17

గుంటూరు: ఆర్టీసీ బస్సుల్లో తాజాగా ఏర్పాటు చేసిన సమాచార వ్యవస్థ భారాన్ని సంస్థ యాజమాన్యం ప్రయాణికులపై వేయాలని నిర్ణయించింది. ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, ఎసి బస్సుల్లో ప్రయాణించే వారిపై రూపాయి అదనంగా వేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.

12/24/2015 - 23:17

గుంటూరు: రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు స్థలాల కేటాయింపుపై అయోమయం నెలకొంది. ఎక్కడిస్తారు... ఏమేరకిస్తారన్న దానిపై ఇంతవరకు స్పష్టత లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

12/24/2015 - 23:16

*అయిభీమవరంలో వేద పాఠశాలకు ప్రారంభోత్సవం
రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తున్నారు. ఆకివీడు మండలం అయిభీమవరం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్మించిన వేద పాఠశాలను రాష్టప్రతి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారు.

12/24/2015 - 23:16

*ఐదో రోజూ వైభవంగా అతిరుద్ర మహాయజ్ఞం
తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామ భీమేశ్వరునికి గురువారం మహా కుంభాభిషేకం నిర్వహించారు. దేశంలోని వివిధ నదుల నుండి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. ఇక గ్రామంలో నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయజ్ఞం ఐదో రోజూ వైభవంగా సాగింది. శుక్రవారం పూర్ణాహుతితో యజ్ఞం ముగియనుంది.

12/24/2015 - 23:16

*ఇనుప రాడ్డుతో దాడి *ముగ్గురు మృతి
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ గ్రామంలో గురువారం ఒక ఉన్మాది ఇనుప రాడ్డుతో వీరంగం వేశాడు. ముందుగా తన సోదరుని భార్యను రాడ్డుతో కొట్టిచంపిన అనంతరం అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని, మరో మహిళపై సైతం రాడ్డుతో దాడిచేశాడు. ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మహిళ మృతిచెందింది. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు.

Pages