S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/24/2015 - 23:15

తిరుమల: ట్రయల్ రన్ విజయవంతం, ఏర్పాట్లపై అధికారుల సమీక్ష జరిపారు.

12/24/2015 - 23:15

కర్నూలు: కర్నూలు కలెక్టర్ విజయమోహన్ బదిలీపై జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీల్లో చర్చ జోరందుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు సహా అంతా కలెక్టర్ ఎపుడు బదిలీ అవుతారంటూ ప్రశ్నించుకుంటున్నారు. 2014 జూలై చివరి వారంలో జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన విజయమోహన్ వ్యవహార శైలిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

12/24/2015 - 06:55

హైదరాబాద్, డిసెంబర్ 23: రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బలహీనవర్గాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు బిల్లును తిరస్కరించాలని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, ఎపి కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య గవర్నర్ నరసింహన్‌ను కోరారు.

12/24/2015 - 06:55

హైదరాబాద్, డిసెంబర్ 23: అమెరికాలో భారతీయ విద్యార్ధులు చదువుతున్న ఏ విశ్వవిద్యాలయం బ్లాక్‌లిస్టు కాలేదని, ఇమిగ్రేషన్ సమస్యలతోనే భారతీయ విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని అమెరికాకు చెందిన పలు వర్శిటీలు ప్రకటించాయి. సిలికాన్ వ్యాలీ యూనివర్శిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్శిటీలు సైతం బ్లాక్ లిస్టును ఖండించాయి.

12/24/2015 - 06:54

గుంటూరు, డిసెంబర్ 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల పనితీరు రెడ్‌లైట్ ఏరియాను తలపిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఆరోపించారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదన్నారు. శాసనసభ్యురాలు రోజాపై సంవత్సరకాలం నిషేధం విధించడం బాధాకరమన్నారు.

12/24/2015 - 06:54

గుంటూరు, డిసెంబర్ 23: విద్య నేర్పించటం, వైద్యం అందించటం, పేదలను ఆదుకోవటం లాంటి సేవా కార్యక్రమాల్లో క్రిస్టియన్లు ఎప్పుడూ ముందుంటారని, వారు కలిసివస్తే పేదరిక నిర్మూలన కోసం పనిచేసేందుకు ప్రభుత్వం ముందుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా అడవితక్కెళ్లపాడులో బుధవారం క్రిస్మస్ వేడుకలను ప్రారంభించిన ఆయన 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రిస్టియన్ భవనానికి శంకుస్థాపన చేశారు.

12/24/2015 - 06:53

తిరుమల, డిసెంబర్ 23: వైకుంఠ ఏకాదశి పర్వదినాన ప్రోటోకాల్ విఐపిలకు సామాన్యులకు టిటిడి కల్పించిన వసతి దర్శన ఏర్పాట్ల వివరాలపై శాసనమండలికి పూర్తి స్థాయిలో వివరాలు తెలపాలని టిటిడికి బుధవారం శ్రీముఖాలు అందాయి. ఈనెల 21న వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారిని దర్శించుకోడానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి 20న తిరుమలకు వచ్చారు.

12/24/2015 - 06:52

హైదరాబాద్, డిసెంబర్ 23: అసెంబ్లీలో వైకాపా వ్యవహరించిన తీరు రాజ్యాంగ విలువలకు భంగం కలిగించేలా ఉందని టిడిపి నేత డొక్కా మాణిక్యవర ప్రసాదరావు ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన బుధవారం పాత్రికేయులతో మాట్లాడుతూ అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌కు అడుగడుగునా ప్రతిపక్షం అడ్డుతగలడం చాలా బాధాకరమని అన్నారు.

12/24/2015 - 06:35

నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు వద్ద ఆటో బోల్తాపడి నలుగురు మృతి చెందగా, అయదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో గ్యాస్ సిలెండర్ లోడుతో వస్తున్న లారీ, కూరగాయల ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

12/24/2015 - 06:34

రామచంద్రపురం, డిసెంబర్ 23: తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామలో అతిరుద్ర మహాయజ్ఞం నాలుగో రోజైన బుధవారం వైభవంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం సంకల్పం, నిత్యపారాయణ, ఏకాదశ రుద్రాభిషేకాలు, సూర్య నమస్కారాలు నిర్వహించారు. గురువందనం, వేద పారాయణం, గురు ప్రార్థన, మహన్యాసం, రుద్రాభిషేకం తదితరాలను రుత్విక్కులు నిర్వహించారు. సాయంత్రం లక్ష బిల్వార్చన నిర్వహించారు.

Pages