S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/02/2018 - 03:46

తిరుపతి, జూన్ 1: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాలో మొత్తం 49,060 టికెట్లను శుక్రవారం ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టీటీడీ ఈవో ఏ కే సింఘాల్ లెలిపారు. ఆన్‌లైన్ డిప్ విధానంలో 8,235 సేవాటికెట్లు విడుదల చేశామని ఇందులో సుప్రభాతం 6,805, తోమాల 80, అర్చన 80, అష్టదళ పాదపద్మారాధన 120, నిజపాద దర్శనం 1,150 టికెట్లు ఉన్నాయని తెలిపారు.

06/02/2018 - 03:02

హైదరాబాద్, జూన్ 1: తెలంగాణ పబ్లిక్ సర్వీసుకమిషన్ రిక్రూట్‌మెంట్‌ల వేగాన్ని పెంచనుంది. రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ చేసేందుకు భారీ ఏర్పాట్లే చేస్తోంది. ఇంత వరకూ సర్వీసు కమిషన్ 33,751 పోస్టులను భర్తీ చేయగా, రానున్న రోజుల్లో మరో 4118 పోస్టులకు ప్రకటనలు జారీ చేయనుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శనివారం నాడు 2786 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వనుంది.

06/02/2018 - 03:00

హైదరాబాద్, జూన్ 1: విజయవాడ రైల్వే డివిజన్‌లో రైళ్ల సమయపాలన మెరుగుపర్చేందుకు దృష్టి కేంద్రీకరించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు.

06/02/2018 - 02:27

విజయవాడ, జూన్ 1: ఎవరు అధికారంలో ఉన్నా సరే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ గుంటూరులో చేపట్టిన న్యాయపోరాట దీక్ష, ఆత్మఘోష పాదయాత్ర విజయవంతం కావడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు.

06/02/2018 - 01:47

హైదరాబాద్, జూన్ 1: దూరప్రాంత సర్వీసుల్లో లింక్ టిక్కెట్ సౌకర్యాన్ని ఈ నెల 2వ తేదీన ప్రారంభిస్తున్నట్లు టిఎస్‌ఆర్టీసి ఎండి జివి రమణారావు తెలిపారు. ప్రయాణీకుడు దూరప్రాంతానికి రిజర్వేషన్ చేయించుకుంటే దిగిన స్టేషన్ నుంచి తాను వెళ్లే గమ్యస్థానానికి కూడా ముందు తీసుకున్న టిక్కెట్‌తో పాటే లింక్ టిక్కెట్ కూడా జారీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

06/02/2018 - 01:40

హైదరాబాద్, జూన్ 1: తెలంగాణ రాష్ట్ర 4వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జన సేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రభృతులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నాలుగేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల సంక్షేమ, అభివృద్ధి కోసం అనేక కార్యమ్రాలు చేపట్టిందని గవర్నర్ నరసింహన్ తన సందేశంలో పేర్కొన్నారు.

06/02/2018 - 01:36

హైదరాబాద్, జూన్ 1: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మోత్కుపల్లిని శుక్రవారం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చంద్రబాబు నిచమైన రాజకీయాలు చేస్తాడని మోత్కుపల్లి ఆయన వివరించినట్టు సమాచారం.

06/02/2018 - 01:34

హైదరాబాద్, జూన్ 1: ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు 5వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లను నమోదు చేయవచ్చని ఎమ్సెట్ అడ్మిషన్స్ కన్వీనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. శుక్రవారం వరకూ 68వేల ర్యాంకు వరకూ ఆహ్వానించగా, ఇంత వరకూ సర్ట్ఫికేట్ల పరిశీలనకు 43,354 మంది మాత్రమే హాజరయ్యారని చెప్పారు.

06/02/2018 - 01:33

హైదరాబాద్, జూన్ 1: తెలంగాణలో భాషా పండితుల కోర్సులో చేరేందుకు నిర్వహించిన ఎల్పీసెట్ ఫలితాలను ప్రకటించారు. తెలుగు పండిట్ ట్రైనింగ్ కోర్సు ప్రవేశపరీక్ష టాపర్‌గా గోపాలదాసు మధు (77 మార్కులు) నిలవగా, ఉర్దూ పండిట్ ట్రైనింగ్ కోర్సు టాపర్‌గా 73 మార్కులతో దుర్దానా బేగం నిలిచింది. హిందీ పండిట్ ట్రైనింగ్ కోర్సులో ఉప్పలపల్లి నరేందర్ 78 మార్కులతో టాపర్‌గా నిలిచారు.

06/02/2018 - 01:16

విజయవాడ, జూన్ 1: భూముల రికార్డుల నిర్వహణను రియల్ టైంలో అనుసంధానం చేసే సింగపూర్ నమూనాను అధ్యయనం చేయాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్న భూసేవ ప్రగతిపై వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. భూసేవ ప్రక్రియ కాగిత రహిత పరిపాలనా వ్యవస్థగా ఉండాలని, జియో టాగింగ్ తప్పనిసరిగా చేయాలన్నారు.

Pages