S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/31/2018 - 05:13

విశాఖపట్నం, మే 30: రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. ఈ వేసవిలో ఎప్పుడూ లేనంతగా బుధవారం పగటి ఉష్ణోగ్రతలు ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వాయువ్య దిశగా వీస్తున్న గాలులు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతల ప్రభావంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతల్లో తీవ్ర పెరుగుదల చోటుచేసుకుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. ఈ పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు.

05/31/2018 - 05:14

డీ.హీరేహాల్, మే 30: చాలాకాలంగా వివాదాస్పదంగా మారిన కర్నాటక, ఆంధ్ర సరిహద్దు బౌండరీల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర బృందం కసరత్తు చేపట్టింది. రెండు నెలల క్రితం అత్యున్నత న్యాయస్థానం కలగజేసుకుని వివాదాస్పద ప్రాంతమైన కర్నాటక, ఆంధ్ర సరిహద్దు బౌండరీలను వెంటనే గుర్తించి త్వర లో ఒక నివేదికను అందజేయాలని సీఈసీ కమిటీకి ఆదేశాలు జారీచేసింది.

05/31/2018 - 05:25

సంగారెడ్డి, మే 30: రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ సాధ్యం కాదంటూ సీఎం కేసీఆర్ ప్రజలను దారిమళ్లించే ప్రయత్నం చేస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పునరుద్ఘాటించారు.

05/31/2018 - 05:26

హైదరాబాద్, మే 30: పాఠశాలలకు వేసవి సెలవులను జూన్ 11 వరకూ పొడిగించాలని, 12న పునఃప్రారంభించాలని ఇటు తల్లిదండ్రులు, అటు విద్యార్థులు, మరోపక్క ఉపాధ్యాయ సంఘాలు ఎంతగా మొరపెట్టుకున్నా ప్రభుత్వం మాత్రం జూన్ 1నుంచే స్కూళ్ల ప్రారంభమని బుధవారం స్పష్టం చేసింది. 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని స్కూళ్లలో పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని పేర్కొంది. 3 ఆదివారం కావడంతో సెలవు.

05/31/2018 - 05:28

హైదరాబాద్, మే 30: తెలంగాణ రాష్ట్రానికి నైరుతీ రుతుపవనాలు జూన్ ఐదోతేదీ వరకు వచ్చే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. కేరళలో మంగళవారం ప్రవేశించిన రుతుపవనాలు బుధవారానికి చాలా వేగంగా ముందుకు కదిలాయి. వచ్చే 48 గంటల్లో ఇవి మరింత ముందుకు కదులుతాయని, జూన్ 3 నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐఎండి వివరించింది.

05/31/2018 - 03:56

రాజమహేంద్రవరం, మే 30: చట్ట ప్రకారం రాష్ట్ర పునర్విభజన బిల్లుకు ఆమోదం లేనందున ఉభయ సభల్లో విభజన జరిగిన తీరుపై చర్చకు ప్రయత్నించాలని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు. వైసీపీ ఎంపీల రాజీనామాలపై పునరాలోచన చేసుకోవాలని స్పీకర్ గ డువు ఇచ్చినందున వర్షాకాల సమావేశాల వరకు వేచిచూసి, చర్చ జరిగేలా నోటీసు ఇవ్వాలని కోరారు.

05/31/2018 - 05:30

ధర్మపురి, మే 30: పాలక వర్గాల అలసత్వం, అధికారుల అవినీతితత్వం వెరసి అత్యంత విలువైన దేవాలయాల భూములు అన్యాక్రాంతాలు అవుతున్నాయి. కోర్టు కేసుల్లో ఉన్నా, దేవాలయాలకు చెందిన భూములైనా, భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియలో వాటి జోలికి పోవద్దని స్పష్టమైన ఆదేశాలున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

05/30/2018 - 04:18

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 29: ఎంసెట్ కౌన్సిలింగ్‌కు సంబంధించి బుధవారం నుండి జూన్ 2వతేదీ వరకు ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ పాండాదాస్ తెలిపారు. 30వతేదీ ఉదయం 11గంటల నుండి ఆప్షన్ల నమోదు ప్రారంభమవుతుంది. సర్ట్ఫికెట్ల ధ్రువీకరణ, లాగిన్‌పాస్‌వర్డ్ పొందిన వారు ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు.

05/30/2018 - 03:33

విశాఖపట్నం, మే 29: ఎంసెట్ సర్ట్ఫికెట్ల అప్‌లోడ్ పూర్తి చేసి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించినప్పటికీ వెబ్ ఆప్షన్ రాకపోవడంతో విద్యార్థుల్లో చోటుచేసుకున్న గందరగోళం రెండో రోజు కొనసాగింది. తొలి సారిగా ధృవీకరణ పత్రాల పరిశీలన, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా చేపట్టారు. ఇంటర్ మార్కులు ఆధారంగా ఎంసెట్‌లో ర్యాంకుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

05/30/2018 - 03:28

హైదరాబాద్, మే 29: లోక్‌సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే మిగిలి ఉన్నందున, తెలుగు దేశం పార్టీ మూడు రోజుల పాటు అట్టహాసంగా ‘మహానాడు’ నిర్వహించింది. విజయవాడలో 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన మహానాడుకు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ తదితర నాయకులు, కొంత మంది కార్యకర్తలూ హాజరయ్యారు.

Pages