S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/02/2018 - 00:46

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 1: రాష్ట్రంలో కాంగ్రెస్ పొలిటికల్ గేమ్ మొదలైందని, రానున్న 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని సీట్లలోనూ కాంగ్రెస్ పోటీ చేస్తుందని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు, సంఘాలతో కాంగ్రెస్ జత కడుతుందన్నారు. టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికీ బీజేపీతోనే ఉన్నాయన్నారు.

06/02/2018 - 00:44

ఏలూరు, జూన్ 1: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీతోనే జతకడతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత జగన్మోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ముందుగా ఎవరితో నూ పొత్తులుండవని, ఆ తర్వాతే హోదా ఇచ్చే పార్టీకి పూర్తిమద్దతు తెలుపుతానని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న జగన్ శుక్రవారం పాలకొల్లులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.

06/02/2018 - 04:10

గజపతినగరం: పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం వద్ద వేలకోట్లు ఉంటాయి, కానీ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఉండవని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం విజయనగరం జిల్లా గజపతినగరంలోని మెంటాడ రోడ్డు జంక్షన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పవన్ విరుచుకుపడ్డారు.

06/02/2018 - 00:35

విజయవాడ, జూన్ 1: ఆన్‌లైన్‌లో అన్ని పౌర సేవలు ప్రజల ఇంటి వద్దకే అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఇప్పటికే పలు సంస్థలు ఈ తరహా వ్యవస్థకు శ్రీకారం చుట్టాయని, తామూ త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి హఠాత్తుగా చనిపోతే చంద్రన్న బీమా ఎంతో ఆసరాగా ఉంటోందన్నారు.

06/01/2018 - 02:00

హైదరాబాద్, మే 31: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకులను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ వెల్లడించారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వేడుకల సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను మంత్రి వెల్లడించారు.

06/01/2018 - 01:55

హైదరాబాద్, మే 31: పాత నేరస్తుల కుటుంబాల్లోని పిల్లలకు విద్య నేర్పించడం ద్వారా వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమాన్ని పోలీసుశాఖ తీసుకుంది.

06/01/2018 - 01:29

రాజమహేంద్రవరం, మే 31: తూర్పు గోదావరి జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, పిడుగుపాటు ఘటనలు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుతో ఒక రైతు మృతిచెందగా, కేబుల్ వైరుకు విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడ్డారు. వివరాలిలావున్నాయి... జిల్లాలో గురువారం మధ్యాహ్నం వరకు భానుడు నిప్పులు చెరిగాడు. ఎండ తీవ్రతకు ప్రజలు అల్లాడిపోయారు.

06/01/2018 - 01:20

హైదరాబాద్, మే 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉన్న ఉపయోగపడే ఫైళ్లు, ఫర్నిచర్‌ను అమరావతికి తరలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ (పొలిటికల్) కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి పేరుతో జీఓ జారీ అయింది.

06/01/2018 - 01:11

హైదరాబాద్, మే 31: తెలంగాణలో ఉద్యోగుల బదిలీలతో పాటు ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా టీచర్ల బదిలీలకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే ముసాయిదా షెడ్యూలును రూపొందించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయ్యే పక్షంలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు. ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తొలగించడంతో మే 25 నుండి బదిలీలకు వీలుకలిగింది.

06/01/2018 - 01:10

హైదరాబాద్, మే 31: ఉపాధి కూలీ చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని పంచాయితీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులును కోరారు. గురువారం ఉపాధి కూలీ చెల్లింపుల జాప్యంపై బ్యాకింగ్, పోస్టల్, గ్రామీణాభాభివృద్ధి శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నిరుపేద కూలీల కోసం చేపడుతున్న ఉపాధి హామీ పథకంలో చెల్లింపుల్లో జాప్యం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pages