S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/23/2017 - 02:23

హైదరాబాద్, డిసెంబర్ 22: నగరంలోని లాలాగూడలో సంధ్యారాణి అనే యువతిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన ప్రేమోన్మాది కార్తీక్‌ను కఠినంగా శిక్షించాలని ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ దారుణ సంఘటనను నిరసిస్తూ లాలాపేట, ముషీరాబాద్‌లో పలు నిరసన కార్యక్రమాలు చేపట్టింది.

12/23/2017 - 02:23

హైదరాబాద్, డిసెంబర్ 22: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో శుక్రవారం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి విచ్చేసిన భారత ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడుకు ఘనస్వాగతం లభించింది. గవర్నర్ నరసింహన్, మండలి చైర్మన్ సామిగౌడ్, సీఎస్ ఎస్‌పి సింగ్, డిజిపి మహేందర్‌రెడ్డి, ప్రోటోకాల్ డిప్యూ టీ డైరక్టర్ అరవిందర్ సింగ్ స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

12/23/2017 - 02:22

హైదరాబాద్, డిసెంబర్ 22: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) మీడియా సలహాదారుగా తిరుమలగిరి సురేందర్ నియమితులయ్యారు. టిపిసిసి ఉపాధ్యక్షుడు, మీడియా ఇన్‌చార్జ్ మల్లు రవి ఈ మేరకు శుక్రవారం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. సురేందర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెస్ అకాడమి చైర్మన్‌గా పని చేసిన సంగతి తెలిసిందే.

12/22/2017 - 23:46

హైదరాబాద్, డిసెంబర్ 22: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు దేవిప్రియ సంపూర్ణంగా అర్హుడని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రశంసించారు. ప్రముఖ కవి, పాత్రికేయుడు దేవిప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేసారు. అలాగే అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీకి ఎంపికైన మరో రచయిత వెన్నా వల్లభరావుకు కూడా ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

12/22/2017 - 23:46

హైదరాబాద్, డిసెంబర్ 22: టీచర్ పోస్టుల సంఖ్యలో, విద్యార్హతల విషయంలో, కనీస మార్కుల విషయంలో ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాట ఆడుతున్నదని తెలంగాణ నిరుద్యోగుల సమావేశంలో పాల్గొన్న వక్తలు మండిపడ్డారు. శుక్రవారం బిసి భవన్‌లో నిరుద్యోగ జాక్ అధ్వర్యంలో జరిగిన నిరుద్యోగ సంఘాల సమావేశానికి బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

12/22/2017 - 23:45

హైదరాబాద్, డిసెంబర్ 22: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది నుండి ఉన్నత విద్యను మరీ ముఖ్యంగా విశ్వవిద్యాలయాలను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం దార్శనిక పత్రాన్ని రూపొందిస్తోంది. అనేక దేశాల్లోని కొత్త వర్శిటీలు సైతం మంచి రేటింగ్ సాధిస్తుండగా, వందేళ్లు పూర్తి చేసుకున్న ఉస్మానియా వంటి వర్శిటీలు సైతం ప్రపంచ స్థాయి వర్శిటీలతో పొటీ పడలేకపోవడంపై ప్రభుత్వం దృష్టిసారించింది.

12/22/2017 - 23:44

హైదరాబాద్, డిసెంబర్ 22: గిరిజనులను ప్రగతి పథంలో నడిపించేందుకు ఉద్దేశించిన ఎస్‌టి ప్రత్యేక అభివృద్ధి నిధిని పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో జరిగిన నోడల్ ఏజెన్సీ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

12/22/2017 - 23:44

హైదరాబాద్, డిసెంబర్ 22: బియ్యం కొనుగోళ్లలో ప్రభుత్వానికి రూ.107 కోట్లు ఆదా చేసినట్లు తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. పాఠశాలల వద్దకే సన్న బియ్యం పంపిస్తున్నట్లు తెలిపారు.

12/22/2017 - 04:40

హైదరాబాద్, డిసెంబర్ 21: రాష్ట్రానికి సరిపడ గిడ్డంగులు ప్రభుత్వం నిర్మించడంతో ప్రైవేట్ గిడ్డంగులను వెంటనే ఖాళీ చేయాల్సిందిగా మార్కెటింగ్‌శాఖ మంత్రి టి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ గిడ్డంగులు ఉన్నప్పటికీ ప్రైవేట్ గిడ్డంగులను ప్రోత్సహించడం తగదని మంత్రి సూచించారు. ప్రైవేట్ గిడ్డంగులలో ఉన్న ధాన్యపు నిలువలను ప్రభుత్వ గిడ్డంగుల్లోకి వెంటనే తరలించాలన్నారు.

12/22/2017 - 04:39

హైదరాబాద్, డిసెంబర్ 21: కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని, ప్రైవేటు రంగంలో ఉన్న చిన్న చిన్న విద్యాసంస్థలను మాత్రం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు విద్యాసంస్థలపై ఏదో కసి పెట్టుకుని , మూసివేసే దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని అన్నారు.

Pages