S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/23/2017 - 03:30

హైదరాబాద్, డిసెంబర్ 22: ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు కేంద్ర మాజీ మంత్రి దివంగత జి. వెంకటస్వామి ‘స్వప్నం’ అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం పూర్తి కావడమే ఆయనకు నిజమైన నివాళి అని ఆయన తెలిపారు. శుక్రవారం ‘కాకా’ మూడవ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

12/23/2017 - 03:28

హైదరాబాద్, డిసెంబర్ 22: ఎఐసిసి పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీ ఇక తెలంగాణ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. 2019లో జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలోగా తెలంగాణను కలియ తిరగాలని ఆయన భావిస్తున్నారు. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నారు.

12/23/2017 - 03:26

హైదరాబాద్, డిసెంబర్ 22: తెలంగాణ రాష్ట్రంలో వివిధ పిజి, యుజి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలకు వారం రోజుల్లో షెడ్యూలు ఖరారు చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వి వెంకటరమణ చెప్పారు.

12/23/2017 - 03:24

హైదరాబాద్, డిసెంబర్ 22: నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయకపోతే సంబంధిత కాంట్రాక్టర్లపై జరిమాన విధించి వసూలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి మంత్రిత్వ శాఖ జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. అనుకున్న సమయానికి పూర్తి కాకపోతే వారానికి ఒక శాతం అపరాధ రుసుమును కాంట్రాక్టర్లపై విధించి వసూలు చేయాలని చెప్పారు.

12/23/2017 - 03:23

హైదరాబాద్, డిసెంబర్ 22: తెలంగాణలో వివిధ యూనివర్శిటీల్లో ప్రధానంగా, ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థిఉద్యమాలు హెచ్చుమీరడంపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విద్యార్థులు తప్పనిసరి తరగతులు హాజరయ్యేలా చూడాలని, అలాగే లెక్చరర్లు పాఠాలు తప్పనిసరి చెప్పేలా చూడాలని ప్రభుత్వం వివిధ వర్శిటీల వైస్ ఛాన్సలర్లకు ఆదేశాలిచ్చింది.

12/23/2017 - 03:21

హైదరాబాద్, డిసెంబర్ 22: ఆటో మొబైల్ రంగ ఈకో సిస్టమ్ తెలంగాణ అత్యంత అనుకూలమైందని పరిశ్రమలశాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. తెలంగాణలో ఇప్పటికే ఆటోమొబైల్ యాన్సిలియరీ కంపెనీలు ఉన్నాయన్నారు. ఎంఆర్‌ఎఫ్, మహీంద్రా, జెడ్‌ఎఫ్ వంటి పలు ప్రముఖ సంస్థలు తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయన్నారు.

12/23/2017 - 02:31

హైదరాబాద్, డిసెంబర్ 22: ఒయు ప్రతిష్టను మంటగలిపేలా జాతీయ సైన్స్ కాంగ్రెస్ వాయిదా వేస్తూ కెసిఆర్ సర్కార్ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని బిజెపి శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం పథకం ప్రకారమే వాయిదావేసిందని ఆయన అన్నారు. శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల నిర్వహణకు ఒక్క సమీక్ష కూడా సిఎం నిర్వహించలేదని అన్నారు.

12/23/2017 - 02:27

హైదరాబాద్, డిసెంబర్ 22: సిద్ధిఅంబర్ బజార్‌లో ఫుట్‌పాత్‌లను ఖాళీ చేయించేందుకు, పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని హైదరాబాద్ నగర మున్సిపల్ కమిషనర్‌ను హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది. నగర మున్సిపల్ అధికారులకు గట్టి సంకల్పం ఉంటే ఆక్రమణలను తొలగించడం కష్టమేమీ కాదని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ జి శ్యాం ప్రసాద్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది.

12/23/2017 - 02:27

హైదరాబాద్, డిసెంబర్ 22: ముఖ్యమంత్రి కెసిఆర్ తన వైఖరి మార్చుకోకపోతే ఇంటిబాట పట్టిస్తామని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఘాటుగా హెచ్చరించారు. ఏ ఒక్క సమస్యను సంపూర్ణంగా పరిష్కరించలేదని మండిపడ్డారు.

12/23/2017 - 02:26

హైదరాబాద్, డిసెంబర్ 22: జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద 966 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో 966 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 500 స్ట్ఫా నర్సు, 233 ఎఎన్‌ఎంలు, 33 వైద్యాధికారి పోస్టులతో పాటు ఇతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ పోస్టులను కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ విధానంలో నియమిస్తారు.

Pages