S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/14/2019 - 05:45

హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో కోడ్ అమలులో ఉన్న సమయంలో జప్తు చేసిన డబ్బుకు సంబంధించి వివరాలు సేకరించి విశే్లషిస్తే ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది. తెలంగాణలో 640 సందర్భాల్లో మొత్తం రూ.84.36 కోట్ల డబ్బు పట్టుబడగా, కేవలం 159 కేసుల్లో 28.27 కోట్ల డబ్బు పట్టుబడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

11/14/2019 - 05:45

హైదరాబాద్, నవంబర్ 13: ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన పంటలు మార్కెట్‌కు వస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. బుధవారం నాడిక్కడ చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

11/14/2019 - 05:44

హైదరాబాద్, నవంబర్ 13: కాచిగూడలో రెండు రోజుల క్రితం జరిగిన ఎంఎంటీఎస్-కర్నూలు-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ రైలు ఢీకొన్న ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణను రైల్వే సేఫ్టీ కమిషనర్ రామ్‌కృపాల్ చేపట్టారు. దాదాపు ఆరు గంటలకు పైగా జరిగిన ఈ విచారణలో కాచిగూడ రైల్వేస్టేషన్ మాస్టర్, డివిజన్ రీజినల్ మేనేజర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

11/14/2019 - 05:30

హైదరాబాద్, నవంబర్ 13: అంతర్జాతీయ చిత్రపటంలో ఒకనాడు ఒక వెలుగు వెలిగిన హైదరాబాద్ ఖ్యాతి ప్రస్తుతం మసకబారిపోయిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏ వర్గం ప్రజలూ సంతోషంగా లేరని విమర్శించింది.

11/14/2019 - 05:30

హైదరాబాద్, నవంబర్ 13: కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా, 38 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న సీఎం కేసీఆర్ ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరిస్తే ఉద్యమిస్తామని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది.

11/14/2019 - 05:36

హైదరాబాద్, నవంబర్ 13: భారత ప్రభుత్వ సాంస్కృతిక కళారంగాల శాఖ ప్రకటించిన అవార్డుల్లో తెలంగాణ అమ్మాయి కృష్ణాద్వైత సృజనాత్మక రచనా రంగంలో స్కాలర్‌షిప్‌నకు ఎంపికైంది. ప్రతిభావంతులైన విద్యార్ధులకు అందించే నేషనల్ కల్చరల్ టాలెంట్ సెర్చి స్కాలర్‌షిప్‌లను 2019-20 సంవత్సరానికి గానూ కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది. సృజనాత్మక రచనా విభాగంలో తెలంగాణకు చెందిన ఎస్వీ కృష్ణాద్వైత ఎంపికైంది.

11/14/2019 - 05:28

హైదరాబాద్, నవంబర్ 13: అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య తర్వాత రెవెన్యూ ఉద్యోగులు ఒకవైపు ఆందోళన చేస్తుండగానే, మరోవైపు ఉద్యోగులను బెదిరించడం, దాడులు జరగడం ఆగలేదని తెలంగాణ రెవెన్యూ జేఏసి ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ రెవెన్యూ జేఏసి పక్షాన జి.

11/14/2019 - 05:27

హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న 14 మంది సెక్షన్ ఆఫీసర్లు, ప్రైవేట్ సెక్రటరీలు 2020 లో వేర్వేరు తేదీల్లో పదవీ విరమణ చేస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా పేరుతో జీఓ (ఆర్‌టీ నెంబర్ 2928) జారీ అయింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.

11/14/2019 - 01:01

హైదరాబాద్, నవంబర్ 13: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రెవెన్యూ కార్యాలయాల దగ్గర పోలీసుల సహకారంతో భద్రతను ఏర్పాటు చేయాలని రాష్ట్ర భూపరిపాలన విభాగం (సీసీఎల్‌ఏ) ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

11/14/2019 - 05:16

హైదరాబాద్: గత ఏడాది ముందస్తు ఎన్నికల వల్ల కొంతకాలం ఆపద్ధర్మ ప్రభుత్వం, ఆ తర్వాత శాసనసభ, గ్రామ పంచాయతీ, పార్లమెంట్, పరిషత్ ఎన్నికలతో వరుసగా ఎన్నికల కోడ్. ఆ వెంటనే కొత్త సచివాలయ నిర్మాణం కోసం పాత సచివాలయం తరలింపు ఇలా ఏదో ఒక ప్రతిబంధంకంతో స్తంభించిన

Pages