S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/12/2019 - 05:29

నిజామాబాద్, నవంబర్ 11: భూ సమస్యలు కొలిక్కి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్న పలువురు రైతులు అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఇదే తరహా సమస్యలతో సోమవారం నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు రైతులు ప్రభుత్వ కార్యాలయాల వద్దకు తరలివచ్చి వేర్వేరుగా ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.

11/12/2019 - 05:06

హైదరాబాద్, నవంబర్ 11: రాజ బహదూర్ వెంకట్రామ్ రెడ్డి తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీలో 678 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లకు శిక్షణనివ్వనున్నారు. ఈ శిక్షణలో సబ్ ఇన్‌స్పెక్టర్లకు అన్ని అంశాల్లో తర్ఫీదు నివ్వనున్నారు. ప్రధానంగా పోలీసు అధికారులు ప్రజలో ఎలా వ్యవహరించాలి. వారితో మాట్లాడే విధానంతో పాటు వివిధ అంశాల్లో ప్రత్యేక శిక్షణనిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ వీకే.సంగ్ తెలిపారు.

11/12/2019 - 03:42

హైదరాబాద్, నవంబర్ 11: ఎర్రజొన్నకు సంబంధించి ఎలాంటి సమస్యలు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఎర్రజొన్న సాగు-సమస్య’లపై చర్చించేందుకు సంబంధిత అధికారులతో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సోమవారం హాకాభవన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కంపెనీలతో అధికారికంగా ఎంఒయూ చేసుకున్న తర్వాతనే విత్తనోత్పత్తి చేయాలని రైతులకు సూచించారు.

11/12/2019 - 03:40

హైదరాబాద్, నవంబర్ 11: తెలంగాణలోని రైతులందరికీ వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర తాత్కాలిక సచివాలయం (బూర్గుల రామకృష్ణారావు భవన్) నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సోమవారం మాట్లాడారు.

11/12/2019 - 03:38

హైదరాబాద్, నవంబర్ 11: రాష్ట్రంలో ఆరేళ్లుగా పాఠశాల విద్య సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని పేర్కొంటూ మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం సోమవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసింది.

11/12/2019 - 03:37

హైదరాబాద్, నవంబర్ 11: ప్రభుత్వం తీరుతెన్నులు గమనిస్తున్న ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నమ్మకం సన్నగిల్లిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బోనస్ ఇవ్వలేమని డబ్బు లేదని చెబుతున్న ప్రభుత్వం సింగరేణి కార్మికులకు బోనస్ ఇవ్వలేదా? అని ప్రశ్నించారు.

11/12/2019 - 03:36

హైదరాబాద్, నవంబర్ 11: అంతర్జాతీయ బహుళ జాతి కంపెనీలు మరోసారి హైదరాబాద్ వేదికపై సందడి చేయనున్నాయి. వివిధ రంగాల్లో పెట్టబడులు పెట్టడానికి అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో ప్రముఖపాత్ర పోషిస్తున్న అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కానున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడానికి అన్ని ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తోంది.

11/12/2019 - 05:51

హైదరాబాద్, నవంబర్ 11: సూర్యాపేట జిల్లా మట్టపల్లి వాస్తవ్యుడు సిరిపురం విశ్వనాధం సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి రూ.50 లక్షలు విరాళాన్ని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు అందజేశారు.

11/12/2019 - 03:27

హైదరాబాద్, నవంబర్ 11: ఆర్టీసీ యూనియన్లతో ప్రభుత్వం చర్చలు జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ప్రభుత్వం నిరంకుశ ధోరణిని విడనాడాలని, నిర్బంధాలకు స్వస్తి చెప్పాలని ఆయన హితవుపలికారు. 38 రోజుల చారిత్రాత్మక సమ్మెను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

11/12/2019 - 01:27

హైదరాబాద్, నవంబర్ 11: మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణలో ప్రతీ ఇంటికీ సురక్షిత మంచినీరు అందించినట్టే దేశ వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్టు కేంద్ర జల్ శక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. ప్రజలకు మంచినీటిని అందించడం ప్రభుత్వాల కనీస కర్తవ్యమని ఆయన అన్నారు. ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచినీటిని అందించే పథకాన్ని చేపట్టాలని యోచిస్తున్నామన్నారు.

Pages