S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/17/2019 - 06:22

హైదరాబాద్, నవంబర్ 16: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆర్టీసీ సమ్మె అంశాన్ని లేవనెత్తుతామని సీపీఐ జాతీయ కార్యదర్శి, ఎంపీ బినయ్ విశ్వం చెప్పారు. సమ్మెను తెలంగాణ ప్రభుత్వం ఆటవికంగా అణచివేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అప్రజాస్వామికమని పేర్కొన్నారు. న్యాయమైన డిమండ్ల కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను సీపీఐ , ఎఐటీయూసీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాయని చెప్పారు.

11/17/2019 - 06:22

హైదరాబాద్, నవంబర్ 16: జిల్లా ప్రజాపరిషత్ డిప్యూటీ సీఈఓలకు డ్రాయింగ్, డిస్బర్సింగ్ అధికారాలను కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీపీ సీఈఓలపై పనివత్తిడి అధికంగా ఉండటంతో డిప్యూటీ సీఈఓలకు ఈ అధికారం ఇచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థలకు సంబంధించినంత వరకు జడ్పీపీలకు ప్రత్యేక స్థానం ఉంది.

11/17/2019 - 06:20

హైదరాబాద్: మాదక ద్రవ్యాల సేవనం హాబీగా ఏర్పడి కాల క్రమేణా అలవాటుగా మారి శరీరానికి, వ్యక్తికీ కుటుంబానికి మొత్తం సమాజానికి ఇబ్బందులను గురిచేస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు. మొదట్లో మాదక ద్రవ్యాల సేవనం తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుందని, సుదీర్ఘకాలం సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో ముప్పు తెస్తుందని అన్నారు.

11/17/2019 - 06:16

హైదరాబాద్, నవంబర్ 16: టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పల్లా నియామకానికి సంబంధించి అధికారికంగా జీఓ వీలైనంత త్వరగా జారీ చేయాలని శనివారం ఆదేశించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది.

11/17/2019 - 06:21

హైదరాబాద్, నవంబర్ 16: తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత విద్యారంగం వికాసానికి బదులు చెదలు పట్టాయని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ మాటలు గురివింద గింజ సామెతలా ఉన్నాయని అన్నారు. విద్యకు సంబంధించిన ఒక విధానం అంటూ ఈ రాష్ట్రానికి ఉందా అని ఆయన నిలదీశారు.

11/17/2019 - 05:41

హైదరాబాద్, నవంబర్ 16: ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గిన నేపథ్యంలో వారి ఇతర డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని మాజీ ఎంపీ కొండా విశే్వశ్వరరెడ్డి అన్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పంతం మాని చర్చలకు కార్మికులను పిలవాలన్నారు. కఠిన వైఖరిని విడనాడాలన్నారు.

11/17/2019 - 01:16

హైదరాబాద్, నవంబర్ 16: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరాదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే టీఆర్‌ఎస్ సర్కార్ ఎందుకు వౌనంగా ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ముందుంటానని పదే పదే చెబుతున్న సీఎం కేసీఆర్ ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు.

11/17/2019 - 01:14

హైదరాబాద్: ప్రతిష్టాకరమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఏఐబీపీ పథకం నుంచి నిధులు మంజూరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేయనుంది. సత్వరమే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి స్కీం కింద కేంద్రం ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు మంజూరు చేస్తుంది.

11/17/2019 - 01:13

హైదరాబాద్, నవంబర్ 16: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు శనివారం చేపట్టిన నిరవదిక నిరాహార దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్‌లో కార్మికుల కదలికలపై పోలీస్ నిఘా, పహారా మధ్య భద్రతా ఏర్పాట్లు కొనసాగాయి. జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్‌రోకోలు తీవ్ర ఉద్రిక్తితలకు దారితీశాయి. బస్‌రోకోలు చేపట్టడానికి కార్మికులు శనివారం తెల్లవారుజామున బస్టాండ్‌ల వద్దకు చేరుకున్నారు.

11/16/2019 - 12:32

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం చర్చలకు పిలవాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తన ఇంటిలో ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేసేందుకు ప్రభుత్వం అనుమతించకపోవటంతో మీర్‌పేట్‌లోని ఊర్మిలానగర్‌లోని తన నివాసంలో దీక్షకు ఉపక్రమించారు. పోలీసులు తనని అరెస్టు చేసినా పోలీసు స్టేషన్‌లో దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు.

Pages