S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/13/2019 - 05:22

మచిలీపట్నం, నవంబర్ 12: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కృష్ణాజిల్లాలోని సాగర తీరాలు జనసంద్రంగా మారాయి. జిల్లా కేంద్రం మచిలీపట్నం శివారు మంగినపూడి బీచ్‌తో పాటు కృష్ణా నది సముద్రంలో కలిసే కోడూరు మండలం హంసలదీవి సాగర సంగమం భక్తులతో పోటెత్తాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత సమీపంలో ఉన్న మంగినపూడి బీచ్‌కు భక్తులు క్యూ కట్టారు.

11/13/2019 - 05:11

సుల్తాన్‌పూర్, నవంబర్ 12: దేశ సరిహద్దు ఆవల ఉన్న చారిత్రక గురుద్వార్‌లను భారతీయ భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆకాంక్షించారు. పాకిస్తాన్‌లోని ప్రసిద్ధ పంజా సాహిబ్, నాన్‌కనా సాహిబ్ తదితర గురుద్వారాల భారతీయ సిక్కులు సందర్శించేందుకు వీలుగా కేంద్రం చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ‘ ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీతో నేను స్వయంగా మాట్లాడి అభ్యర్థిస్తాను.

11/13/2019 - 01:32

హైదరాబాద్, నవంబర్ 12: ఆదివాసీ జీవితాలకు, కళా సాంస్కృతిక రంగానికి చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ‘ఆదిధ్వని’ సంస్థ సేకరించిన 124 సంగీత పరికరాల ప్రదర్శనను గవర్నర్ మంగళవారం సందర్శించారు. స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రత్యేకంగా సంగీత వాద్యాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రతి సంగీత పరికరాన్ని తమిళిసై పరిశీలించి, వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

11/13/2019 - 01:30

హైదరాబాద్, నవంబర్ 12: మానవులంతా ఒక్కటేనని, ధ్యానం ద్వారానే భగవంతునికి చేరువ కావాలని గురునానక్ ప్రబోధించారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గురునానక్ 550వ జయంతి సందర్భంగా ఇక్కడ మంగళవారం జరిగిన గురుపర్వ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన గురునానక్ చిత్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు.

11/13/2019 - 01:34

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం తన అభిప్రాయం చెప్పాలని హైకోర్టు ఆదేశించడంతో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బుధవారమే హైకోర్టుకు తెలియజేయాల్సి ఉన్న నేపథ్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి మంగళవారం సాయంత్రం సీఎం ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.

11/13/2019 - 01:26

హైదరాబాద్, నవంబర్ 12: ఆర్టీసీ సమ్మె అంశం పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు అభిప్రాయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా హైకోర్టు సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైకోర్టులో సమ్మెపై జరిగిన వాదనల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం

11/12/2019 - 05:35

హైదరాబాద్, నవంబర్ 11: తహశీల్దార్ విజయారెడ్డి హత్య తర్వాత ఏర్పడ్డ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదని ఆరోపిస్తూ, రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. రెవెన్యూ జేఏసీ నేత వి. లచ్చిరెడ్డి అధ్యక్షతన సోమవారం ఇక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈ ప్రణాళికను ఖరారు చేసి మీడియాకు విడుదల చేశారు.

11/12/2019 - 05:34

సూర్యాపేట, నవంబర్ 11: ఎస్సారెస్పీ రెండవదశ కింద సూర్యాపేట జిల్లాకు విడుదల చేస్తున్న గోదావరి జలాలు అన్ని ప్రాంతాలకు చేరేలా చూడాలని, అన్ని గ్రామాల్లోని చెర్వులను నింపి జిల్లా రైతాంగం ఇక చాలనేంత వరకు నీటి విడుదలను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసానిచ్చారు.

11/12/2019 - 05:32

గద్వాల, నవంబర్ 11: ‘ప్రతి పనికి లంచాలు తీసుకుంటున్నారు.. అలాగని మాకు న్యాయం చేస్తున్నారా అంటే అదీ లేదు.. లంచాలు మింగి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు.. ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్నారు’ అంటూ రెవెన్యూ ఉద్యోగుల వైఖరిపై రైతులు తీవ్రస్థాయలో ధ్వజమెత్తారు.

11/12/2019 - 06:00

మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన మిలియన్ మార్చ్ సందర్భంగా నిర్వహించిన చలో ట్యాంక్ బండ్ ఆందోళనలో ఆందోళనకారులపై లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ జేఏసీ పిలుపుమేరకు సోమవారం చేపట్టిన మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.

Pages